New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
వన్ నైట్ స్టాండ్💘 – 2

వన్ నైట్ స్టాండ్💘 – 2

వన్ నైట్ స్టాండ్ 💘2
Like 💖 Share 💖 Subscribe..🤗
…శ్రీ…
పచ్చటి తోరణాలతో…
పూబంతి మాలలతో…
పరిగెత్తే పిల్లలతో…
బంధుమిత్రుల హడావిడితో…
అల్లరిగా సాగుతున్న, ఆటపాటలతో… 
కాలం తెలియకుండా ఉండే కబుర్లు, కాలక్షేపాలతో…
ఆ ఇంట ఏ మూల చూసినా సంతోషం. బంధువులతో నిండుగా కళకళలాడుతుంది. గలగల వినిపిస్తున్న నువ్వులతో, వాటి మధ్య చిన్న చిన్న చిరాకులు, పరాకులతో, కొత్త చీరలు, కొత్త నగలంటూన్న పాత చింతకాయ కబుర్లతో, ఎటు చూసినా అంతా హడావిడి.
ఒక పక్క పెద్ద ముత్తయిదులు… పసుపు, గంధం, ముత్యాలు చేర్చి, తలంబ్రాల బియ్యం కలుపుతుంటే..
మరొకపక్క ఆ ఇంటి రెండో ఆడపిల్ల అయినా కొత్త పెళ్లికూతురు చుట్టూతా చేరిన ఆ వయసు ఈడు పిల్లల అల్లర్లు, సరదాల కబుర్లు, చిలిపి ఆట పట్టింపులు…
తలంబ్రాలు కలుపుతున్న పెద్ద ముత్తైదువులు చుట్టూతా గమనిస్తూ  సరదాగా వారిలో వారు కూని రాగాలు తీస్తున్నారు….
అమ్మలాలో, తీపి బొమ్మలాలో….
ముద్దుల గుమ్మాలలో…
అల్లరి చేసే ఈడు పిల్లలాలో…
ఆకాశాన్నంటే, ఇంటి సంబరాలు…
ముద్ద బంతి, చామంతి తోరణాలో…
విరిసేను మా ముంగిట సంతోషాలు….
పసుపు, చందన తలంబ్రాలలో….
మెరిసేను అక్షింతల ముత్యాలు…..
మెరిసి మురిసేను ముత్యాలతో …..
జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే పెళ్లి పండగ.
అదే ఆ ఇంట అందరిలో నింపుతుంది, సంతోషాల సంబరాలు.
ఆ ఇంటి పెద్ద కూతురు అంతా సర్దేసి, ఏదో మర్చిపోయినట్టు ఓ దాని కోసం ఇల్లంతా వెతికేస్తుంది. 
ఎంతకీ కావలసింది కనిపించక పోయేసరికి కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం దాని గురించి ఆలోచిస్తూ అలా నిలబడింది.
అబ్బ.. చా! మర్చిపోయినట్టున్నారు. అందుకే ఎంత వెతికినా కనబడటం లేదని ఫిక్సయి గబ గబా తల్లి దగ్గరికి పరిగెత్తింది.
ఇక్కడ ఆవిడ మాత్రం ఖాళీగా ఉందా? 
ఆవిడ పనిలో ఆవిడ కూడా బిజీగా ఉంది.
కంగారుగా వస్తున్న కూతురిని చూస్తూనేఆవిడ మాట్లాడుతున్న వాళ్ళని వదిలేసి కూతురికి ఎదురు వెళ్తుంది.
ఏంటి, ఏమయింది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అన్ని సర్దడం పూర్తయిందా? మండపనికి పంపించేద్దాము అని కూతురిని వివరం అడుగుతుంటే 
అన్ని సర్దడం అయింది అమ్మ. సర్దినంత వరకు అన్ని మండపానికి పంపించేసే వస్తున్నాని చెప్పి
పెట్టుబడి బట్టలలో టవల్స్ కనిపించడం లేదమ్మా నీకు తెలిసి నువ్వు ఎక్కడైనా పెట్టావా? ఒకసారి గుర్తు తెచ్చుకొని చెప్పు, 
నేనైతే అంత వెతికాను కానీ ఎక్కడ కనబడలేదు. అని కన్ఫర్మ్ చేస్తూ లేదంటే, కొనేసి షాప్ లో ఏమైనా వదిలేసి వచ్చామా? ఒకసారి ఆలోచించి చెప్పమ్మా? 
అది ఒక్కటే కనబడటం లేదు అంది రకరకాల ఆలోచనలతో, అంత వెతికి విసిగిపోయిన ఆమె అన్నీ ప్రశ్నలను ఒకేసారి కలిపి మాల గుచ్చినట్టు తల్లిని అడుగుతుంది.
