ఏరా బావమరిది.. మీ ఆవిడ మా ఆవిడ ఇద్దరు కలిసి నీ రూమ్ని కబ్జా చేశారు..అత్తయ్య వెళ్లి తన రూమ్ లో పడుకున్నారు.. ఇంక ఇక్కడ నువ్వు నేను మాత్రమే మిగిలిపోయాము..
ఈరోజుటికి ఇంకెలానో మన పెళ్ళాల దగ్గరికి మనకి ఎంట్రీ లేదు కాబట్టి మనిద్దరం కలిసి పడుకుందాం పద అని వెంటనే ప్రణయ్ వైపు చూస్తూ రేయ్ నువ్వు ఏమి తేడాగా అర్థం చేసుకోకు..
మనిద్దరం కలిసి పడుకోవడం అంటే ఒకే చోట పడుకుందాం తోడుగా అని.. అంతేగాని ఒకరితో కలిసి ఒకరు పడుకుందామని కాదు ఓకే..
నాకు తెలిసి ఇంట్లో ఈ ఫ్యాన్ గాలి వేడి కంటే బయట హాయిగా చల్లగాలి వస్తుంది.. మనిద్దరం వెళ్లి అక్కడ పడుకుందాం పద..
అసలే వెంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చినట్టుగా నీపెళ్ళి పనులన్నీ చేసి చేసి నా ఒళ్లంతా పులిసిపోయింది..
ఇప్పుడు ఇక్కడ పడుకున్నా నిద్ర పట్టేలా లేదు బయట అయితే ఆ చల్లగాలికి ఎలాగోలా నిద్ర పడుతుంది అంటు ఆరు బయట నవారు మంచాలు వేసుకొని హాయిగా బజ్జుంటారు బావ బావమరిది ఇద్దరు..