ఉదయం 10 గంటలు…
వర్మ ఇంట్లో అందరూ పెళ్లి సంబంధం వాళ్ల కోసం ఎదురుచూస్తున్నారు.
రాజేశ్వరి ఇంటిని అందంగా అలంకరించింది. సావిత్రి దేవి మాత్రం అర్జున్ దగ్గరకు వచ్చి కూర్చుంది.
“ఏంట్రా అర్జున్… ఇంకా రెడీ అవ్వలేదా?”
“నానమ్మా, నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. వాళ్లే వస్తున్నారు కదా!”
“అబ్బో! మాటలు చూడు. ఒక్కసారి నవ్వుతూ పలకరిస్తే నీకేం పోతుంది?”
అర్జున్ నవ్వుతూ తన ఫోన్ చూసుకున్నాడు.
అప్పుడే విక్రమ్ నుంచి మెసేజ్ వచ్చింది.
Vikram: All the best రా వరుడా! 😂
Arjun: నోరు మూసుకుని నీ పని చూసుకో.
Vikram: సరే. కానీ పెళ్లి కుదిరితే నాకు బెస్ట్ మ్యాన్ పోస్ట్ కావాలి.