అవన్నీ నువ్వే చూసుకుంటున్నావు  కదమ్మా.  నేనైతే ఎక్కడ చూడలేదు. నీకు కనిపించడం లేదంటే, కచ్చితంగా ఇంటికి వచ్చి ఉండవు. ఆరోజు బట్టలకి ఎవరెవరు వెళ్లారో ఒకసారి అందరిని కనుక్కో అని 
అప్పుడు వదిలేసామొ లేదా ఇంటికి తీసుకొచ్చిన ఎవరి బట్టలలోనున్న కలిసిపోయాయి తెలుస్తుంది.. అంటూ తన ఆలోచన చెబుతోంది ఆవిడ.
కూతురి ముఖంలో కంగారు కాస్త దూరంలో నుంచి చూసిన ఆమె తండ్రి ఏంటమ్మా, ఏమైంది? అమ్మ కూతుర్లు, ఇద్దరు అంత కంగారు పడుతున్నారు దెని గురించి అని అడిగి 
అవతల అల్లుడు గారు నీ గురించి వెతుకుతున్నారమ్మా ముందు వెళ్లి ఆ సంగతి ఏంటో చూడు అని కూతురికి చెప్పి భార్యని ప్రశ్నార్థకంగా చూశారు ఏమయింది అన్నట్టు.
అబ్బా ఏంటండీ మీరు ఇక్కడ పెళ్లి కొడుకుకి వాళ్ళు పెట్టవలసిన పై పంచెలు కనబడడం లేదని మేమిద్దరం కంగారు పడుతుంటే అల్లుడు గారు అంటూ హడావిడి పెడతారు.
అదేదో మీరు చూసుకోండి, ఇక్కడ మాకు చాలా పనులు ఉన్నాయని విసుక్కుంటుంది… ఆయన ఇల్లాలు.
అమ్మ, నువ్వు కాసేపు ఉండు అని తల్లిని ఆపి నాన్న పెట్టుబడి బట్టలలో టవల్స్ కనిపించడం లేదు. 
బట్టలు షాపింగ్ మొత్తం నేనే చూసుకున్నాను. కానీ టవల్స్ షోరూంలో వదిలేసినట్టున్నాము. ఆరోజు హడావిడిలో చూసుకోలేదు, ఇప్పుడు వాటి గురించే ఆలోచిస్తున్నాను.
ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? బ్రహ్మ ముడులుకని, పెళ్ళికొడుకు కోసం తీసుకున్న పట్టు పైపంచ కూడా, వాటిలోనే ఉంది. 
అర్జెంటుగా వెళ్లి అవన్నీ తీసుకు రావాలి అని కంగారు పడుతూ తండ్రి కి మొత్తం వివరంగా చెప్తుంది.
ఆయన అంత టెన్షన్ పడే మనిషి కాదు చిన్న నవ్వుతో కూతురి చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని దీని కోసం ఎందుకమ్మా అంత కంగారు. 
నువ్వు ఒక పని చెయ్యి, నేను షో రూమ్ కి ఫోన్ చేసి చెబుతాను. నువ్వు తమ్ముడిని తీసుకొని బయలుదేరు.
అక్కడ మీరు మర్చిపోతే, అవి తీసుకొని వచ్చేసేయండి. లేదంటే కొత్తవి కొని తీసుకొచ్చేయండి. సరేనా, ఊరికె ఇలా కంగారు పడకు. పద బయలుదేరు అనడంతో తల్లి వైపు చూస్తుంది పర్వాలేదా అన్నట్టు.
హు.. నువ్వు కాలు కదిపితే గాని ఏ పని జరిగేలా లేదులే మీ నాన్న చెప్పినట్టు ఇక ఏ పని పెట్టుకోకుండా తొందరగా వెళ్లి వచ్చేయ్
మళ్ళీ చెల్లి దగ్గర ఉండి చూసుకోవాలి. అలాగే జాకెట్ ముక్కలు, ఇంకో పాతిక పట్టుకు రా. సరేనా అని తొందరగా వచ్చేయమ్మ అంటుంది ఆవిడ కూడా.
తల్లి కూడా ఒప్పుకోవడంతో సరే అని  ఇంకేమైనా కావాలంటే, ఫోన్ చేసి చెప్పమని తల్లికి చెప్పి..
నాన్న మీరు షాప్ కి ఫోన్ చేయండి. అలాగె మీ అల్లుడు గారికి కూడా చెప్పండి . నేను తమ్ముడిని తీసుకొని వెంటనే బయలదేరుతాను అంటూ ఆమె వేగంగా బయటకు వస్తుంది తమ్ముడి కోసం.
ఇంటి బయట మెట్ల దగ్గర నిలబడి ఎవరితోనో ఫోన్లో దేని గురించో నవ్వుతూ డిస్కస్ చేస్తున్నాడు.. మన హీరో
నవ్వుతూ మాట్లాడుతున్న తమ్ముడు ని చూస్తూ.. ఆమె నిలబడింది.
