New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
వద్దన్నా వదిలేస్తానా..? – 3

వద్దన్నా వదిలేస్తానా..? – 3

వద్దన్నా వదిలేస్తానా @2

అప్పటికే విరాట్ కాల్ కట్ అవడంతో.. అక్కడి వారి ఎగతాళి చూపులు అమ్ము మనసుని చీల్చుతుంటే.. మొండిగా అరగంట వరకు కూర్చున్న అమృత, విరాట్ కోసమ్ ఎదురు చూస్తూనే స్పృహ తప్పి నేలకి ఒరిగితే.. విరాట్ ఎక్కిన ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది..

ఉన్నట్టుండి కూతురు అలా ఆకుకూర కాడలా వాలిపోయేసరికి అమృత తండ్రి ఫణీంద్ర గుండె ఒక్కక్షణం ఆగి కొట్టుకుంది.
ఒక్కర్తే కూతురు.. పైగా అమ్ము పుట్టిన దగ్గరనుండే తనకి బాగా కలిసోచ్చిందని, కూతురు అంటే చాలా ప్రేమ ఆయనకి..
ప్రేమ అనేకన్నా “ పిచ్చి” అంటే ఇంకా బెటరేమో..!
అమ్ముకి మాటలు వచ్చిన మొదటి రోజునుండి, ఇప్పటివరకు కూడా తను కోరుకుంది ఏది కాదనలేదు ఆయన.
కూతురు నేల మీద నడిస్తే ఆమె పాదాలు ఎక్కడ మట్టి తాకి కందిపోతాయో అని, ఆమె బుడి బుడి నడకలు మొదలు పెట్టిన నుండి, ఇప్పటివరకు కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా నడవనివ్వలేదు అంటే అతిషయోక్తి కాదు.. కాదని ఆమె పాదం నేరుగా నేలని తాకాలంటే ఖచ్చితంగా ఆ దారి పూల దారే అయ్యేది.
అలాంటిది, అంత అపురూపంగా, ఒక బంగారు గాజు బొమ్మలా, పెంచుకున్న కూతురు అరగంట నుండి కంట్లో కన్నీళ్ళని బలవంతంగా దాచుతూ.. అలా ఉన్నట్టుండి నేలకి జారిపోతుంటే ఆ తండ్రి ప్రాణం ఎంతలా విలవిల్లాడుతుందో ఇక చెప్పే పనేముంది.
“అమ్ము “ అని అరుస్తూ ఆమె తల నేలని చేరేలోపే అక్కడికి చేరిన తండ్రి ఒడిని తాకింది అమ్ము తల.
అమృత అలా పడిపోతున్నప్పుడే అక్కడ ప్రపంచం స్థంభించినట్టు అయ్యి ఎక్కడివారు అక్కడ నిలబడ్డారు బొమ్మల్లా..
అమృతకి మరోపక్క ఆకాంక్ష గారు కూడా కూర్చొని,”అమ్ము…అమ్ము…కళ్ళు తెరవ్వే” అని చెంపలు తడుతుంటే..
అప్పటికే పూర్తి స్పృహను కోల్పోయిన అమ్ములో చలనం శూన్యం.
కోడలు పడిపోగానే, జనార్దన్, ఆయన భార్య కాత్యాయిని మాత్రమే కాదు.. భానుమతి కూడా కంగారుగా అమ్ము దగ్గరికి వచ్చారు.
“అమృత.. “ అని పిలుస్తూ వస్తున్న జనార్దన్ గారిని తలెత్తి చూడకుండానే…”ఆగిపోండి అక్కడే..!” అని చెయ్యి అడ్డు పెట్టాడు ఫణీంద్ర.
“బావా.. అమృత “ అంటున్న ఆయన మాటకి అడ్డొస్తూ…”ఇంకొక్కసారి నా కూతురు పేరు కూడా మీ నోర్లల్లోంచి బయటకు వచ్చిందంటే…నాలుక కోసేస్తాను. జాగ్రత్త..!” అని సీరియస్ గా వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి, కూతుర్ని రెండు చేతుల్లో ఎత్తుకుని మండపం లోంచి కిందకి దిగారు ఫణీంద్ర.
“వదిన గారు.. అన్నయ్యకి మీరైనా చెప్పండి.. నా కోడలు..” అని కాత్యాయిని గారు చిన్నగా అంటుంటే.. “
“అది మీ కోడలు కాదు.. నా కూతురు.. మా కూతురు.. మిస్ అమృత ఫణీంద్ర..అమృత గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్ పర్సన్.. “ అని కోపంగా వాళ్ళను చూసి.. 
“ నా కూతురు బుడి బుడి అడుగులు నేర్చేప్పుడు కూడా ఎక్కడ అడుగు తడబడి కింద పడుతుందేమో అని దాని తండ్రి గుండెల మీద అడుగులు నేర్పాడు నా కూతురికి..!
 కానీ అది ఈరోజు ఇలా.. నీ కొడుకు కోసం పిచ్చి దానిలా ఎదురు చూసి చూసి స్పృహ లేకుండా పడిపోయి ఉంటే…చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా ఆయన.? హు.. అని పొగరుగా ఒక నవ్వు నవ్వి, చూస్తూ ఉండండి ఇక మీ కొడుకు, మీరు ఏమైపోతారో.. “ అని సీరియస్ వార్న్ చేసి భర్త వెనకే వెళ్ళింది ఆకాంక్ష.
ఆవిడ వార్నింగ్, అమృత తండ్రి మాటల్లోని కోపానికి జడిసిన కాత్యాయిని భయంతో భర్త చేతిని గట్టిగా పట్టుకుని, “ ఏవండీ మన విరాట్..!” అంది కంగారుగా.
ఆవిడ భయాన్ని గుర్తించిన జనార్దన్ గారు భార్య భుజం మీద చెయ్యేసి, “ ఏం కాదు విరాట్ కి.. నువ్వు భయపడకు “ అన్నాడు ధైర్యం చెప్తూ.
ఇంతలో వెనకనుంచి భానుమతి “ ఒరేయ్ జనా.. మీ వియ్యంకులు ఏంట్రా తెగ విరుచుకు పడుతున్నారు.. పిల్లనిచ్చే తల్లి తండ్రులు.. మరీ ఇంత పొగరు పనికిరాదు” అని మూతి తిప్పుతూ..
“ ఇంతకీ నీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడు జనా .? “ అని తీరిగ్గా అడిగింది భానుమతి.
తల్లి కాబట్టి ఆవిడ పెద్దరికానికి విలువిచ్చి ఆవిడని ఏం అనలేక కోపంగా ఓ చూపు చూసి, సైలెంట్ గా అక్కడనుండి కిందకి దిగాడు జనార్దన్.
“కూతురిని బెడ్ మీద పడుకోబెట్టిన ఫణీంద్ర, అమ్ము కాళ్ళ దగ్గర కూర్చుని ఆమె పాదాలని ఒడిలో పెట్టుకుని వెంటనే డాక్టర్ కి కాల్ చేసి ఐదు నిమిషాల్లో అక్కడ ఉండాలని ఆర్డర్ వేసి, అమ్ము పాదాలను చేతుల్లోకి తీసుకుని ముద్దు పెడుతూ ఫాస్ట్ గా రబ్ చేయడం స్టార్ట్ చేసాడు ఫణీంద్ర.”
ఆకాంక్ష గారు అమ్ము అర చేతులు రబ్ చేస్తుంటే ఐదు నిమిషాల్లో అక్కడికి వచ్చింది వైజాగ్ లోని ఓ పేరున్న డాక్టర్.
డాక్టర్ ను చూడగానే ఫణీంద్ర, ఆకాంక్ష వాళ్ళు లేచి పక్కన నిలబడితే, వాళ్ళను బయటకే వెళ్ళమని చెప్పి, ఆవిడ డోర్ క్లోజ్ చేసి 3 ఐదు నిమిషాలకి డోర్ ఓపెన్ చేసారు.
అప్పటివరకు డోర్ బయటే గుండెలు అరచేత పట్టుకుని నిలబడిన ఫణీంద్ర, డాక్టర్ డోర్ ఓపెన్ చేయడం ఆలస్యం “డాక్టర్ నా కూతురు..?” అన్నాడు భయంగా.
“ప్లీజ్ మీరు లోపలకి రండి సార్..!” అని చెప్పిన ఆవిడ మాటకి..
ఫణీంద్ర, ఆకాంక్ష లోపలికి వస్తే.. జనార్దన్ అప్పటికే గెస్ట్ లను పంపించేయడంతో అక్కడికి వచ్చాడు.
కానీ రూమ్ లోపలికి ఫణీంద్ర రానివ్వడని బయటే ఉన్నారు జనార్దన్, కాత్యాయిని, భానుమతి.
“డాక్టర్..? “
“ ఫణీంద్ర గారు అమృత ప్రెగ్నెంట్.!” అని చెప్పింది డాక్టర్.
@@@@
To be conducted..