New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 54

మాంగళ్య బంధం – 54

ఆయమ్మ తలుపు కొట్టిన  రెండు నిలుషాల్లో సౌండ్ చేస్తూ తలుపు తెరుచుకుంటుంది..

 

ఆ రెండు నిముషాలే రెండు యుగాల్లా అనిపించింది ఆయమ్మ కి.. పైగా తను ఆ ఇంటికి రావడం ఎవరైనా చూస్తారేమో, ఆ ఇంటి ముందు తనని చూసి తనని కూడా అలాంటి మనిషే అనుకుంటారేమో, ఎక్కడ తన క్యారెక్టర్ నీ తప్పుగా భావించి, తనతో ఇక మీదట ఎక్కడ  చండాలం గా ప్రవర్తిస్తారో అన్న భయంతో చుట్టు చూసుకుంటూ తనని ఎవరు చూడకూడదు అనుకుంటు  త్వరగా తలుపు తెరుస్తే బాగుండు అని ఆశగా ఎదురు చూస్తుంటుంది..

 

ఆయమ్మ ఎదురు చూపులు ఫలించినట్టుగా  తలుపు తెరుచుకుంది.. తలుపు తియ్యగానే ఒక ముప్పై ఏళ్ల అమ్మాయి చాలా పలుచటి చీరని సె*గా ఎక్కడెక్కడ ఏమేమి కనిపించాలో అక్కడ అవన్నీ కనిపించే విధంగా కట్టుకుని, తలలో ఘుమాలించే మల్లెలు మాలగా పెట్టుకుని, పెదవులకి ఆకర్శించే  ఎర్రటి లిప్స్టిక్ రాసి,  మొహానికి లైట్ మేకప్ వేసి, మెడలో సింపుల్ గా ఒక చిన్న చైన్, చేతులకి రెండేసి గాజులు, చెవులకి  వేలాడే కమ్మలు, సింపుల్ గా రెడీ అయిన చాలా హాట్ గా రెడీ అయి వుంది..

 

ఆ అమ్మాయిని చూసిన ఆయమ్మ బాబోయ్ ఈ అమ్మాయి ఇలా రెడీ అయితే మగాళ్లని  రాకుండా చేయడం కష్టమే సుమీ అని మనసులో అనుకుంటూ ఉంటే..

 

ఎవరో కస్టమర్ వచ్చారు.. తన అంద చందాలతో, తన వలపు బాణాలతో వాళ్ళని మురిపించి, మెప్పించి  తనకి కావాల్సినన్ని డబ్బులు  తీసుకోవాలి అని ఎంతో ఆశగా వచ్చి తలూపు తెరిస్తే అక్కడ కస్టమర్ లేకుండా ఎవరో ఆడ మనిషి ఉండడం చూసి ఆమె ఆశ అడియాస అయినట్టుగా మొహాన్ని  కాస్త నార్మల్ గా పెట్టి అసలు ఈవిడ ఎవరు తాలూకానో..

 

నా దగ్గరకి వచ్చే వాళ్లలో ఎవడి పెళ్ళామో, ఎవడి కూతురో ఎవడికి సంబంధించినదో, ఇప్పుడు ఈవిడ నాకు క్లాస్ తీసుకోవడానికి వచ్చిందా  ఏంటి?

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue