వద్దన్నా వదిలేస్తానా.. @6
“అబ్బో పెంపకం…!! తెలుస్తూనే ఉంది మీ పెంపకం..!! మీ పెంపకమే అంత మంచిది అయితే పెళ్లి పీటల మీద ఉండాల్సిన నీ కూతురు ఇప్పుడు ఇలా బెడ్ మీద ఉండేదే కాదు..” నిష్టురంగా అంది భానుమతి.
“అత్తయ్య గారు.. మీ నోట్లోంచి ఇంకొక్క మాట నా కూతురు గురించి తప్పుగా వచ్చినా…మీ వయసుని కూడా నేను మర్చిపోవాల్సి వస్తుంది..!” వార్నింగ్ టోన్ లో అన్నాడు ఫణీంద్ర.
“ఏం చేస్తావురా..?? కొడతావా..?? హా బెదిరిస్తున్నావా నన్ను..? అంటాను ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ అంటాను.. నీ పెంపకం సరైంది కాదు.. నీ కూతురు దారి తప్పింది.. అందుకే వాడు వెళ్లిపోయాడని తెలిసినా కూడా మొండిగా పీటల మీద కూర్చుంది.. ఎక్కడ ఈ పెళ్లి తప్పితే మళ్లీ తన బండారం బయటపడుతుందేమో అని భయపడి నువ్వు వెంటనే పెళ్లి చేయాలి అనుకున్నావ్.. ఇంకా నయం నేను నమ్మే ఆ కనకదుర్గమ్మ నాతోడు ఉండబట్టి, నా మనవడు నీ కూతురు లాంటి దానికి బలి కాకుండా తప్పించుకున్నా…డ్ “
“ ఏం కుశవే ముసల్దానా నిన్నూ.. “ అని ఆవేశంగా చెయ్యి ఎత్తాడు జనార్దన్.