Episode 91
ఆషి ముక్కు దగ్గర హ్యాండ్ కీ పెట్టబోతున్న ప్రణవి చెయ్ పట్టుకుని ఆపేస్తాడు ఒక వ్యక్తి…….. !! భయంగా ఆ మనిషి వైపు చూసిన ప్రణవి కి ఫేస్ మంకీ క్యాప్ తో కవర్ చేసుకుని తనను గుర్తు పట్టకుండా……. !! బాడీ మొత్తం కవర్ చేసుకున్న ఆ వ్యక్తి ను చూసి అరవాలి అనుకున్నా…….. !! ఇప్పుడు తను అరిస్తే ఈ టైం లో తను ఇక్కడ ఏం చేస్తుందో చెప్పాలి కాబట్టి ……. !! తన అరుపుని గొంతు లోనే దాచేసి టెన్షన్ గా ఆ వ్యక్తి వైపు చూస్తూ ఉంటుంది…… !! అప్పుడే తను పెట్టుకున్న మంకీ క్యాప్ తీస్తున్న పర్సన్ ను చూసి ప్రణవి కి ఈ క్షణం ఇలాగే చచ్చిపోతే బావుండు అనిపిస్తుంది…… !! ఎందుకంటే అక్కడుంది విప్లవ్ 👿👿…… !!
తన వైపు నిప్పులు చిమ్ముతున్న ఎర్రటి కళ్ళతో చూస్తున్న విప్లవ్ ను చూసి ప్రణవి కి చలి జ్వరం వచ్చినట్టు బాడీ మొత్తం వణుకుతూ……. !! కాళ్ళు, చేతులు తనకు తెలియకుండానే శివరింగ్ వచ్చేసి విప్లవ్ చూపుకు భయంగా పైకి లేచి నుంచుంటుంది ……… !! వి….. విప్లవ్ నువ్వా ఇక్కడేం చేస్తున్నావ్ అని అడుగుతున్నా విప్లవ్ నుండి నో ఆన్సర్……. !!
విప్లవ్ తల తిప్పి హాయిగా నిద్రపోతున్న ఆషి ను చూసి మెల్లగా ఎస్కేప్ అవ్వడానికి చూస్తున్న ప్రణవి మెడ పట్టుకుని……. !! కోపంగా టెర్రస్ మీదకు ప్రణవి నోరు మూసి లాక్కుని వెళతాడు విప్లవ్……. !! టెర్రస్ మీద కు రాగానే ప్రణవి పళ్ళు ఊడోచ్చేలా విప్లవ్ కొట్టిన దెబ్బకు రెండు రౌండ్ లు తిరిగి కింద పడుతుంది ప్రణవి……. !!
వంద సూదులతో చర్మం మీద గుచ్చితే ఎంత నొప్పిగా ఉంటుందో అంత నొప్పిగా ఉన్న దెబ్బకు అమ్మాఆఆఆ…….. !! అని చంప మీద చెయ్ పెట్టుకోగానే ప్రణవి నోటి నుండి బ్లడ్ కూడా మెల్లగా బ్లీడ్ అవ్వడం చూసి ప్రణవి కంగారు పడుతూ……. !! బ్ల…. బ్లడ్ వస్తుంది ఆఆ ఆ ఇట్స్ పెయినింగ్ అని ఏడుస్తూ ఉంటుంది…… !!
విప్లవ్ ప్రణవి ఎదురుగా కూర్చుంటూ……. !! ప్రణవి బాగా నొప్పిగా ఉందా అయ్యో బ్లడ్ కూడా వస్తుందే అని అడుగుతూ ఉండడం చూసిన ప్రణవి…… !! వీడేంటీ నన్ను చంపేస్తాడు అనుకుంటే కన్సర్న్ చూపిస్తున్నాడు ……. !! ఏదైతే ఏంటీ వీడి మూడ్ చేంజ్ అవ్వక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుని ఊ 🥹 బాగా నొప్పిగా ఉంది విప్లవ్ ……. !!
అయ్యయ్యో ప్చ్ పాపం …… !? అవునా ఎదీ చూడనివ్వు అంటూ మరో సారి ప్రణవి చంప పగల కొట్టి నోట్లో నుండి బ్లడ్ నేల మీదకు కారేలా చేస్తాడు….. !! ఆ దెబ్బకు ప్రణవి భయం భయంగా విప్లవ్ వైపు చూస్తూ వెనక్కి జరుగుతూ ఉంటే ప్రణవి కాలు పట్టుకుని ముందుకు లాగి…… !! బుగ్గలు నొక్కి పట్టుకుని ఈ టైమ్ లో ఆషి రూమ్ లో ఎమ్ చేస్తున్నావ్ ఆ హ్యాండ్కీ ఏంటీ అంటూ కోపంగా అడుగుతాడు……. !!
ఆ….. విప్లవ్ ప్లీస్ లీవ్ మీ నేను బావ ను చూడ్డానికి వచ్చాను…… !! అసలు నన్ను ఎందుకు కొడుతున్నావ్ అయినా నేను ఎందుకు వచ్చానో కాదు ఈ టైం లో మహల్ లోకి నువ్వెలా వచ్చావో ఆది చెప్పు…… !! ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్న మహల్ లోకి అలా ఎలా వచ్చావ్…… ?? నిన్ను ఇక్కడ ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లెమ్ అవుతుందో తెలుసా……. !! ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ లేని ధైర్యం తెచ్చుకుంటూ నార్మల్ గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది…… !!
షట్ అప్ నీ ఓవర్ యాక్షన్ ఆపి ఈ టైమ్ లో ఆషి రూమ్ కి ఎందుకు వచ్చావో చెప్పు…… !! ఆయుష్ ను చూడ్డానికి వస్తే తన వైపు చూడకుండా ఆషి దగ్గరకు ఎందుకు వచ్చావ్ & పాకెట్ నుండి ఆ హ్యాండ్ కీ లో ఏదో లిక్విడ్ ఎందుకు స్ప్రింకిల్ చేసావ్…… ?? నేను మొత్తం అబ్సర్వ్ చేసాను నువ్వు మర్యాదగా నిజం చెప్తావా లేదా చంపేయనా……. ??
పాకెట్ నుండి గన్ తీసి తన తలకు ఎయిమ్ చేయగానే భయపడిపోయినా ప్రణవి …… !! వొ…. వొద్దు చెప్పేస్తాను మొత్తం చెప్పేస్తాను ఆషి బ్రతికుండగా బావ నా సొంతం అవ్వడు అని నాకు బాగా అర్థం అయింది……. !! అందుకే ఎలా అయినా ఆషి ను చంపేయాలి అని నాకు తెలిసిన డ్రగ్ డీలర్ కి కాల్ చేసి పాయిసన్ డ్రగ్ గురించి అడిగాను…… !! అతనే నాకు ఈ డ్రగ్ ఇస్తూ దీన్ని జస్ట్ ఇన్హీల్ చేస్తే చాలు నిద్రలోనే చనిపోతారు & ఎలాంటి డౌబ్ట్ కానీ స్మెల్ కానీ రాదు అని చెప్పాడు…… !! ఆ డ్రగ్ తీసుకుని ఆషి ముక్కు దగ్గర పెట్టబోతూ నీకు దొరికిపోయాను ….. !!
హౌ డేర్ యూ నా ఆషి నే చంపాలి అనుకుంటావా ఐ విల్ కిల్ యూ డెవిల్ అంటూ……. !! గన్ పాకెట్ లో పెట్టుకుని pranavi గొంతు పట్టుకుని పైకి లేపి ……… !!అలాగే వెనక్కి నెట్టుకుంటూ వెళ్ళి టెర్రస్ చివరకు ప్రణవి మెడ పట్టుకుని వెనక్కు వంచి ప్రణవి ను కింద కి తోయబోతాడు ……. !!
ఎక్కడ విప్లవ్ నెట్టేస్తాడో అని నిలువెల్లా వణికిపోతూ విప్లవ్ ఐ ఆమ్ సారి ప్లీస్ ఫర్గివ్ మీ……. !! ఇంకెప్పుడు ఇలా చేయను ప్లీస్ నన్ను చంపద్దు నువ్వు చెప్పింది చేయడానికైనా ఇక్కడ నేనుండాలి కదా ప్లీస్ నన్ను వదిలేయ్……. !! ఇంకెప్పుడూ ఇలాంటి మిస్టేక్ చేయను ప్లీస్ ఐ ఆమ్ సారి అని చేతులు ఆడిస్తూ భయం భయంగా అరుస్తూ చెప్తుంది……. !!
Swipe left/right or tap the sides to turn pages