మాటల మధ్యలో… తల తిప్పి చూసిన అతనికి, వాళ్ళ అక్క తనని క్రీగంట అనుమానంగా చూస్తుండడంతో “మళ్లీ మాట్లాడతాను” అని అవతలి వాళ్లకి చెప్పి ఫోన్ కట్ చేసి
ఏంటక్కా అలా చూస్తున్నావు..?? అని అడుగుతూ ఫోన్ పాకెట్లో పెట్టుకున్నాడు.
ఎవరితో రా, అంత నవ్వుతూ మాట్లాడుతున్నావు..??
అని కళ్ళు సాగదీసి అడుగుతుంది.
అక్క అడిగిన విధానంలో అనుమానం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే.. అక్క నువ్వు నీ అనుమానం నా ఫ్రెండ్ అక్క అన్నాడు విసుగ్గా
విసుక్కుంటున్న తమ్ముడిని, నవ్వుతూ చూస్తూ.. ఎ ఫ్రెండ్ రా, బాయ్ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్ ఆ…? హా చెప్పరా అని కళ్ళు ఎగరేస్తుంది.
అబ్బా అక్క బాయ్ ఫ్రెండ్,  గర్ల్ ఫ్రెండ్  ఏంటక్కా?
ఫ్రెండ్ అంటే ఫ్రెండే. అలా డిఫరెన్సెస్ తీసుకు రాకు అని తను నా ఫ్రెండ్ అక్క. జస్ట్ ఫ్రెండ్ అంటాడు ఒత్తి పలుకుతూ
‘తను’ అంటే అమ్మాయి..!! అంటే గర్ల్ ఫ్రెండ్! అంతే కదా?
అని ఒక్కో మాట తమ్ముడిలాగే వత్తి పలుకుతూ తమ్ముడిని మరింత అనుమానంగా చూస్తుంది.
అయ్యో, ఏంటక్కా నువ్వు పొద్దున్నే ఇలా తగులుకున్నావు? తను నా ఫ్రెండ్, అంతే అని నాతో పాటు కలిసి చదువుకుంది అని అక్క అనుమానంతో వస్తున్న చిరాకుని కంట్రోల్ చేసుకుంటూ చెప్పాడు.
అయితే…గర్ల్ ఫ్రెండ్, లవ్, ఎఫైర్స్ ఇలాంటివి ఏమీ తనతో లేవన్నమాట? అంది వెటకారంగా.
ఈ సారి నోరు తెరిచి ఆన్సర్ చేయకుండా అసహనంగా తన  రెండు చేతులు నడుము మీద పెట్టుకొని… మరి సాగదీస్తున్న అక్కని చూస్తాడు.
ఆ చూపు ఏంటి, ఆ వేషాలేంటి? ముందు అడిగిన దానికి చెప్పు. ఉన్నాయా, లేవా..?? అని తమ్ముడి కోపానికి నెత్తి మీద ఒకటి వేసి దబయించి అడిగింది.
కొట్టడమైన తిట్టడం అయినా, అడగడం అయినా కసరడమైన, అనుమానించిన అనురాగాన్ని పంచిన మన హీరో దగ్గర తల్లిదండ్రుల కన్నా మించిన స్థానం ఆమెది.
అక్క కాకుండా ఇంకెవరైనా అయితే అసలు అతను కేర్ చేయడు.
ఆహా ఈరోజు నీకు ఏదో అయ్యింది అని నాకు అటువంటివి ఏమీ లేవు. అయినా ఉంటే ముందు నీకే చెబుతాను సరేనా. 
నీకు నచ్చి నువ్వు ఓకే చెప్పిన తర్వాతే ఏదైనా స్టార్ట్ చేస్తాను అని గుర్రమంటాడు.
ఉమ్ సరే నా తమ్ముడు మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉందిలే అని తన డ్రామా కి తెర దించి నమ్ముతున్నాను అంది స్వచ్ఛమైన నవ్వుతో.
ఇంతసేపు తనతో ఆడుకుని ఇప్పుడు నవ్వుతున్న అక్కని కళ్ళు చిట్లించి చూస్తూ… నీకు ఏ పని లేదా అక్క? నామీద నిఘ వేస్తున్నావు అని రుస రుసలాడాడు.
ఇంత హడావిడిలో  నీ మీద నేను నిఘా వేయడం అని చుట్టూ ఉన్న హడావిడి చూపిస్తూ అదే చెదరని నవ్వుతో నా తమ్ముడు మీద నిఘా వేయవలసిన అవసరం లేదు గాని, 
దా.. దా.. వెళ్దాం అర్జెంట్ అని తమ్ముడి చేయి పట్టుకొని లాక్కెలుతుంటే ఎక్కడికి ఏంటని అడుగుతున్న చెబుతా రా అంటూ అలాగే కార్ దగ్గరికి లాక్కొచ్చింది.
@@@@@@@@@
తదుపరి భాగంలో, మన కథానాయక ఆగమనం.
నాతో పాటు పయనిస్తూ, మీ ఆదరణ అందిస్తారని ఆశిస్తున్నాను.
థాంక్యూ సో మచ్.
__వర్ణ.