New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 82

మాంగళ్య బంధం – 82

నువ్వు చెప్తుంది నిజమేనా అమ్మమ్మ  ఏంటో ఈరోజు మావయ్య మొహం చాలా కొత్తగా ఉంది.. మావయ్య చెంపలన్ని ఎందుకు ఎర్ర ఎర్రగా అయిపోయాయో అర్థం కావడం లేదు అంటూ బుగ్గ మీద చూపుడు వేలితో చిన్నగా కొట్టుకుంటూ ఆలోచిస్తున్నట్టుగా మొహం పెడుతుంది పాప …

 

పాప ఎక్సప్రెషన్స్ చూసిన యశోద, ప్రణయ్ ఇద్దరికీ నవ్వు ఆగదు..నీ చిట్టి బుర్రలో ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి  అంటూ పాపని ముద్దు చేసి నవ్విస్తారు..

 

ఇక్కడ ఇలా ఉండగా బయట భరత్ దగ్గరుండి  ప్రతి ఒక్కరూ కడుపు నిండగా భోజనం చేసేలాగా, అందరికీ అన్ని అందుతున్నాయో లేదో అని గమనిస్తూ  భోజనాలు పూర్తిచేసి వెళ్లిపోయే వాళ్ళకి ఈ చివరగా కిల్లిలు కూడా అందేలా చేస్తాడు..

 

వంటింటి లోపలికి రాబోతున్న ప్రతిమని   వంటింటి  తలుపు దగ్గరే ఆపేసిన భాను  వంటింటి లోపలికి ఆమె వెళ్లి  అక్కడనుండి కావలసిన వస్తువులు అన్నీ తీసుకొని వెనక గుమ్మం నుండి  వంటలు చేసిన వైపు వెళ్తుంది..

 

పెరటి వైపు వెళ్తున్న   భాను నీ ఇటు ఎక్కడికి వెళ్తుంది అన్నట్టుగా అయోమయంగా చూస్తూనే  ఆమె వెంటే ప్రతిమ కూడా వెళ్తుంది.. 

 

అక్కడికి వెళ్లిన భాను  అక్కడ ఉన్న వంట  చేసే గ్యాస్  పొయ్యి దగ్గర ఆగి  ప్రతిమ వైపు చూస్తూ  నీకు వంట చేయడం వచ్చా అని కాస్త అనుమానంగా అడిగింది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue