New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 73

మాంగళ్య బంధం – 73

మండపం కింద నుండి  ఆ దృశ్యాన్ని చూస్తున్న శేఖర్,శాంతి  దంపతులు మరియు భరత్, భాను యశోద గారు  చాలా సంతోషపడతారు..

 

శేఖర్ శాంతి గారు మనసులోనే సంస్కారవంతుడైన అబ్బాయి తమ కూతురు భర్తగా తమ ఇంటి అల్లుడుగా వచ్చినందుకు  ఎంతగానో ఆనంద పడిపోతుంటారు..

 

యశోద గారు తన భర్తని మనసులో తలుచుకుంటూ మన ప్రేమకి మొదటి ప్రతిరూపం భానూనె అయిన  మీ రూపాన్ని పునికి పుచ్చుకొని పుట్టిన  ప్రణయ్ అంటే   నాకు  భాను కన్నా కొంచెం ఎక్కువ ఇష్టం..

 

ఆ విషయం మీతో పాటు  భాను కి కూడా తెలుసు.. అయినా ఎప్పుడూ భాను ఆ విషయం  గురించి బాధపడింది లేదు..

 

ఎందుకంటే నాతోపాటు భానుకి కూడా తన తమ్ముడంటే ఎంతో ప్రాణం.. మీరు ఉన్నప్పుడే తమ్ముణ్ణి ప్రాణంగా ప్రేమించిన భాను  కి మీరు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయిన తర్వాత  మీ స్థానంలో నిలబడి ఆ చిన్ని భుజాల మీద కుటుంబ బాధ్యతలనీ మోసి సమాజంలో ఒక గౌరవాన్ని  కల్పించిన తమ్ముడు మీద ప్రేమతో పాటు గౌరవం కూడా పెరిగిపోయింది..

 

అలాంటి నా బంగారం నా చిట్టి కన్నయ్యకి  ఈరోజు ఇంతమంది సభ్యులందరి మధ్యలో  చక్కని చుక్క లాంటి అమ్మాయితో  పెళ్లి జరుగుతున్నందుకు నా మనసు ఎంత సంతోషంతో ఉప్పొంగిపోతుందో  నేను మాటల్లో చెప్పలేకపోతున్నానండి..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue