వద్దన్నా వదిలేస్తానా @8
డెకరేషన్ వాళ్ళు అదంతా క్లియర్ చేస్తూ ఉంటే.. అమృత ఫోన్ రింగ్ అవ్వడం చూసి.. లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ అది ఎవరి ఫోనా అని చూస్తున్నారు.
ఫస్ట్ రింగ్ కంప్లీట్ అయ్యాక ఫోన్ ఆఫ్ అవ్వగానే ఆ స్క్రీన్ మీద విరాట్ అమృతల పిక్ చూసి, అది పెళ్లికూతురు ఫోన్ అని గుర్తుపట్టిన వాళ్ళు, తీసుకెళ్లి ఫణీంద్ర గారికి ఇచ్చారు.
సరిగ్గా ఆయన చేతిలోకి చేరగానే మళ్లీ రింగ్ అయింది అమృత ఫోన్.
స్క్రీన్ మీద కనిపిస్తున్న విరాట్ పిక్ చూసి, కోపంతో అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి.