సరిగ్గా అప్పుడే ప్రణయ్ అదేం లేదమ్మా పొంగలి చాలా రుచిగా ఉంది.. బయట అందరూ భోజనాలు చేయడం పూర్తయిపోయిందా అమ్మ అని మాట మార్చేస్తాడు..
అతడి నోట్లో నుండి పొంగలి రుచిగానే ఉంది అన్నమాట వినగానే ప్రతిమ కి ఎందుకో సంతోషంగా అనిపిస్తుంది.. తను రాసిన పరీక్షలో 100% రిజల్ట్ వచ్చినంత హ్యాపీనెస్ కలుగుతుంది ఆ క్షణం..
అప్పుడే ఇంట్లోకి వస్తున్న భరత్ అని అడిగిన ప్రశ్నకి సమాధానంగా హా అందరు భోజనాలు పూర్తయ్యాయి. ఊర్లో వాళ్ళు అందరూ ఇళ్ళకి కూడా వెళ్ళిపోయారు..
శాంతి పిన్ని శేఖర్ బాబాయ్ లు కూడా తమ బంధువులు ఊరికి వెళ్ళిపోతున్నారని వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్లారు.
ఇంక మన ఇంటికి వచ్చిన బంధువులలో కొందరు ఇప్పుడే వెళ్ళిపోయారు .. మిగిలిన వాళ్ళు బయట చెట్ల కింద కూర్చుని మాట్లాడుకుంటున్నారు…
ఇంక భోజనం చేయకుండా మిగిలి ఉండేది మనమే.. అదిగో నేను భోజనాలనీ మనకి సరిపోయే అన్ని ఇక్కడికి తెప్పించి పెట్టాను..