తన మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే ఇంట్లో వాళ్లకి ఎటువంటి అభ్యంతరం లేదే ,బలవంతంగా మాత్రం ఒప్పించ వద్దని చెప్పారు.
దాన్ని వదిలేయి నిఖిల్ దానికి ప్రేమ దోమ అంటు ఎవరైనా వెంట పడితే ఇష్టం ఉండదు. నాలుగు సంవత్సరాల నుంచి చూస్తున్నావు కదా తనను. ఏ రోజైనా ఎవరితోనైనా మాట్లాడటం చూసావా నాతో లాస్య తో తప్ప. అంతెందుకు ఏ రోజైనా రాకేష్ తో మాట్లాడిందా తను. వాడు తనని ఒక చెల్లి లాగా ట్రీట్ చేస్తాడు. కాలేజీలో మాత్రం అసలు మాట్లాడదు. ఇంటికి వెళ్తే మాత్రం వాడితో బాగా మాట్లాడుతుంది. తనని ఇంక వదిలేయరా నీ లైఫ్ నువ్వు చూసుకో అని చెప్పి రమ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
నిఖిల్ అక్కడే ఒక ఐదు నిమిషాలు ఏదో ఆలోచించుకుంటూ ఉంటే తను కూడా వెళ్ళిపోతాడు.
నీకెందుకే వాడితో, ఇప్పటిదాకా మాట్లాడి వస్తున్నావు అవసరమా నీకు అని అంటుంది త్రిషిక.
నేను వాడితో ఏం మాట్లాడలేదు బాబు నీతో ఎందుకు అని చెప్పాను , తన పని ఏదో తనని చూసుకోమన్నాను. నీకు ఇటువంటివన్నీ నచ్చవు అని చెప్పాను. వింటే ఓకే వినకపోతే అది వాడి కర్మ అని అంటుంది రమ్య.
సరే పదా క్లాస్ కి వెళ్దాం అని ఇద్దరు క్లాస్ కి వెళ్తారు.