New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వద్దన్నా వదిలేస్తానా..? – 5

వద్దన్నా వదిలేస్తానా..? – 5

 

వద్దన్నా వదిలేస్తానా.. @5

 

పరిగెడుతూ రావడం వల్ల గట్టిగా అలుపు తీర్చుకుంటూ.. “దానికెలా ఉంది.?” అన్నాడు కంగారుగా.

 

“ఏం చెప్పలేము అంటున్నారు విరాట్.. చాలా పవర్ ఫుల్ ఫోయిసన్ తీసుకుంది అంట.. నేను ఎంత క్విక్ రియాక్ట్ అయినా కూడా.. ఫోయిసన్ బాడీలో చాలా వరకు స్ప్రెడ్ అయింది.. ట్రీట్మెంట్ పూర్తయితే కానీ ఏం చెప్పలేము “ అంటున్నారు డాక్టర్స్.

 

కార్తీక్ చెప్తున్నప్పుడే కోపంగా పిడికిలి బిగించిన విరాట్ ఆవేశాన్ని అణచలేక బిగించిన పిడికిలితో గట్టిగా వాల్ కి పంచ్ ఇస్తూ.. “ రా..క్ష..సి” అన్నాడు.

 

 

విరాట్ కోపానికి జడిసిన కార్తీక్ భయపడుతూ…” వి.. వి.. విరాట్ ప్లీజ్ కంట్రోల్ రా.” అని అతని భుజం మీద చెయ్యి వేయగానే..

 

అతన్ని ముంచేసే సునామిల వెనక్కి తిరిగిన విరాట్ కార్తీక్ గొంతు పట్టుకుని కోపంగా చూస్తూ.. “ అసలేం జరిగింది కార్తీక్ !” అడిగాడు ఆవేశంగా..

 

కార్తీక్ కష్టంగా ఊపిరి పీలుస్తూ..”నాకేం తెలియదు విరాట్ “ అన్నాడు.

 

“మరి అది ఫోయిసన్ తీసుకుందని నీకెలా తెలుసు.?” అని అడిగాడు మళ్ళీ గొంతు వదలకుండానే.

 

“ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైమ్ కి కిందకి వెల్దామని తన రూమ్ డోర్ నోక్ చేశా.. ఎంత సేపైనా డోర్ ఓపెన్ చేయలేదు మహి.. దాదాపు 20 నిమిషాలు ట్రై చేసా.. ఫోన్ చేస్తే కూడా రిసీవ్ చేసుకోలేదు. ఇక ఎందుకో భయం వేసి కింద రిసెప్షన్ కి వెళ్లి స్పెర్ కీ తీసుకోచ్చి ఓపెన్ చేస్తే.. బెడ్ మీద అచేతనంగా ఉంది మహి” అని తాను చూసిందే చెప్పాడు కార్తీక్.

 

కార్తీక్ చెప్పేది నిజమా, కాదా అనే డైలామా లో పడ్డ విరాట్ అతని కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ.. వాడి కళ్ళు నిజం చెప్తున్నట్టే అనిపిస్తుంటే.. అతని గొంతు వదిలి ”ఫోన్ “ అన్నాడు ఒకే మాట.

 

వేగంగా ఊపిరి తీసుకుంటూ.. మహిమ ఫోన్ విరాట్ చేతిలో పెట్టాడు కార్తీక్.

 

అప్పటివరకు లాక్ ఓపెన్ అవ్వలేదు కార్తీక్ కి..విరాట్ కాంటాక్ట్ మాత్రం ఎమర్జెన్సీ నంబర్స్ లో ఉండడంతో విరాట్ కి కాల్ చేసి మళ్ళీ ఫోన్ పోకేట్ లో వేసుకున్నాడు.

 

ఇప్పుడు విరాట్ లాక్ ఓపెన్ చేయగానే అతని పక్కకి వస్తున్న కార్తీక్ ను అక్కడే ఆగిపోమ్మాన్నట్టు చూపులతోనే శాసించాడు విరాట్.

 

విరాట్ చూపుకి భయపడి అక్కడే ఆగిన కార్తీక్.. ఫోన్ చూసే కొద్ది విరాట్ మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ కి, టెన్షన్ పడుతూ ఉన్నాడు.

 

“రేయ్ విరాట్.. ఏమైంది.? “ అన్న కార్తీక్ మాటకి..

 

“అది బ్రతికినా సరే నా చేతుల్లో చచ్చిపోతుంది.!” పళ్ళు బిగించి అన్నాడు విరాట్ ఫోన్ పాకెట్ లో పెట్టుకుంటూ.

 

 

@@@@

 

 

 

“విరాట్ ఎక్కడ జనార్దన్.?” మళ్ళీ అడిగాడు ఫణీంద్ర.

 

ఫణీంద్ర పట్టుకి కష్టంగా మాటలు కూడబలక్కుంటూ.. “నిజంగా నాకు తెలీదు బావ.!” అన్నాడు జనార్ధన్.

 

“నాకు కూతురిని మోసం చేసి పెళ్లి పీటల మీదనుంచి పారిపోయిన వాడు..ఎక్కడున్నాడో నీకు తెలీదంటే నమ్మమంటావా..? 

 

 

కొడుకుని ఓ మోసగాడిని చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేక కోపం వచ్చిన జనార్దన్.. “ బావ నా కొడుకు ఒక ఆడపిల్లని మోసం చేసి పారిపోయేంత మూర్ఖుడు కాదు.

 

 

అయినా వాడు మోసం చేసాడో, ప్రాణంగా ప్రేమించాడో.. ఇక్కడున్న అందరికి తెలుసు..!! నీతో సహా..!! ఇంకా చెప్పాలంటే వాడి ప్రేమకి ఇంప్రెస్స్ అయ్యి నువ్వే నీ కూతురి ప్రేమకి తలవంచి ఈ పెళ్లి చేయడానికి మొదట ముందుకు వచ్చిందే నువ్వు.! అలాంటిది ఇప్పుడు వాణ్ని మోసగాడు అంటున్నావా..? “

 

 

“అదే కదా నేనూ చెప్పేది.. నాకు కూతుర్ని ప్రేమ పేరుతో పిచ్చి దాన్ని చేసి, మా ముందు నిజంగానే నాకు కూతురు అంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించి, నా అంతట నేనుగా వాడితో నా కూతురు పెళ్లి చేస్తాను అనేలా నటించాడు..

 

నా కూతుర్ని అన్నీ విధాలుగా నమ్మించి మోసం చేసాడు..తీరా ఇప్పుడు పెళ్లి అనగానే చెప్పా పెట్టకుండా పారిపోయాడు.. “ కోపంగా అన్నాడు ఫణీంద్ర.

 

“మాటలు తూలకు ఫణీంద్ర.. నా కొడుకు అలాంటి తప్పుడు పని ప్రాణం పోయినా చేయడు..!” ఖచ్చితంగా చెప్పాడు జనార్దన్.

 

“ అంటే ఏంట్రా..? నా కూతురు తప్పుడు పని చేసింది అంటున్నావా..? “ అని ఇక గౌరవాన్ని కూడా వదిలి జనార్దన్ చెంప మీద కొట్టాడు ఫణీంద్ర.

 

“రేయ్ ఫణీంద్ర…ఎంత ధైర్యంరా నీకు..? నా కళ్ల ముందే నా కొడుకు మీద చెయ్యి చేసుకుంటావా..? “ ఆవేశంగా ముందుకు వచ్చింది భానుమతి.

 

జనార్దన్ ను ఆమె వెనక వెనక్కి నిల్చొబెట్టుకుని

 “ అసలు వాడు కానీ మేము కానీ.. ఇప్పటి వరకు అనుకోలేదు గానీ.. ఇప్పుడు అంటున్నాను విను.. నీ కూతురు తప్పు చేసింది కాకపొతే…పెళ్ళికి ముందే ఈ కడుపు ఎలా వచ్చింది అసలు.?” సూటిగా నిలదీసింది భానుమతి.

 

“పెద్దమ్మ గారు.. మీ వయసుకు గౌరవం ఇస్తున్నాం అని మా పెంపకాన్ని తక్కువ చేస్తే ఊరుకునేదే లేదు..” ఆకాంక్ష గారు వచ్చారు ముందుకు.

 

“అబ్బో పెంపకం…!! తెలుస్తూనే ఉంది మీ పెంపకం..!! మీ పెంపకమే అంత మంచిది అయితే పెళ్లి పీటల మీద ఉండాల్సిన నీ కూతురు ఇప్పుడు ఇలా బెడ్ మీద ఉండేదే కాదు..” నిష్టురంగా అంది భానుమతి.

 

“అత్తయ్య గారు.. మీ నోట్లోంచి ఇంకొక్క మాట నా కూతురు గురించి తప్పుగా వచ్చినా…మీ వయసుని కూడా నేను మర్చిపోవాల్సి వస్తుంది..!” వార్నింగ్ టోన్ లో అన్నాడు ఫణీంద్ర.

 

@@@@

 

To be conducted..