ఎవరి డ్రాయింగ్ బాగుందో చెప్తాను.. నెక్స్ట్ ఎప్పుడైనా డ్రాయింగ్ కాంపిటిషన్ పెట్టినప్పుడు మీలో ఎవరో ఒకరు విన్ అవ్వాలి అని స్మైలీ ఫేస్ తో చెప్తుంది..
ఓకే టీచర్ తప్పకుండ విన్ అవుతాం అంటారు పిల్లలు..
గుడ్ రండి అంటు ఒక్కొక్కరి డ్రాయింగ్ నీ వరస పెట్టి అందరివీ కంప్లిట్ చేసి తనకి బాగా నచ్చిన డ్రాయింగ్ అందరికీ చూపించి ఇదిగో ఈ డ్రాయింగ్ చాలా బాగుంది..
ఈ అమ్మాయికి క్లాప్స్ కొట్టండి.. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంక బాగా వేయడానికి ట్రై చేయండి ఓకే..బెటర్ లక్ నెక్స్ట్ టైమ్..
బట్ హలీడెస్ అప్పుడు ఇంట్లో వున్నప్పుడు కాసేపు డ్రాయింగ్ నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ వుండండి.. అప్పుడు ఈజీ గా వచ్చేస్తుంది ఓకే అంటు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రతిమ..
ఓకే టీచర్ మీరు చెప్పినట్టే చేస్తాం అంటారు పిల్లలు.. ఆ మాటలు విని వెరీ గుడ్.. ఓకే రేపు నేను ఇచ్చిన హోమ్ వర్క్ అందరు కంప్లిట్ చేసుకుని రండి అని చెప్తుంది…