“అంతా ఓకే.. కానీ..! మేము కలకత్తాకి వచ్చి జస్ట్ 9 మంత్స్ అయింది అంతే.
హైదరాబాద్ అయితే అన్నీ తెలుసు కానీ..! నేను అక్కడ వ్యక్తులని కాంటాక్ట్ చేస్తే ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు..” అని అన్నాడు అర్జున్.
“మేము కూడా హైదరాబాద్ కాకపోతే డాడీ కి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాక ఇక్కడకి వచ్చాం.
మీకు అభ్యంతరం లేకపోతే నాకు డీజీపీ సార్ తెలుసు,ఒకసారి ఫోన్ చేసి మాట్లాడమంటారా..!” అని అడిగింది శుభశ్రీ.
“థాంక్యూ.. మాట్లాడు..” అని అన్నాడు కొంచెం స్థిమిత పడుతూ అర్జున్.