పరవశం – 28
విక్రమ్ కార్ని మేఘ ఇంటిదగ్గర ఆపుతాడు.. విక్రమ్‌తో మాట్లాడుతూ ఉన్న మేఘ కార్ ఆగటంతో, “ఏమైంది?” అని అడుగుతుంది..
విక్రమ్ నవ్వుతూ, “బయటకి చూడు,” అని అంటాడు..
మేఘ బయటకి చూస్తుంది.. తన ఇంటి ముందు కార్ ఆగటంతో, “అప్పుడే వచ్చేశామా!” అని ఆశ్చర్యంగా అడుగుతుంది..
“హ్మ్.. చెప్పానుగా, నీతో ఉంటే టైమ్ తెలియదు అని! ఇప్పుడు కూడా అంతే,” అని అంటాడు విక్రమ్..
“ఆహా.. అవునా! నాకు కూడా అంతే, అసలు టైమ్ తెలియదు,” అని అంటుంది మేఘ నవ్వుతూ..