వైజాగ్‌లో మైరా పుట్టింటి గడప దగ్గర వాతావరణం చాలా భారంగా ఉంది. కన్నకూతురిని పంపలేక రామకృష్ణ గారు, పద్మ గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
మైరా వారిని హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ ఏడుపులో మమకారం కంటే, మళ్ళీ ఈ రాక్షసుడితో వెళ్లాలా అన్న భయమే ఎక్కువగా ఉంది.
ఇషాంత్ కి ఇదంతా విసుగ్గా ఉంది. టైమ్ అవుతోంది, పద అని గద్దించాడు. ఇషాంత్ కి సొంతంగా ప్రైవేట్ చాపర్ ఉండటంతో, అందరూ ఎయిర్‌పోర్ట్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ప్రయాణం మొదలైంది.
చాపర్ గాలిలోకి లేస్తుంటే, కింద చిన్నగా కనిపిస్తున్న తన తల్లిదండ్రుల వైపు చూస్తూ మైరా కళ్లు తుడుచుకుంది.
చాపర్ లో ఇషాంత్ తన హెడ్ ఫోన్స్ పెట్టుకుని బిజినెస్ డీల్స్ లో మునిగిపోయాడు. మైరా మాత్రం కిటికీలోంచి మేఘాలను చూస్తూ, తన జీవితం కూడా ఇలాగే దిక్కు తెలియని ప్రయాణం అవుతోందని బాధపడింది.
సాయంత్రం ఆరు గంటల కల్లా హైదరాబాద్‌లోని వారి రాజభవనానికి చేరుకున్నారు.