ఆ భగవంతుడికి మాత్రం తెలీదా ఎవరికి ఎప్పుడు ఏమి అందివ్వాలి అని.. ఆనాడు తండ్రిని తీసుకొని పోయి నువ్వు కష్టాలు ఎదురయ్యేలా చేసి చిన్నతనంలోనే ప్రణయ్ బాబుకి జీవిత పాఠాలు నేర్పించాడు..
ఇప్పుడా బాబు దేన్నైనా ఎదుర్కోగలడు అని నమ్మకం వచ్చాక మంచి రోజులు వచ్చేలా చేసాడు .. ఆ భగవంతుని లీలలు ఎవరికి అర్థం కావు అనుకుంటూ భరత్ ని మురిపంగా చూస్తూ అలాంటి అల్లుడు కొడుకు అందరికీ దొరకాలని అనుకుంటూ భోజనాలు చేస్తుంటారు..
భరత్ అటు ఇటు తిరుగుతూ ఎవరికి ఏమేం కావాలో అన్ని దగ్గరుండి వడ్డిస్తూ, తమ బంధువుల చేత కూడా పనులు చేయిస్తూ అక్కడ భోజనాల దగ్గర ఎవరికి ఎలాంటి లోటు జరగకుండా అందరూ తృప్తిగా తినేలా చూసుకుంటూ ఉంటాడు..
హాల్లోకి వచ్చి కూర్చున్న ప్రణయ్ అక్కడే బొమ్మలతో ఆడుకుంటున్న తన మేనల్లుడు మేనకోడలు నీ దగ్గరికి పిలుస్తాడు..
వాళ్ళిద్దరూ తాము ఆడుకుంటున్న బొమ్మల్ని పక్కన పెట్టి ఏంటి మావయ్య నీకు ఏమైనా కావాలా.. అమ్మ నో, అమ్మమ్మ నో పిలవమంటావా అని ముద్దు ముద్దుగా అడుగుతారు..
వాళ్ల ముద్దు ముద్దు మాటలకి ప్రణయ్ వాళ్ళిద్దరూ ఏ లేత బుగ్గల మీద ముద్దుల అద్ధి నాకేమీ వద్దు.. మీరు ఎవరిని పిలవద్దు కానీ .. మీకు ఆకలి వేయడం లేదా అన్నం తినకుండా ఆడుకుంటూ కూర్చున్నారు అని అడుగుతాడు..