ఇదేంటి ఒక్క స్పూన్ టేస్ట్ చేయగానే ఆ వంటని ఎవరు చేశారో చేయలేదు అన్న విషయం కూడా చెప్పగలరా.. ఇతనిలో ఇంత టాలెంట్ ఉందా..
వామ్మో నేను ఇతనీ గురించి ఏదో అనుకున్నాను కానీ, ఇతనికి వ్యవసాయం చేయడంలోనే కాదు రుచులను గుర్తుపెట్టుకోవడంలో కూడా చాలా అనుభవం ఉన్నట్టు ఉందిగా అనుకుంటూ చూపుల్ని అతని మీదే నిలుపుతుంది..
తమ్ముడు అడిగిన వెంటనే అవును తమ్ముడు ఈ పొంగలని నేను చేయలేదు అని చెప్తుంది భాను..
మరి ఇది ఎవరు చేశారు అక్క నువ్వు నేను చేయలేదు అంటున్నావు.. అమ్మ కూడా ఇందాకటి నుండి నా దగ్గరే కూర్చుని ఉంది..
అమ్మ చేసింది అనుకోవడానికి కూడా లేదులే..ఇది అమ్మ చేసిన రుచిలా లేదు.. అమ్మ చేసిన పొంగలి రుచి ఇంకోలా ఉంటుంది..
నువ్వు చేయక అమ్మా చేయక ఇంకెవరు చేశారు ఇప్పటికీ ఇప్పుడు పొంగలి..నాకు తెలిసి మన బంధువులు అందరూ కూడా బయట భోజనం చేస్తున్నారు…