రోజా – 3
“ఈ గ్లామర్ ఫీల్డ్ లో డెలివరీ తర్వాత కెరియర్ ఉంటుందా డాడ్…??? మీకు అన్ని తెలిసి మీరు కూడా ఇదే ఫీల్డ్ లో ఉండి మీరు ఇలా మాట్లాడటం నాకు నచ్చలేదు.” అని అంది చిరాకుగా ముఖం పెట్టి అనన్య.
“నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టే చెప్తున్నా.. తల్లి అయితే కెరీర్ ఉండదు అని ఎవరు చెప్పారు,మహానటి సావిత్రమ్మకి కూడా మహానటి అనే బిరుదు వచ్చింది తల్లి అయిన తర్వాతే అది నువ్వు మర్చిపోయావు అనుకుంటా.
ఇప్పటికి కూడా… ప్రస్తుతం ఇప్పుడు ఉన్న జనరేషన్ హిరోయిన్స్ కూడా తల్లి అయిన తర్వాత కూడా ఫీల్డ్ లో ఉంటున్నారు ఏదైనా మనం మైంటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది అనన్య.
గ్లామర్ పాత్ర మాత్రమే నిన్ను నటిగా నిలబెడుతుంది అనుకునే అమాయకత్వంలో ఉన్నావు నువ్వు.. నటి అంటే నటించడం అందాలు ఆరబోయడం మాత్రమే కాదు.
ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చాయి మనకి ఇది ఏమి వెనకటి తరం కాదు.. ఇప్పుడు అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటున్నాయి నువ్వు మైంటైన్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది.” అని అన్నాడు జై రామ్.
“మీరు చెప్పే వేదాంతాలు విని ఇప్పుడు అనన్య అమ్మ అయితే గ్లామర్ పాత్రలు వస్తాయా…!!! ఎప్పుడో సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఒక సినిమా తీసుకుంటూ బతకాలి..
అలాంటి జీవితం నా కూతురికి అవసరం లేదు,అయినా ఇప్పుడే అమ్మమ్మ అవ్వడం నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు.
మాకు క్లాసులు పీకడం కాదు మీ అల్లుడికి కొంచెం క్లాసులు పీకి ఇంకొక ఫోర్,ఫైవ్ ఇయర్స్ ఆగమని చెప్పండి.’ అని జై రాం దగ్గర నుంచి ముందుకు వెళ్తూ..’అనన్య పదా క్లబ్ కి టైం అవుతుంది.” అని కూతురుని తీసుకొని వెళ్ళిపోయింది నీలిమ.
వెళ్తున్న భార్యని కూతుర్ని అసహనంగా చూసి అక్కడే ఉన్న సోఫాలో కూలబడ్డాడు ఈ పరిస్థితిని ఎలా దాటాలో అర్థం కాక జై రామ్.
సూర్యుడు సడి చేయకముందే,చంద్రుడు తన పట్టు సడలించక ముందే నిద్రలేచి వాకిలి ఉడ్చి,కల్లాపి చల్లి,ముగ్గు వేస్తూ ఉంది వేకువ జామున నాలుగు గంటలకే రోజా.
చావిడి శుభ్రం చేసి గేదెలకి కుడితి పెట్టి,గడ్డి వేసి,పాలు పితికి…”అమ్మ రోజా కాసిన్ని టీ నీళ్లు పోయమ్మ కొంచెం పొలం కి వెళ్లి నీళ్లు పార పెట్టాలి.” అని అన్నాడు సురేష్ పాల తపాలా రోజా చేతికి ఇస్తూ.
పాలతపాల తీసుకొని..”అత్త ఇంకా తలుపులు తీయలేదు మావయ్య ఎలా పెట్టాను టీ.” అని అంది భయంగా సురేష్ వైపు చూస్తూ రోజా.
“నేను పిలుస్తానులే మీ అత్తని ఆగు..’ అని వెళ్లి తలుపు కొట్టి..’పద్మ తెల్లారింది కొంచెం తలుపు తీయవా…!” అని అన్నాడు సురేష్.
పది నిమిషాలు సురేష్ పిలిచిన తలుపు తీయలేదు పద్మ.
పెరటి వైపు వెళ్లి కిటికీ తీసి ఎదురుగా కనిపిస్తున్న తన 18 సంవత్సరాల కూతుర్ని..”నందు కొంచెం తలుపు తీయమ్మ.” అని పిలిచాడు సురేష్.
మగతగా కళ్ళు తెరిచి కిటికీలోనుంచి కనిపిస్తున్న నాన్నని చూసి..”ఏంటి నాన్న..” అని అంది ఆవలిస్తూ నందు.
“కొంచెం తలుపు తీయమ్మ.” అని అన్నాడు సురేష్ నందుని చూస్తూ.
కాళ్లు ఇడ్చుకుంటూ మెల్లగా వచ్చి తలుపు తీసి వెళ్లి మళ్లీ పడుకుంది నందు నిద్రమత్తులో.
నందు తలుపు తీయగానే గబగబా ఇంట్లోకి వెళ్లే కాసిన్ని పాలు తీసి టీ పోయి పెట్టి మిగిలిన పాలు ఇంకో పోయి మీద పెట్టి కాచి గిన్నెలు కడిగేసి.. సురేష్ కి ఒక చేతిలో నీళ్లు ఒక చేతిలో టీ తీసుకొచ్చి ఇచ్చింది రోజా.
రోజా చేతిలో నుంచి నీళ్లు టీ తీసుకొని తాగి పొలం కి వెళ్ళాడు సురేష్.
సురేష్ వెళ్ళిపోగానే ఇల్లు అంతా ఊడ్చి తడి బట్ట పెట్టి స్నానం చేసి దేవుడికి దీపం పెట్టి గబగబా టిఫిన్ చేసి బట్టలు ఉతికింది రోజా ఉదయం ఏడు గంటలకల్లా.
ఏడున్నరకి లేచి బ్రష్ చేసుకొని…”ఏవే ఈరోజు టిఫిన్ పెట్టేది ఉందా…!” అని అరిచింది కిచెన్ వైపు చూస్తూ పద్మ.
“అత్తయ్య ఇదిగోండి..” అని గబగబా 2 దోశలు ప్లేట్లు పెట్టుకొని చట్నీ తీసుకొని వెళ్ళింది కంగారుగా రోజా.
టిఫిన్ ప్లేట్ తీసుకొని..”కాఫీ ఇవ్వు నా టిఫిన్ అయిపోయాయి సరికి.” అని తినడం మొదలు పెట్టింది పద్మ.
గబగబా కాఫీ ప్రిపేర్ చేయడానికి వెళ్ళింది రోజా.
పొలం నుంచి వచ్చిన సురేష్ స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు పద్మని అక్కడ చూసి.
టిఫిన్ తినడం అయిపోగానే.. “ఏమే చెయ్ కడుక్కొడానికి నీళ్లు ఇస్తావా లేదా ఎండిపోయిన చేత్తో ఇలాగే కూర్చోవాలా..?” అని అరిచింది పద్మ.
“వస్తున్నా అత్తయ్య..”అని పరుగున ఒక చేతిలో కాఫీ కప్పు ఇంకో చేతిలో నీళ్ళమగ్గు పట్టుకొని వచ్చింది రోజా.
ఇక ఉంటాను
మీ అల్లరి రాక్షసి ప్రశాంతి శ్రీకాంత్..❤️❤️❤️
Swipe left/right or tap the sides to turn pages