ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ పనికి రాదు.. పాజిటివ్ గా థింక్ చేస్తేనే పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనుకుంటు ఉంటుంది..
తను అలా అనుకుంటుందో లేదో తన ఫోన్ మోగడం, ఆ సౌండ్ కి తేరుకుని ఫోన్ చూసిన ప్రతిమ కి ఆ ఫోన్ ఆయమ్మ నుండి వస్తుందని అర్ధం అయి గాడ్ ఆయమ్మ కాల్ చేస్తుంది..
ప్లేస్ తను గుడ్ న్యూస్ చెప్పేలా చూడు.. ఆ అమ్మాయి ఒప్పుకోకుంటే మేము అలాంటి మరో అమ్మాయిని వెతుక్కునే అంత టైమ్ లేదు..
మేము వెతుక్కుంటూ కూర్చుంటే ఇక్కడ న పెళ్ళి కూడా అయిపోయేలా వుంది అనుకుంటు ఆ అమ్మాయి ఒప్పుకుని ఉండాలి దేవుడా దేవుడా ప్లీజ్ ప్లీజ్ అంటు చిన్న పిల్లల దేవున్ని తెగ ప్రార్ధించేసి చిన్నగా కాల్ లిఫ్ట్ చేసి హలో అంటుంది..
ఆ గొంతు విన్న ఆయమ్మ హలో మేడం.. నేను మీకు చెప్పినట్టే ఈ ఊరికి వచ్చాను.. ప్రస్తుతం ఆ అమ్మాయి దగ్గరే వున్నాను అని చెప్పి గ్యాప్ ఇస్తుంది.
హ్మ్ వున్నావ్ సరే ఇంతకీ తను మన పనికి ఒప్పుకుందా లేదా అది చెప్పు ఆయమ్మ.. నాకు చాలా టెన్షన్ గా వుంది అంటుంది ప్రతిమ..