ఆ మాట విన్న వెంటనే ఓహ్ గుడ్ ఆయమ్మ.. తను ఎవరో ఎక్కడుంటారో నీకు ఏమైనా ఐడియా ఉందా అని ఎక్సయిట్ అవుతూ అడుగుతుంది ప్రతిమ తన పని పూర్తవబోతుంది అన్న హ్యాపీనెస్ లో..
హా తను ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు.. ఆ ఊరిలో మాకు తెలిసిన వాళ్ళు వున్నారు లే.. అక్క వెళ్ళినపుడు తన గురించి తెలిసింది అని చెప్తుంది ఆయమ్మ..
ఓహ్ అలా అయితే మరి మంచిది.. మన పని ఈజీ గ, త్వరగా పూర్తవుతుంది.. మరీ ఆ అమ్మాయి దగ్గరకి ఎప్పుడు వెళ్తావ్?
తనకి కాస్త విషయం చెప్పి తనని ఎప్పుడు ఒప్పిస్తావ్.. అంటే ఆయమ్మ నాకు నువ్వు తప్ప ఇలాంటివన్నీ షేర్ చేసుకునే దగ్గర మనుషులు, హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరుగా అందుకే నిన్నే ఈ పని చేసి పెట్టమని అడుగుతున్నాను..
నీతో ఇలాంటి పనులు చేయిస్తున్నాను అని తప్పుగా అనుకోకు అంటూ ఆయమ్మ ఎక్కడ తనని అపార్థం చేసుకుంటుందో అని ముందే చెప్పేస్తుంది ప్రతిమ..
ఆ మాటలు విన్న వెంటనే అయ్యో అలాంటిదేమి లేదు లే మేడం. మీ పరిస్థితి ఏంటో నాకు అర్ధం అయింది.. ఈ విషయం అందరి దగ్గర చెప్పేది కాదు..