New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 87

మాంగళ్య బంధం – 87

సరిగ్గా  అదే సమయంలో ఎవరిదో చెయ్యి ఆమె భుజం మీద పడుతుంది.. దెబ్బకి ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసిన ప్రతిమ  అక్కడున్న వ్యక్తి ని చూసి షాక్ అవుతుంది…

 

టక్కున  పక్కకి తిరిగి తన కనురెప్పల నుండి కారుతున్న కన్నీటిని గబగబా తుడి చేసుకుని  అ.. అత్తయ్య మీరా.. మీరేంటి ఇక్కడ ఈ టైమ్ లో అని అడిగింది తడబడుతూ..

 

హహహ నేనే లే.. నేను కాక ఇంకెవరు అనుకున్నావు అని నవ్వుతు అడిగారు యశోద గారు .. 

 

అ..ది ఎవరు అనుకోలేదు అత్తయ్య..సడన్గా అలా చెయ్యి వేసేసరికి కాస్త  కంగారుగా అనిపించింది అంతే..

ఇక్కడ కాస్త చీకటిగా ఉంది కదా.. సమయం కూడా ఎక్కువ అయిపోయింది..

 

అలాంటిది ఈ సమయంలో ఉన్నట్టుండి మీద చేయి వేసేసరికి అలా ఉలిక్కి పడ్డాను.. అయినా మీరేంటి ఇక్కడ .. మీరు ఇంక నిద్రపోలేదా అని మళ్ళీ అడిగింది ప్రతిమ..

 

హహహ నా సంగతి సరేగాని నువ్వేంటి బంగారం ఈ టైంలో ఇక్కడ..పడుకోలేదా.. నిద్ర పట్టడం లేదా నీకు అని చిరు నవ్వుతో నెమ్మదిగా అడిగింది ఆమె పక్కనే కూర్చుంటు..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue