New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 57

మాంగళ్య బంధం – 57

ప్రతిమ ముందే ప్రణయ్ గురించి కాస్త తెలుసుకోవడం తో అతను ఏ టైమ్ లో ఏ  పొలం దగ్గర ఉంటాడో ఒక అవగాహనా తెచ్చుకుని ఆ అమ్మాయిని అక్కడికే రమ్మని చెప్పింది..

 

అది ప్రతిమ వాళ్ళ పొలానికి పక్కనే వుండే వరి పొలం.. ప్రస్తుతం ప్రణయ్  అక్కడే ఉంటున్నాడు అని తెలిసి అక్కడే పంపుశెట్టు, గది అని ఉన్నాయని అక్కడే ప్లాన్ చేసింది..

 

నైట్ కలలో కూడా సేమ్ అవే ప్లేస్ లు రావడం, తను ఊహించినట్టే అన్ని జరిగి పోవడం తో కచ్చితంగా తన కల నిజం అవుతుంది అని నవ్వుకుని స్నానం చేసి చక్కగా రెడీ అయి రోజులానే తన బ్యాగ్ తీసుకుని బయటకి వెళ్తుంది..

 

బయటకి రాగానే శాంతి లంచ్ బాక్స్ తెచ్చివ్వగానే  సైలెంట్ గా తన బ్యాగ్ లో పెట్టుకుని తల్లికి బాయ్ చెప్పి ఇంట్లో నుండి బయట పడుతుంది..

 

ఆరోజు కాస్త పని ఉందని  స్కూల్ కి ఒక గంట లేట్ గా వస్తానని స్కూల్ లో ముందుగానే పర్మిషన్ తీసుకోవడం ప్లస్, ఆటో బాబాయ్ కి కూడా చెప్పడం తో ఆ ప్రాబ్లెమ్ కూడా లేదు ఆమెకి..

 

కనుక ఎలాంటి కంగారు లేకుండా తన ఇంటి వెనక దారి నుండి తల మీద చీర కప్పుకుని ఎవరు తనని గమనించ కుండా వాళ్ళ పొలం వైపు వెళ్తుంది ప్రతిమ..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue