వాళ్లకంటే కాస్త ముందుగానే ఇంటికి వచ్చిన భరత్,భాను యశోద గారు కొత్త దంపతులకు ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉంటారు..
ముందు వెనుక బంధువులు.. మధ్యలో ప్రణయ్ ప్రతిమ ఇంటి గుమ్మం వరకు వెళ్తారు.. అక్కడినుండి బంధువులు పక్కకి తప్పుకోగా నుండి హారతి పళ్లెం తీసుకుని వస్తు ఆగండి ఆగండి ఎక్కడికి నేరుగా ఇంట్లోకి వచ్చేస్తున్నారు..
ఇలా మీ పాటికి మీరు నేరుగా వచ్చేయడానికి ఇప్పుడు మీకు ఛాన్స్ లేదు.. అమ్మ ఆడపడుచు కట్నం ఇవ్వకుండానే భార్యా భర్తలిద్దరూ ఎంచక్కా ఇంట్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా..
అదేమీ కుదరదు.. ముందుగా మీరు ఇద్దరూ దగ్గరగా నిల్చోండి అని చెప్తుంది భాను..
ఆమె మాటలు విన్న వెంటనే ప్రతిమ ఒకసారి భాను వైపు చూసి సైలెంట్ గా తల కిందకి దించేసుకుంటుంది..
ప్రణయ్ మాత్రం అక్క వైపు చూస్తూ అక్క ఏంటి ఇదంతా అవసరమా ఇప్పుడు అని చిన్నగా అడిగాడు..