ప్యాలెస్ నుండి తిరిగి వచ్చాక గెస్ట్ హౌస్‌లో రోజులు భారంగా గడుస్తున్నాయి. మైరా ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నా,
ఇషాంత్ పెట్టిన ఆంక్షలు ఆమెను ఊపిరి ఆడనివ్వడం లేదు. ఇషాంత్ తన భారీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ పనుల్లో మునిగిపోయినా,
దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుంటూ మైరాను మానసికంగా హింసిస్తూనే ఉన్నాడు.
ఆఫీసు నుండి అప్పుడప్పుడు వీడియో కాల్ చేసి, ఆమె ఏం పని చేస్తోందో చెక్ చేయడం, ఆమె భయపడుతుంటే చూసి పైశాచిక ఆనందం పొందడం వాడికి అలవాటైపోయింది.
నువ్వు ఎక్కడికి వెళ్లలేవు మైరా.. ఈ గోడలు, ఈ కెమెరాలు నిన్ను ఎప్పుడూ కనిపెట్టే ఉంటాయి అని వాడు పదే పదే గుర్తు చేస్తూ తన ఈగోను సంతృప్తి పరుచుకుంటున్నాడు.
మైరా తన విధిని తలచుకుంటూ, కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంటి పనులన్నీ ఒంటరిగా చేసుకుంటూ గడుపుతోంది. కొంచెం సమయం దొరికితే ఆ బుక్స్ చదువుకుంటూ కాలం గడుపుతుంది.