నిషాన్ పార్టికోలో ఉన్న కార్ ను చూసి ఎక్స్సైట్ అవుతూ వావ్ ఐ లవ్ దిస్ కార్…… !! అంటూ కార్ ఆన్‌లాక్ చేసి కూర్చుని కార్ లోపల అన్ని చెక్ చేస్తూ అన్నయ్యా సెలెక్షన్ ఆల్వేస్ ది బెస్ట్…… !! అన్నయ్య పదా సరదాగా అలా రైడ్ కి వెళ్దాం అంటున్న నిషాన్ తల మీద మొట్టి ఇప్పుడు బావ ఉన్న కండిషన్ లో కార్ లో ట్రావెల్ చేయడం తన హెల్త్ కి మంచిది కాదు….. !!
మోహిత్ వైపు చూసి నాలుక కొరుక్కొని షట్ 🤦 అవును కదా మర్చిపోయాను బావ….. !! నో ప్రాబ్లెమ్ అన్నయ్య రాకపోతే ఏంటి ఆషి,మామ్ ఉన్నారు కదా వాళ్ళను ఫస్ట్ రైడ్ కి తీసుకుని వెళతాను….. !! మామ్, ఆషి & వేద అక్క రండి అనగానే అందరూ కూడా నవ్వుతూ నిషాన్ కార్ వైపు అడుగులు వేస్తారు…… !!
నిషాన్, ఆషి ఫ్రంట్ లో కూర్చుంటే రాగిణి, వేద బ్యాక్ సీట్ లో సెటిల్ అవుతారు…… !! వెళ్తున్న నిషాన్ కార్ ను చూసి అందరూ తిరిగి మహల్ లోకి వెళ్ళిపోతారు……. !! నిషాన్ ఆనందంగా అందరితో ఒక బుడ్డి డ్రైవ్ కి వెళ్లొచ్చాక ముగ్గురూ తిరిగి లోపలికి వెళ్ళడం చూసి అభి నంబర్ కి డయల్ చేస్తాడు…… !! నైట్ ఎప్పుడో మహల్ కి వచ్చి బెడ్ ఎక్కిన అభి నిషాన్ కాల్ తోనే నిద్ర లేచి కాల్ లిఫ్ట్ చేస్తుంది….. !!
హలో…… !!
హేయ్ అభి ఇట్స్ మీ…… !!
ఊ…. చెప్పు బావ ఏంటి కాల్ చేసావ్…… ?? ఇపుడే గా నీ రూమ్ కి వెళ్ళావ్ అపుడే కాల్ చేస్తున్నావ్ ఏంటి ఓహ్ బాగా గుర్తొస్తున్నానా …… ?? తెల్లారిపోతుంది బావ ఇప్పుడు మనల్ని ఎవరైనా చూస్తే ప్రాబ్లెమ్ అవుతుంది అంటూ ఆవలిస్తూ చెప్తుంది……. !!
తెల్లారి 2 గంటలు అవుతుంది కానీ నువ్వు త్వరగా లేచి ఫ్రెష్ అయి పార్టీకో వైపు రా నీకో సర్ప్రైజ్ చూపిస్తాను……. !!
ఏంటి అప్పుడే తెల్లారిందా అని టైం చూసి పైకి లేచి కూర్చుని ఓహ్ షట్ ఒకే బావ 15 మినిట్స్ వచ్చేస్తున్నా అని టవల్ తీసుకుని వాష్ రూమ్ లోకి దూరుతుంది…… !! ఫాస్ట్ గా రెడీ అవుతూ అసలే ఆయుష్ బావ కి లేట్ గా లేస్తే నచ్చదు ఇవాళ బాగా లేట్ అయిపోయింది…… !! బావ ఎమ్ అంటాడో ఏంటో అయినా కవర్ చేయడానికి మోహిత్ అన్నయ్య ఉన్నాడు గా అని భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ కిందకు వెళుతుంది…… !!
గుడ్ మార్నింగ్ అభి….. !!
మార్నింగ్ వదిన….. !!
అభి చేతికి ఉన్న బ్యాండేజ్ చూసిన వేద అభి ఆర్ యూ ఆల్రైట్…… ?? చేతికి ఆ బ్యాండేజ్ ఏంటి అసలేం జరిగింది అంటూ కంగారుగా అడుగుతూ అభి చెయ్ పట్టుకుంటుంది ……… !!
ఆ…. కంగారు పడాల్సిన అవసరం లేదు వదిన చిన్న దెబ్బ అంటూ తన చేతిని వెనక్కి తీసుకుంటూ కంగారుగా చెప్తుంది…… !!