వద్దన్నా వదిలేస్తానా..? – 4
వద్దన్నా వదిలేస్తానా. @4
ఫణీంద్ర, ఆకాంక్ష లోపలికి వస్తే.. జనార్దన్ అప్పటికే గెస్ట్ లను పంపించేయడంతో అక్కడికి వచ్చాడు.
కానీ రూమ్ లోపలికి ఫణీంద్ర రానివ్వడని బయటే ఉన్నారు జనార్దన్, కాత్యాయిని, భానుమతి.
“డాక్టర్..? “
“ ఫణీంద్ర గారు అమృత ప్రెగ్నెంట్.!” అని చెప్పింది డాక్టర్.
డాక్టర్ చెప్పింది వినగానే.. రూమ్ లో ఉన్న ఫణీంద్ర అతని భార్యే కాదు.. రూమ్ బయట ఉన్న జనార్దన్, అతని భార్య, తల్లి.. ఎక్కడి వారు అక్కడే స్థానువైపోయారు.
పరిస్థితి అర్థం చేసుకున్న డాక్టర్ తానే ఓ వైట్ పేపర్ మీద మెడిసిన్ లిస్ట్ రాసి, అప్పటికీ అమ్ముకి ఓ ఇంజక్షన్ చేసి, నీరసంగా ఉంది తాను లేచాక జ్యూస్ తాగించండని ఆకాంక్ష గారికి చెప్పి, వెళ్ళిపోయింది డాక్టర్.
ఆమె వెల్లిపోగానే లోపలికి వచ్చారు జనార్దన్ ఫ్యామిలీ.
కాసేపు పూర్తి నిశ్శబ్దం.. ఆ తర్వాత జనార్దన్ గారు గొంతు సవరిస్తూ.. ఫణీంద్ర భుజం మీద చెయ్యి వేసి “ బావా “ అన్నాడు మెల్లిగా.
సముద్రిడిలా ఉవ్వేత్తున ఎగిసి పడుతున్న ఆవేశంతో టక్కున వెనక్కి తిరిగి.. జనార్దన్ గొంతు పట్టుకున్నాడు ఫణీంద్ర ఆవేశంగా.
“వాడెక్కడ.?” ఎర్రని కళ్ళతో కోపంగా అడిగాడు ఫణీంద్ర.
“బా…వ…నా.. మా…ట..” కష్టంగా ఒక్కో అక్షరం పలుకుతున్న జనార్దన్ మాటలు అసలు పట్టించుకోకుండా..
“విరాట్ ఎక్కడ జనార్దన్.?” మళ్ళీ అడిగాడు ఫణీంద్ర.
@@@
వైజాగ్ లో ఫ్లైట్ ఎక్కిన విరాట్ కొన్ని గంటల్లోనే భువనేశ్వర్ లో ల్యాండ్ అయ్యాడు.
అక్కడనుండి నేరుగా క్యాబ్ బుక చేసుకుని అరగంట లో ఓ హాస్పిటల్ ముందు ఆగగా.. క్యాబ్ దిగిన అతను సెకండ్స్ గ్యాప్ లో ఫాస్ట్ గా లోపలికి దూసుకువెళ్ళాడు.
పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న అతన్ని క్యాబ్ డైవరే కాదు హాస్పిటల్ స్టాఫ్ కూడా వింతగా చూస్తుంటే…వాళ్ళని ఎవ్వర్ని లెక్కచేయని విరాట్ నేరుగా ఐసీయూ దగ్గరకి వెళ్ళాడు.
అక్కడ టెన్షన్ గా నిలబడిన కార్తీక్ స్పీడ్ గా దూసుకువచ్చిన విరాట్ ను చూసి, “విరాట్.. నువ్వు.? “ అని ప్రశ్నిస్తున్న అతనికి సమాధానం ఇవ్వకుండానే..
పరిగెడుతూ రావడం వల్ల గట్టిగా అలుపు తీర్చుకుంటూ.. “దానికెలా ఉంది.?” అన్నాడు కంగారుగా.
“ఏం చెప్పలేము అంటున్నారు విరాట్.. చాలా పవర్ ఫుల్ ఫోయిసన్ తీసుకుంది అంట.. నేను ఎంత క్విక్ రియాక్ట్ అయినా కూడా.. ఫోయిసన్ బాడీలో చాలా వరకు స్ప్రెడ్ అయింది.. ట్రీట్మెంట్ పూర్తయితే కానీ ఏం చెప్పలేము “ అంటున్నారు డాక్టర్స్.
కార్తీక్ చెప్తున్నప్పుడే కోపంగా పిడికిలి బిగించిన విరాట్ ఆవేశాన్ని అణచలేక బిగించిన పిడికిలితో గట్టిగా వాల్ కి పంచ్ ఇస్తూ.. “ రా..క్ష..సి” అన్నాడు.
విరాట్ కోపానికి జడిసిన కార్తీక్ భయపడుతూ…” వి.. వి.. విరాట్ ప్లీజ్ కంట్రోల్ రా.” అని అతని భుజం మీద చెయ్యి వేయగానే..
అతన్ని ముంచేసే సునామిల వెనక్కి తిరిగిన విరాట్ కార్తీక్ గొంతు పట్టుకుని కోపంగా చూస్తూ.. “ అసలేం జరిగింది కార్తీక్ !” అడిగాడు ఆవేశంగా..
కార్తీక్ కష్టంగా ఊపిరి పీలుస్తూ..”నాకేం తెలియదు విరాట్ “ అన్నాడు.
“మరి అది ఫోయిసన్ తీసుకుందని నీకెలా తెలుసు.?” అని అడిగాడు మళ్ళీ గొంతు వదలకుండానే.
“ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైమ్ కి కిందకి వెల్దామని తన రూమ్ డోర్ నోక్ చేశా.. ఎంత సేపైనా డోర్ ఓపెన్ చేయలేదు మహి.. దాదాపు 20 నిమిషాలు ట్రై చేసా.. ఫోన్ చేస్తే కూడా రిసీవ్ చేసుకోలేదు. ఇక ఎందుకో భయం వేసి కింద రిసెప్షన్ కి వెళ్లి స్పెర్ కీ తీసుకోచ్చి ఓపెన్ చేస్తే.. బెడ్ మీద అచేతనంగా ఉంది మహి” అని తాను చూసిందే చెప్పాడు కార్తీక్.
కార్తీక్ చెప్పేది నిజమా, కాదా అనే డైలామా లో పడ్డ విరాట్ అతని కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ.. వాడి కళ్ళు నిజం చెప్తున్నట్టే అనిపిస్తుంటే.. అతని గొంతు వదిలి ”ఫోన్ “ అన్నాడు ఒకే మాట.
వేగంగా ఊపిరి తీసుకుంటూ.. మహిమ ఫోన్ విరాట్ చేతిలో పెట్టాడు కార్తీక్.
అప్పటివరకు లాక్ ఓపెన్ అవ్వలేదు కార్తీక్ కి..విరాట్ కాంటాక్ట్ మాత్రం ఎమర్జెన్సీ నంబర్స్ లో ఉండడంతో విరాట్ కి కాల్ చేసి మళ్ళీ ఫోన్ పోకేట్ లో వేసుకున్నాడు.
ఇప్పుడు విరాట్ లాక్ ఓపెన్ చేయగానే అతని పక్కకి వస్తున్న కార్తీక్ ను అక్కడే ఆగిపోమ్మాన్నట్టు చూపులతోనే శాసించాడు విరాట్.
విరాట్ చూపుకి భయపడి అక్కడే ఆగిన కార్తీక్.. ఫోన్ చూసే కొద్ది విరాట్ మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ కి, టెన్షన్ పడుతూ ఉన్నాడు.
“రేయ్ విరాట్.. ఏమైంది.? “ అన్న కార్తీక్ మాటకి..
“అది బ్రతికినా సరే నా చేతుల్లో చచ్చిపోతుంది.!” పళ్ళు బిగించి అన్నాడు విరాట్ ఫోన్ పాకెట్ లో పెట్టుకుంటూ.
@@@@
“విరాట్ ఎక్కడ జనార్దన్.?” మళ్ళీ అడిగాడు ఫణీంద్ర.
ఫణీంద్ర పట్టుకి కష్టంగా మాటలు కూడబలక్కుంటూ.. “నిజంగా నాకు తెలీదు బావ.!” అన్నాడు జనార్ధన్.
“నాకు కూతురిని మోసం చేసి పెళ్లి పీటల మీదనుంచి పారిపోయిన వాడు..ఎక్కడున్నాడో నీకు తెలీదంటే నమ్మమంటావా..?
కొడుకుని ఓ మోసగాడిని చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేక కోపం వచ్చిన జనార్దన్.. “ బావ నా కొడుకు ఒక ఆడపిల్లని మోసం చేసి పారిపోయేంత మూర్ఖుడు కాదు.
@@@
continued..
స్టోరీ కంటిన్యూ చేయాలంటే కాస్త రీడ్ కౌంట్, ఫ్
కామెంట్స్, ఫాలోస్ ఉండాలి కదా… 🫠
Swipe left/right or tap the sides to turn pages