ఆ మాటలు వింటున్న ఆయమ్మకి ఆ అమ్మాయికి అలాంటి మాటలు, తిట్లు అన్ని అలవాటే అని స్పష్టంగా అర్ధం అవుతుంది..
ఓహ్ ఈ అమ్మాయి నన్ను ఈ ఊరు మనిషిని తనని ఏదో అనడానికి వచ్చాను అని అనుకుంటుందా అని చిన్నగా నిట్టూర్చి అమ్మాయి నీకు నువ్వు ఏదేదో అనేసుకోకు..
నేను నువ్వు అనుకుంటున్నట్టు ఈ ఊరి మనిషిని కాదు.. నిన్ను ఏదో తిట్టడానికి రాలేదు.. నీతో కాస్త పని ఉండి మాట్లాడడానికి వచ్చాను అని చెప్తుంది ఆయమ్మ..
ఆయమ్మ మాటలు విన్న ఆ అమ్మాయి ఆశ్చర్య పోతుంది.. ఏంటి ఈమె నన్ను తిట్టడానికి రాలేదా.. నాతో పనుండి వచ్చిందా అని మనసులో అనుకుంటూ నాతో మీకేం పని అండి అని చిన్నగా అడిగింది..
చెప్తాను ముందు ఇలా వచ్చి కూర్చో అంటు అక్కడ వున్న సోఫా లో తను కూర్చుని ఆ అమ్మాయిని కూడా తనే చెయ్యిపట్టి లాగి కూర్చోపెట్టి నువ్వు ఈ వేశ్య వృత్తి నీ ఎందుకు ఎంచుకున్నావో నాకు తెలియదు.
ఇది మంచిదో, చెడ్డదో అని చెప్పడానికి కూడా నేను ఇక్కడకి రాలేదు.. ఇది నీ జీవితం నీ ఇష్టం కానీ నువ్వు నాకొక సాయం చేసి పెట్టాలి చేస్తావా అని అడిగింది..