New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వేధించిన మనసు – 2

వేధించిన మనసు – 2

మంచి అబ్బాయి,, అతనితో మంచి జీవితం ఉంటుంది నీకు జానూ ,, వాళ్ల కుటుంబం కూడా చాలా మంచిది…,, చాలా సంవత్సరాల నుండి చూస్తున్నాను అబ్బాయిని,, చీమకు కూడా హానిచేయని గుణం అతనిది….

 

అబ్బాయి పేరు అర్జున్..మంచి వ్యక్తి,తనను కలిసి ఒకసారి మాట్లాడిన తరువాత నువ్వే అంటావు… నాన్న అర్జున్ చాలా మంచి వాడు.. నేను తననే పెళ్లి చేసుకుంటాను నాన్న అని…

 

ఎందుకంటే నువ్వు నా జీవితంలోకి వచ్చిన రోజు నుంచి నా ప్రపంచమే మారిపోయింది జానమ్మ . నీ చిన్న నవ్వు కోసం నేను పడ్డ కష్టం కూడ సంతోషమే … నీ కళ్లలో కన్నీరు నా గుండెకు చెప్పలేని బాధను తెలుపుతుంది…

 

అందుకే నా కన్నా ఎక్కువగా ప్రేమించే అబ్బాయి ని భర్తగా ఇవ్వాలి అని ఈ తండ్రి పడే ఆరాటం.. ఇది నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు… పెళ్లి అయ్యి,, పిల్లలు పుట్టాక ఒక వయసు వస్తుంది అప్పుడే నిజమైన తండ్రి ప్రేమ,,, తల్లి,, అన్నదమ్ముల ప్రేమ తెలుస్తుంది…

 

అ సమయంలో ని చుట్టూ ఉన్నది ఎంత నిజం,, ఎంత అబద్ధం అనేది కూడా అప్పుడే సరైన ఆలోచనలతో కనిపిస్తుంది కంటికి….

 

కొన్నిసార్లు కంటికి కనిపించింది నిజం కాదు,,, చెవులతో విన్నది కూడా నిజం కాదు… వయస్సు తొందరతనమోతో తెలియకపోదు….

 

రాత్రి నీతో అలా మాట్లాడి ఉండకూడదు కానీ తప్పే,, ప్రేమగా చెప్పింటే బాగుండేది కదా… ఎదిగిన కూతురు భవిష్యత్తు కోసం కొన్నిసార్లు తండ్రి కోపం,,, చిరాకు,,, కట్టినమైన వాడిలా కూడా అవుతారు…

 

బయట జరిగే వాటిని మనసులో పెట్టుకొని బాధ పడకు…తప్పుగా అనుకోకుండా మనసు,,, మెదడు ఒక చోట పెట్టి మంచిగా చదుకో మరి…

 

కాలేజీ వచ్చింది దిగి వెళ్ళమ్మా జానూ అని చెప్పి బండి ఆపాడు రంగనాధ్… బండి దిగి వెళ్తాను నాన్నగారు అంది…

 

రంగనాధ్ వెళ్లిపోయారు,,, జానూ లోపల వెళ్ళగానే తన స్నేహితులు దగ్గరికి వచ్చి,, ఏమి అయ్యింది జానూ మొఖం అలా వాడిపోయింది…

 

ఏమి ఉంది పెళ్లి సంబంధం వచ్చింది,, పెళ్లి చేసుకో పిల్లడు మంచోవాడు,,, అది ఉంది,, ఇది ఉంది,, జాబ్ ఉంది ఆస్తులు ఉన్నాయి అని గొప్పగా చెప్పి,, వాడి నాకిచ్చి చేద్దాము అని చుస్తున్నారు…

 

నాకు ఏమో ఈ పెళ్లి ఇష్టం లేదు ఏమి చేయను…వాడు ఎవడో అసలే ఇష్టం లేదు,,, రేపే పెళ్లి చూపులు అంట,,, వాడితో మాట్లాడిన తరువాత ఈ సమాధానం నువ్వే చెప్పు కానీ ఈ పెళ్ళికి ఒప్పుకోవాలి అని ఒక షరతు నాకు ఏంటి పెట్టారు ఏమి చేయను…

 

మరి ఏమి చేదాం అంటావు జానూ అని రమ్య అడిగింది… అదే ఏమి అర్ధం అవ్వడం లేదు…పక్కన ఉన్న నేహా,, ముందు ఇది తమరి ప్రియమైన ప్రియుడికి చెవిలో ఉద్దు,,, తరువాత ఏమి చేద్దాం అంటారో తిరిగ్గా,, శనగ కాయలు తింటూ మాట్లాడం లేదా ఇప్పుడు క్లాస్ వెళ్లకపోతే,,, అసలే అక్కడ ఉన్నది శుర్పణక జాతి చెందిన మనిషి…

 

కొంచెం తేడా కొట్టిన ఆమాత్రం మనల్ని నమిలి మింగుతుంది…పడండి ముందుకు,,, అన్ని పరువు పెట్టి మరి క్లాస్ వెళ్లారు ముగ్గురు తోడు దొంగలు…

 

క్లాస్ అన్ని రోజుల కొంచెం బోరుగా,,, కొంచెం జోక్ గా సాగింది ఆరోజు… జానూ రామ్ గురించి అంత వెతికిన,, రామ్ కనపడలేదు,,NCC వాళ్ళు పిలిస్తే వెళ్ళాడు అని తెలిసింది…

 

వాళ్ళ దగ్గర వెళ్ళితే ఇప్పుడే రాడు అని తెలిసి,, జానూ తిరిగి ఇంటికి వెళ్ళింది… రోజులనే వాళ్ళ అమ్మ వంట చేసింది.. అందరూ కలిసీ తిన్నారు,, ఎవరికీ గదికి వాళ్ళు వెళ్లిపోయారు…

 

లక్ష్మి గదికి వచ్చింది,, వచ్చి రంగనాధ్ పక్కన కూర్చొని,, ఎందుకు అంది ఇప్పుడే జానూ పెళ్లి చేదాం అనుకుంటున్నారు…. పాపం తాను ఇంకా చిన్న పిల్ల కదా,, అప్పుడే అది మనల్ని వదిలి వెళ్ళిపోతుంది అంటే,,, చాలా బెంగగా ఉంది ఇప్పటి నుండే,, నాకు ఎందుకో నచ్చడం లేదు మీరు చేస్తున్న పని అని లక్ష్మి ఏడుస్తూ చెప్పింది….

 

ఎంత కాదు అనుకున్న తల్లిను కదా అనే బాధ నాకు ఎక్కువగా మనసు మెలిపెట్టి తిప్పుతుంది అండి అంది లక్ష్మి…

 

నీకు ఒక్కటి చెప్పనా లక్ష్మి,, మన పెళ్ళి అయ్యిన తరువాత నువ్వు ఈ ఇంటికి కోడల్గా వచ్చినపుడు,, ఒకరు కుడా ఆడపడచుగా కానీ,,, అమ్మ కానీ,,, లేదా దూరం చుట్టాలు అయ్యిన అక్కచెల్లమ్మలు కానీ రాలేదు ఎందుకో తెలుసా,,, నీకు తెలియదు నాకు ఎవరు లేరు ఏమో అని అనుకున్నావు కానీ నాకు అందరూ ఉన్నారు లక్ష్మి…

 

ఎందుకు ఎప్పుడు చెప్పలేదు అంటే,, చెప్పే సందర్బo ఎప్పుడు మన మధ్యలో రాలేదు… ఇప్పుడు చెపుతున్న విను..

 

నాకు అమ్మ,, నాన్న ఒక చెల్లి ఉన్నారు.. తాను చాలా అందమైన,, తెలివితేటలు ఎక్కువ ఉన్న పిల్ల అని మా నాన్న తనను నెత్తిన పెట్టి చూసుకున్నాడు…

 

బాగా అల్లరి చేసేది,, వయసు వచ్చాక కూడా అదే అల్లరి చేస్తే మా అమ్మ మందాలించిన,, మా నాన్న తనను, తన అల్లరిని గుండెల్లో పదిలంగా చూసుకునేవాడు…

 

అలాంటి మా కుటుంబంలో ప్రేమ అనే మొక్క వయసుతో సంబంధం లేకుండా వచ్చి,, మా నుండి మా చెల్లి దూరం చేసింది… ఎంతలా అంటే మళ్ళీ లేవకుండా చేసింది లక్ష్మి..

 

మా చెల్లి పేరు చిత్ర,, తాను ఒక చిత్రమైనా అమ్మాయియే… నన్ను చిన్న బడికి పంపి,,,తనను పెద్ద బడికి,, బస్కు పంపించారు…

 

బాగా చదుకొని,,మంచి మార్కులు తెచ్చుకుంది,,, పెద్ద కాలేజీ యందు చేరింది,, రెండు సంవత్సరాలు బాగా చదివింది…

 

 

ఇంకా ఉంది…..

 

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్…..