New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 65

మాంగళ్య బంధం – 65

ప్రతిమకి పెళ్ళి మాటలు ఎత్తితేనే చాలా బాధ ప్లస్ కోపం గా వుంది.. కానీ ఏమి చేయలేక అన్నిటికి మౌనం గా తల ఆడిస్తూ ఉంటుంది పక్కనే తండ్రి వున్నాడు అన్న భయం తో..

 

  బట్టలు మరియు నగలు అన్ని తీసుకోవడం పూర్తయిన తర్వాత  ఆ షాప్ లో నుంచి బయటకు వచ్చి బాగా ఎండగా ఉండడంతో  తలా ఒక కొబ్బరి  బోండం తాగుతారు..

 

అవి తాగిన తర్వాత శేఖర్ గారు యశోద, శాంతి, ప్రతిమా వైపు చూస్తూ మీకు ఇంకేమైనా కావాలా ఇక్కడ అంటే గాజులు అలాంటివి ఏమైనా కావాలి అంటే ఇప్పుడే వెళ్లి తీసుకోండి..

 

అదిగో అక్కడ షాప్ కనిపిస్తుంది కదా అక్కడ అయితే మీకు కావాల్సిన వస్తువులు అన్నీ దొరుకుతాయి   అంటు కాస్త దూరంగా ఉన్న ఫ్యాన్సీ స్టోర్ ని చూపిస్తారు..

 

శేఖర్ గారు అలా చెప్పడంతో  మళ్లీ మళ్లీ టౌన్ కి వస్తామొ రామొ అని సరే మేము వెళ్లేసి ఇప్పుడే వస్తాము మీరు వచ్చేలా ఉంటే రండి లేదంటే ఇదిగో  ఈరోజు షాప్ దగ్గరే కూర్చుని ఉండండి  మేము త్వరగా  కావాల్సినవి తీసుకుని వచ్చేస్తాము అని చెప్తారు శాంతి..

 

సరే వెళ్లి రండి అంటూ ఆయన జేబులో నుండి కొన్ని డబ్బులు తీసి శాంతి గారి చేతికి ఇస్తారు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue