New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

Episode 101

విషిత చంప మీద చెయ్ పెట్టుకుని తన ఎదురుగా ఉగ్ర రూపం దాల్చిన అమ్మ వారిలా కనిపిస్తున్న ఆషి వైపు చూస్తూ…… !! నన్ను కొడతావా హౌ డేర్ యూ అసలు నేనెవరు తెలుసా నా నెట్వర్క్ ఎంతో తెలుసా అంటూ కోపంగా చంప మీద చెయ్ వేసుకుని అడుగుతుంది….. !! ఎవరే నువ్వు హా ఎవరు చెప్పు నీ ఐడెంటిటీ కూడా ఎవరికీ తెలియకుండా నా ప్లేస్ లో లైఫ్ లాంగ్ నటించడానికి రెడీ అయిపోయావ్ నీ గురించి ఎంటే నేను తెలుసుకునేది……. ?? నా గురించే నువ్వు తెలుసుకోవాలి శారీ కట్టుకున్నా అని సాఫ్ట్ గా ఉంటా అనుకుంటున్నావా……  ?? నేను పైకి కనిపించేంత సాఫ్ట్ పర్సన్ అయితే కాదు కేవలం ఆయుష్ గారి కోసం నన్ను నేను చేంజ్ చేసుకున్నా…….. !! అనవసరంగా నాతో పెట్టుకోకు నన్ను అన్నావ్ పడ్డాను ఆయుష్ గారి గురించి మాట్లాడావ్ సహించా…… !!  బట్ నా కూతురి గురించి పిచ్చిగా వాగితే మాత్రం పళ్ళు రాలకొడతాను……. !!

విప్లవ్ ఆది నన్ను అన్నన్ని మాటలు అంటుంటే అలా చూస్తూ నుంచుంటావ్ ఏంటి …… ?? ముందు దాన్ని కదలకుండా కట్టి పడేయ్ అసలు హ్యాండ్ కప్స్ అలా ఎలా ఊడిపోయాయి…… ??

ఇంత కోపంలో కూడా ఆషి అందం కొంచెం కూడా తగ్గలేదు చూసావా విషిత… !! నేను చెప్పాను కదా నా ఆషి డేరింగ్ గర్ల్ అని అంటూ ఆషి వైపు మైనరపుగా చూస్తూ ఉంటాడు……. !!

ఏయ్ ఇంత చెప్పినా కొంచెం కూడా మీ బుర్రలకు నేను చెప్పింది ఎక్కలేదా…… ?? అయినా ప్రపంచం ఇంకెవరు దొరకనట్టు మా మీద పడ్డారేంటి అసలు మిమ్మల్ని అంటూ….,. !! విప్లవ్ మీదకు వెళ్ళబోతున్న ఆషి మెడ మీద ఇంజెక్షన్ చేయగానే ……. !! ఆషి కళ్ళు మూసి నేల మీదకు జారిపోతుంటే విప్లవ్ తనను పడకుండా జాగ్రత్తగా పట్టుకుంటూ ……. !! ఇంజెక్షన్ చేసిన మధు వైపు కోపంగా చూస్తూ ఆషి ను జాగ్రత్తగా బెడ్ మీద పడుకో బెట్టి మధు చంప పగల కొడతాడు…… !!

విప్లవ్ కొట్టిన దెబ్బ కు చంప చురుక్కుమనడం తో ఆ…… అని మనసులో నొప్పికి బాధ పడుతూ విప్లవ్ వైపు షాకింగ్ గా చూస్తూ ఉంటుంది మధు….. !!

ఆషి కి ఇంజెక్షన్ ఇవ్వమని నేను చెప్పానా……. ??

విప్లవ్ నుండి కోపంగా వినిపిస్తున్న వాయిస్ కి ఉలిక్కిపడి లేదు అని అడ్డంగా తల ఊపుతుంది మధు…… !!

నేను చెప్పకుండా ఆషి కి ఇంజెక్షన్ ఎందుకు చేసావ్….. ?? అసలే నేను ఇచ్చిన పవర్ఫుల్ డ్రగ్ వల్ల తను వన్ డే కాన్షియస్ లో లేదు….. !! ఇప్పుడు స్పృహ లోకి వచ్చిన తనను మళ్ళీ ఆన్ కాన్షియస్ లోకి వెళ్ళేలా చేసావ్…… ?? ఇలా అయితే ఆషి హెల్త్ ఎమ్ అవ్వాలి హా అంటూ కోపంగా మధు గొంతు పట్టుకోబోతాడు …… !!

విప్లవ్ స్టాప్ మధు ఎందుకు చేసినా కరెక్ట్ టైమ్ కి రియాక్ట్ అయింది చూసావు కదా ఆషి ని ఎంత డేరింగ్ గా మాట్లాడుతుందో…… ?? తన కళ్ళల్లో ఎక్కడా కూడా కిడ్నాప్ చేసారు అన్న భయం కనిపించడం లేదు….. !! ముందు ఆషి కి నువ్వేంటో తెలిసేలా చేసి తన లైఫ్ ఇక నీతోనే అని తనకు క్లారిటీ ఇవ్వు ……. !! అలాగే త్వరగా తనను ఇక్కడి నుండి షిఫ్ట్ చెయ్ గుర్తుంది కదా ఎంత వీలైతే అంత త్వరగా ఆషి ను తీసుకుని ఇక్కడి నుంచి నువ్వు లండన్ వెళ్ళిపో…… !! అంతలా ఆషి గొడవ చేస్తే ఆ దియా ను కూడా మీతో తీసుకుని వెళ్ళండి అది ఉంటే ఆషి కొంచెం మన మాట వింటుంది…….. !!

మరి నీ పరిస్థితి ఏంటి…… ?? ఆయుష్ దియా దూరం అయితే కామ్ గా ఉండగలడా సెక్యూరిటీ నుండి తప్పించి దియా ను తీసుకుని వెళ్ళడం ఎలా……. ??

ఆషి ను ఎలా తీసుకు వచ్చామో అలా……. !! ఏదో ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేసి అందులో దియా చచ్చింది అని బాడీ కూడా దొరకలేదు అని క్రియేట్ చేసి ఆయుష్ తో పాటు అందరినీ నమ్మించేలా నేను ప్లాన్ చేస్తాను….. !! ఆ తర్వాత ఆయుష్ ని నా ప్రేమతో పూర్తిగా దియా ను మర్చిపోయేలా చేసి తనతో కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాను…… !!

వావ్ అయితే త్వరలోనే మనం ఇష్టపడ్డ వాళ్ళతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాం ……. !! అంటూ ఆనందంగా విషిత ను హగ్ చేసుకుంటూ తన హ్యాపీనెస్ షేర్ చేస్తాడు విప్లవ్…… !!

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue