రాక్షస ప్రేమ -36
“అమ్మాయి విరాజిత రేపు తీర్థయాత్రలకు వెళ్తున్నారు కాబట్టి పిచ్చి పిచ్చి డ్రెస్సులు ఏమి తీసుకొని వెళ్లోద్దు. పద్ధతిగా చీరలు తీసుకొని వెళ్ళు, ఈ నాలుగు రోజులు కూడా నువ్వు పద్ధతి గానే ఉన్నావు కానీ ఇంటి బయట కదా అని ఎలా పడితే అలా ఉండటానికి వీల్లేదు. ఈ పేరుమాళ్ళ వంశం పేరు నిలబెట్టాలి” అని అన్నది కనకమహాలక్ష్మి…
తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాము అని తనకే తెలియకుండా ఇప్పుడు తనని తీసుకొని వెళ్తున్నారు అని ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని విరాజిత కి కనకమహాలక్ష్మి చెప్పిన దానికి ఓకే అన్నట్లుగా తల ఊపింది కానీ తన చూపు అంతా కూడా విరాట్ మీదే ఉంది.
కానీ విరాట్ ఒక్క సెకండ్ కూడా విరాజిత వైపు చూడలేదు.
అంతా వింటున్నా కనకధారా ఏంటో ఈ ముసలిది బయటికి వెళ్ళదు, ఎంజాయ్ చేయదు ఎవరిని ఎంజాయ్ చేయనివ్వదు. పాపం వాడు పెళ్ళి చేసుకుని హనీమూన్ కి వెళ్తాను అంటే వద్దు అని ఆపేసింది. కానీ తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు మాత్రం వెళ్ళమన్నది.
నా కొడుకుని పంపిస్తుంది అని తనకు విరాజిత అంటే ఇష్టం లేకపోయినా కూడా కొడుకు హనీమూన్ కి కాకుండా తీర్థయాత్రలకు వెళ్తున్నాడు అని ఫీలింగ్ తనికి అసహనంగా అనిపించడంతో మనసులు అనుకుంది కానీ బయటికి చెప్పే ధైర్యం మాత్రం చేయలేకపోయింది.