“నీ పెళ్లి గురించి మాట్లాడాలి అర్జున్!”
విశ్వనాథ్ తాతయ్య మాటలు విన్న అర్జున్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
“తాతయ్యా… ఇప్పుడేనా ఈ విషయం?”
“ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడుకోవాలి కదా నాన్నా! నీ వయసు కూడా అవుతోంది. నీ జీవితంలో ఒక తోడు ఉండాలి.”
అప్పుడే రాజేశ్వరి కూడా అక్కడికి వచ్చింది.
“నాన్నగారు చెప్పేది నిజమే అర్జున్. మాకు కూడా నీ పెళ్లి చూడాలని ఉంది.”
అర్జున్ తండ్రి దేవరాజ్ నవ్వుతూ అన్నాడు.
“మా అబ్బాయికి నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం. కానీ ముందు వాడి అభిప్రాయం తెలుసుకోవాలి.”
అర్జున్ మాత్రం మౌనంగా ఉన్నాడు.
సావిత్రి దేవి అతని దగ్గరకు వచ్చి అడిగింది.
“ఏమైంది బంగారం? నీకు ఎవరైనా నచ్చారా?”