New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 13

♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 13

చూసావా అమ్మ అది ఎలా మాట్లాడుతుందో. నా పిల్లల్ని పద్ధతి తెలియకుండా పెంచాను అని అంటుంది. అసలు దీనికి తెలుసా పద్ధతి గురించి నా పిల్లల్ని అనడానికి.అయినా ఇది అన్నంత మాత్రం నా పిల్లలు పద్ధతి లేకుండా పెరిగినట్టా ఏంటి అని అంటారు రాధిక గారు.

 

 

చూడు వదిన నా పిల్లలు అంటే మాత్రం నేను ఒప్పుకోను అని అంటారు పార్వతి గారు.

 

పద్ధతుల గురించి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి కనీసం కట్టుకున్న మొగుడికి టయానికి  భోజనం పెట్టడం చేతకాదు కానీ మీ ఇద్దరు వాటి గురించి ఎందుకులే మాట్లాడుకునేది వచ్చి ముందు భోజనం చేయండి. తర్వాత తీరుబడిగా వాదన ఆడుకుందురు గాని అని అంటారు పూర్ణ గారు.

 

 

చూశారండి అత్తయ్య గారు ఎలా అంటున్నారు. నేను మన అధితి ని పద్ధతి గానే పెంచాను కదా. అయినా కూడా నన్ను ఎన్ని మాటలు అంటున్నారో చూడండి. 

ఊరుకో పార్వతి అమ్మ అన్నంత మాత్రాన ఏమవుతుంది చెప్పు నువ్వు రా వచ్చి ముందు భోజనం చేయి అని అంటారు ప్రసాద్ గారు ఎటు చెప్పాలో అర్థం అవ్వక. 

 

నువ్వు కూడా ఎందుకు రాధిక మీ వదినతో వాదన ఆడతావు వచ్చి భోజనం చెయ్యి, తర్వాత మన పిల్లలకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు ఒకరితో అనిపించుకోవాల్సిన కర్మ పట్టలేదు మనకి అని అంటారు నరేంద్ర గారు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue