తెల్లవారుజామున గెస్ట్ హౌస్‌లో దేవిక గారు లేచి స్నానం చేసి, మైరా త్వరగా కోలుకోవాలని అక్కడే ఉన్న చిన్న పూజా గదిలో దీపం పెట్టారు.
మనసారా వేడుకుని, అమ్మవారికి పెట్టిన తీర్థాన్ని ఒక వెండి గ్లాసులోకి తీసుకున్నారు.మైరా తల్లి.. ఈ తీర్థం తాగు.
ఆ తల్లి ఆశీస్సులు ఉంటే నీ జ్వరం క్షణాల్లో తగ్గిపోతుంది, అంటూ దేవిక గారు మైరా మంచం దగ్గరకు వచ్చారు. మైరా ఇంకా నీరసంగా, జ్వరంతో వణుకుతూనే ఉంది.
సరిగ్గా అప్పుడే ఇషాంత్ తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు. రాత్రంతా మైరాను నేల మీద పడేసి హింసించిన ఆ రాక్షసుడు, ఇప్పుడు ముఖం మీద ఒక దేవదూత నవ్వును పులుముకున్నాడు.
మామ్ నువ్వు ఎందుకు శ్రమ పడతావు,నేనే నా భార్యకు ఈ తీర్థం తాగిస్తాను. తనని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత కదా అంటూ ఆ వెండి గ్లాసును తన చేతిలోకి తీసుకున్నాడు.
దేవిక గారు మురిసిపోతూ, చూడక్కా.. నా కొడుకు ఎంత మారిపోయాడో! మైరా మీద వాడికి ఎంత ప్రేమో అని పక్కనే ఉన్న సుమిత్రాదేవి గారితో అన్నారు.