బయటకి వెళ్తున్న భరత్ వైపే చూస్తూ పాపం ఏంటో అన్ని పనులు బావ మీదే పడ్డాయి.. నేనేమైనా సాయం చేస్తాను అన్న పెళ్ళికొడుకు అది ఇది అని ఏ పని చేయటం లేదు..
ఇక్కడేమో నేను తప్ప సహాయం చేసే వారు ఇంకెవరూ లేరు.. ఎంత బంధువులు చేసిన వాళ్ళు అన్ని పనులు చేయరు కదా..
ఇలాంటి సమయంలో పనులు ఎన్ని ఉంటాయో.. అన్ని పనులు అటు ఇటు తిరుగుతూ ఒక్కడే చేసుకోవాలి అంటే చాలా కష్టం కదా..
తనకి ఎంత కష్టంగా ఉన్నా సరే పాపం ఎవరిని ఒక్క మాట కూడా అనకుండా, ఇలాంటి విసుగు, కోపం లేకుండా అన్నీ తానే అయి దగ్గరుండి చూసుకుంటున్నాడు..
నిజంగానే ఇంత మంచి మనసున్న వ్యక్తి మా అక్కకి భర్తగా, మా ఇంటి అల్లుడుగా, నాకు బావగా దొరకడం మేము చేసుకున్న అదృష్టం..
నిజంగా నువ్వు చాలా మంచోడివి బావ.. అల్లుడుగా పెళ్ళి ముహూర్త సమయానికి వచ్చి అతిధి మర్యాదలు చేయించుకుని పోయే వాళ్లే తప్ప, ఇలా వారం పది రోజుల ముందు నుండే వాళ్ళ పనులు కూడా పక్కన పెట్టేసి వచ్చి అన్నిటిని తమ బుజాల మీద వేసుకుని చేసే వాళ్ళు ఎవరు ఉండరు..