ఆ అమ్మాయి వెంట శేఖర్ గారు వెళ్లడం దూరం నుండి ప్రతిమ చూస్తుంది.. అక్కడ తన తండ్రి నీ చూసి ముందు షాక్ అయిన అబ్బా మీది ఏమైనా టైమింగ్ నా నాన్నగారు..
కరెక్ట్ టైమ్ కి వచ్చి నాకు ఒక పని తగ్గించారు.. లేదంటే ఈ అమ్మాయి మీ ప్రణయ్ బాబు తో రాస లీలలు ఆడే టైమ్ లో మిమ్మల్ని ఇక్కడకి రప్పించడానికి నేను చాలా తిప్పలు పడాల్సి వచ్చేది..
మీకు మీరే వచ్చి నాకు శ్రమ తగ్గించారు.. చూడండి మీరు అల్లుడిగా కావాలి అనుకుంటున్న అతని అసలు రంగు అని అదోలా నవ్వుకుంటూ వాళ్ళ వైపే చూస్తుంటుంది ఆమె కూడా అటు వైపు చెట్ల వెనక వెళ్లి దాక్కుని..
ఆ అమ్మాయి నేరుగా వెళ్లి ప్రణయ్ భుజం మీద చెయ్యి వేస్తుంది.. పొలానికి పిండి చల్లడానికి ప్రిపేర్ అవుతున్న ప్రణయ్ తన భుజం మీద పడ్డ చేతికి ఉలిక్కి పడి వెనక్కి తిరిగి ఆ అమ్మాయిని చూసి షాక్ అవుతాడు..
కారణం ఆ అమ్మాయి ఎవరో, తను చేసే వృత్తి ఏంటో ప్రణయ్ కి కూడా తెలుసు.. అతనికి ఏమి ఆమె మీద కోపం లేదు..
కాని ఆ అమ్మాయి నీ సడన్ గా తమ ఊరిలో తన పొలం లో చూడడం తో చాలా ఆశ్చర్య పోతాడు.. అది కాక ఆ అమ్మాయి తన భుజం మీద చెయ్యి వెయ్యడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది..