నువ్వు నీ పని చెయ్యి బంగారం నా పని నేను చేస్తా అని చందు కి చెప్పి చాణక్య చందుకు చక్కలిగింతలు పెడతాడు ..
చందు కిల కిలా నవ్వుతూ ఏవండీ ఆపండి నేను ఎక్కువ నవ్వలేకపోతున్నాను అంటూ నవ్వుతూనే ఉంటుంది చందు చాణక్య చందు నవ్వుని చూస్తూ కొద్దిసేపు పెట్టి తర్వాత తన ఒడిలోకి లాక్కొని కూర్చోబెట్టుకుని నడుము చుట్టూ చేతులు వేసి నా బంగారం ఈరోజు చాలా నవ్వినట్టు ఉంది అని రెండు చేతులతో మొటికలు విరిచి నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు చాణక్య.
చందు చాణక్య చేసేవి అన్ని అలా చూస్తూ ఉంటుంది చాణక్య చాలా ప్యూర్ గా తనతో బిహేవ్ చేస్తూ ఉంటే చందు కి నచ్చుతుంది ఒకప్పుడు కాలేజీలో నా సీనియర్ ఏనా అన్న డౌటు చందుకొస్తుంది . ఇప్పుడు ఇంతలా చూసే నన్ను ఆఫీసులో ఎందుకు డైలీ తిట్టేవాడు హాఫ్ ఎన్ అవర్ కి ఒకసారి క్యాబిన్ కి ఎందుకు పిలిచేవాడు అని ఆలోచిస్తుంది చంద్రిక.