❤🔥 Attitude love ❤🔥 – 1
వైజాగ్ బీచ్…. మిడ్ నైట్ 1 కి
వైజాగ్ బీచ్ లో 21 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయి స్పృహ లో లేకుండా పడిపోయింది….
తను ఎందుకు అక్కడ ఉందొ కుడా తనకి తెలియడం లేదు తన ఊపిరి ఆగిపోతే బాగుండు అని తన మైండ్ చెప్తుంటే….
నీ కోసం ఎవరో ఒకరు కచ్చితంగా వచ్చి సేవ్ చేస్తారు అని తన హార్ట్ చెప్తుంది…
పోలీస్ స్టేషన్…..
డ్యూటీ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యి వస్తూ ఉండగా ఒకసారి బీచ్ కి వెళ్దాం మనసు ఎం బాగోలేదు అనుకుంటూ నాకు బాగా కావలసినది దానికి ఎదో అయ్యింది అని తన హార్ట్ గట్టిగా చెప్తుంటే బీచ్ కి వెళతాడు మిహిర్….
మిహిర్ జీప్ దిగి సముద్రాన్ని చూస్తూ ముందుకు అడుగులు వేస్తూ వస్తాడు అక్కడ నుంచి కొంచెం దూరంలో ఆగి చుట్టూ ఒకసారి చూసి ఒక దగ్గర తన కళ్ళు స్టక్ అయిపోతాయి తనకి కొంచెం దూరంలో ఒక అమ్మాయి పడిపోయి ఉంటుంది అది చూసిన మిహిర్ కి ఒక్క క్షణం గుండే ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది తన దగ్గరికి వెళ్లడానికి ఎంత ఫాస్ట్‌గా నడిచినా అడుగులు తన దగ్గరికి వెళ్లడం లేదు .
మిహిర్ ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ అమ్మాయి దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని తనని పిలుస్తాడు అమ్మాయి అమ్మాయి అని చెప్పి పిలిచినా కొంచెం కూడా కదలదు ఇక్కడ తనకి ఏమైంది అని తల ని చుస్తే గాయం అయ్యి బ్లడ్ వస్తుంది ? ఏదో జరిగింది అనుకొని చుట్టుపక్కల చూసిన తనకి ఎవరూ కనపడరు ఇంకేం చేయలేక అమ్మాయిని చేతుల్లోకి తీసుకొని జీప్ దగ్గరకొచ్చి అమ్మాయిని సీట్లో పడుకోపెట్టి జీప్ స్టార్ట్ చేసి హాస్పిటల్ స్టార్ట్ అవుతాడు ఏసీపీ మిహిర్ 45 నిమిషాల తర్వాత హాస్పిటల్ కి వెళ్ళాక మిహిర్ పోలీస్ కాబట్టి అమ్మాయిని ఎత్తుకురావడం చూడగానే ఎమర్జెన్సీ కేస్ అని ఐసీయూ కి షిఫ్ట్ చేస్తారమ్మాయిని డాక్టర్స్ ని పిలిచి ఆ అమ్మాయి బీచ్ దగ్గర ఉంది నెను చూసే అప్పటికి స్పృహలో లేదు నేను చూశాను తనకి అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇవ్వండి నా మనిషి నేను ఎవరో తెలుసు కదా ఏసీపి మిహిర్ అని జాగ్రత్తగా డీల్ చేయండి అని డాక్టర్స్ కి వార్న్చేస్తాడు డాక్టర్స్ తను పోలీస్ అని భయపడుతూ ఒకేసారి మేము చూసుకుంటామని చెప్పి ఐసియులకు వెళ్తారు.
ఎప్పుడు అంతలా భయం బాధ లేదు తనకి పోలీస్ ఆఫీసర్ అయిన అలాంటి కేసులు చాలా డీల్ చేశాడు ఫర్ ది ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూడగానే తనలో కలిగిన ఫీలింగ్ ఏంటో కూడా తనకి తెలియడం లేదు కానీ భయం బాధ రెండు వేస్తున్నాయి తనకి ఏమైందో అన్న భయం తనకి జరిగింది నేను పక్కన లేను అన్న బాధ ఈ రెండు తన మీద తనకే కోపాన్ని తెప్పిస్తున్నాయి.
ఇంకొంచెం ముందుగా వెళ్లి ఉంటే ఆ అమ్మాయికి ఆసిట్యుయేషన్ రాదేమో అని బాధపడతాడు.
మిహిర్ ఫ్యామిలీ విషయానికి వస్తే అమ్మానాన్న తమ్ముడు చెల్లి తమ్ముడు మహేష్ చెల్లి సారిక అమ్మ విజయలక్ష్మి నాన్న విజయేంద్ర కానీ మిహిర్ తన ఫ్యామిలీతో ఉండడు వాళ్ళు హైదరాబాదులో ఉంటే మిహిర్ రీసెంట్గా వైజాగ్ లో పోస్టింగ్ రావడంతో ఇక్కడికి వచ్చాడు ఆ రోజే ఏదో ఒక కేసు డీల్ చేయడం లేట్ అవ్వడంతో లేట్ గా ఇంటికి స్టార్ట్ అవి తన మనసు ఎందుకు అనేది గా ఉంది అని బీచ్ కి వెళ్తాడు అక్కడ అమ్మాయిని చూసి హాస్పిటల్లో జాయిన్ చేశాడు ఎంత సేపైనా ఐసీయూ లో నుంచి డాక్టర్స్ రాకపోయేసరికి మిహిర్ అక్కడే వెయిటింగ్ చైర్స్ లో కూర్చొని ఏం కాకూడదు అనుకుంటూ ఉంటాడు.
అలా ఒక త్రీ అవర్స్ తర్వాత డాక్టర్స్ బయటికి వస్తారు మెహిర్ని చూసి సార్ ఆ అమ్మాయి నీకు ఏమవుతుంది అని అడుగుతుంది డాక్టర్ మిహిర్ పైకి లేచి కావలసిన వ్యక్తి బీచ్ కి వెళ్ళింది అంట అక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది ఏమైంది ఏమైనా అయిందా ఎనీథింగ్ రాంగ్ అని అడుగుతాడు డాక్టర్ నా క్యాబిన్ కి రండి సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది.
మిహిర్ టెన్షన్ పడుతూ ఏమైనా ప్రాబ్లం ఏమో అని డాక్టర్ వెళ్ళిన ఫైవ్ మినిట్స్ కే వెనక వెళ్తాడు డాక్టర్ మిహిర్‌ని చూసి నా పేరు సుజాత అని చెప్తుంది అయామ్ ఏసిపి మిహిర్ అని పరిచయం చేసుకుంటాడు చూడండి సార్ ఆ అమ్మాయికి ఎవరో బలంగా తల మీద కొట్టడం వల్ల స్పృహ తప్పి పడిపోయింది తను ఫిజికల్ గా ఏమి కాలేదు కానీ మెంటలీ తన స్పృహలోకి వస్తే కానీ తనకి మైండ్ ఎలా వర్క్ చేస్తుందో తెలియదు బట్ గతం మర్చిపోవచ్చేమో చెప్పలేము అమ్మాయి స్పృహలోకి వస్తే కానీ మనకు ఎలాంటి వివరాలు తెలియదు సార్ తల కి అయితే ట్రీట్మెంట్ చేసి కట్టు కట్టాము స్కానింగ్ కూడా తీపిచ్చా మైండ్ లో ఏమి బ్లడ్ క్లాట్ అలాంటిది ఏం జరగలేదు .
అమ్మాయి స్పృహలోకి వస్తే కానీ మనకు నిజాలు ఏమీ తెలియదు సార్ అని చెప్తుంది డాక్టర్ అమ్మాయి ప్రాణాలకి ప్రమాదం ఏమీ లేదు కదా తన గతం మర్చిపోయిన పర్లేదు నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను డాక్టర్ అని చెప్పి పైకి లేచి బయటకు వస్తాడు.
2 అవర్స్ తర్వాత మెల్లిగా కళ్ళు తెరుస్తుంది అమ్మాయి నర్స్ పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్లి మేడమ్ ఆ అమ్మాయికి వచ్చింది మేడం అని చెప్తుంది డాక్టర్ పరుగున అమ్మాయి రూమ్ కి వచ్చి హాయ్ ఐయామ్ సుజాత అంటే మీరు ఎందుకు ఉన్నారు ఇక్కడ మీరు ఎవరు అని కొషన్ చేస్తున్న అమ్మాయి నేను డాక్టర్ని నీకు తలకి గాయం అయితే ఇక్కడ తీసుకొచ్చారు నీ పేరు ఏంటో చెప్పు అంటే నా పేరు నాకు తెలియదు అని చెప్తుంది అమ్మాయి నీ పేరు నీకెందుకు తెలియదు ఒకసారి బాగా గుర్తు చేసుకోవడానికి ట్రై చేయి అంటే గుర్తు చేసుకొని ట్రై చేసిన లేదు అని చెప్తుంది ఇప్పుడు నీ ఏజ్ ఎంత అని అడుగుతుంది డాక్టర్ నా ఏజ్ 17 ఇయర్స్ అని చెప్తుంది అమ్మాయి 17 ఇయర్స్ ఆ అంటే ఇప్పుడు నువ్వు ఏ ఇయర్ లో ఉన్నాను అనుకుంటున్నావ్ అని డాక్టర్ అడిగితే 2022 అని చెప్తుంది.
డాక్టర్ కి అర్థం అయిపోయింది తన గతం మర్చిపోయి నాలుగు సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది అని డాక్టర్ ఇంకా నీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు అని అడిగితే ఏమో నాకు తెలియదు అని చెప్తుంది అమ్మాయి ఒకసారి గుర్తు చేసుకోవడం ట్రై చెయ్ అని చెప్తుంది డాక్టర్.
అమ్మాయి ఎంత గట్టిగా ట్రై చేసినా గతం గుర్తుకు రాదు నాకు తలనొప్పిగా ఉంది ఏం గుర్తు రావడంలేదు అనగానే డాక్టర్ తనకు ఒక ఇంజక్షన్ ఏసి రెస్ట్ తీసుకో అని చెప్పి బయటకు వచ్చి మిహిర్‌ని చూసి సార్ అమ్మాయి గతం మరిచిపోయింది మేబీ తనకిప్పుడు ఒక 22 ఇయర్స్ ఉండొచ్చు కానీ తను 17 ఇయర్స్ చెప్తుంది తన పేరెంట్స్ కూడా గుర్తు లేరు తనకి తన పేరు కూడా గుర్తులేదు సరిగ్గా ఆ అమ్మాయి ఏ ఇయర్లో ఉన్నామంటే 2022 అని చెప్పింది సార్మే. బి అమ్మాయికి గతం ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళింది కాబట్టి తను ఇప్పుడు ఇంటర్ అనుకోని ఉండొచ్చు తనని జాగ్రత్తగా చూసుకోండి చిన్నపిల్లల మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది అని చెప్తుంది డాక్టర్ మిహిర్ఆ అమ్మాయికి ఎప్పటికీ గతం గుర్తొస్తుంది అని అడుగుతాడు చెప్పలేం సార్ మే బి త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ కి వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అలా ఎప్పుడు గుర్తుకొస్తుందో మనకు తెలియదు గుర్తుకొచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి గతం గుర్తు చేయడానికి ట్రై చేస్తే తను కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది అని డాక్టర్ మిహిర్ కి చెప్తుంది.
ఓకే డాక్టర్ ఇప్పుడు అమ్మాయితో నేను మాట్లాడొచ్చా అని అడుగుతాడు మిహిర్ డాక్టర్ లేదు ఇప్పుడే ఇంజక్షన్ ఇచ్చాను ఒక 15 మినిట్స్ కి మెలకువ వస్తుంది అప్పుడు వెళ్లి మీరు మాట్లాడండి గతం గుర్తు చేయడానికి మాత్రం ప్రయత్నించకండి అని చెప్పి వెళ్ళిపోతుంది డాక్టర్.
అక్కడే కూర్చుని తల పట్టుకుంటాడు ఇప్పుడు తన ఫ్యామిలీ ఎవరు ఎలా తెలుసుకోవాలి తినని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి నా ఫ్లాట్ కి తీసుకెళ్తే అక్కడే గతం గుర్తుకొచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవచ్చు అని అనుకుంటాడు….
కంటిన్యూ….
అమ్మాయి కి గతం గుర్తు వస్తుందా….
మిహిర్ ఎం చేస్తాడో చూద్దాం..
న్యూ స్టోరీ నచ్చితే కామెంట్ చేసి ఫాలో చెయ్యండి 🫰
Swipe left/right or tap the sides to turn pages