Episode 99
మార్నింగ్ ఆషి మాటలకు దియా హార్ట్ అయిందని అందరూ కామ్ గా ఉంటే ఆయుష్ మాత్రం ఏదో ఆలోచిస్తూ కోపంగా తన ముందున్న ప్లేట్ ను విసిరి కొడతాడు…… !! సడెన్ గా ఆయుష్ ను అలా చూసి అందరూ షాక్ అయితే ఆషి మాత్రం ఆయుష్ హ్యాండ్స్ కి స్పర్శ వచ్చినందుకు ఆయుష్ గారు అంటూ ఆనందంగా పిలుస్తుంది……. !! కానీ ఆయుష్ అవేమీ పట్టించుకునే స్థితిలో లేడు కోపంగా ఆషి ను కొట్టడానికి చేయ్ ఎత్తి ఆగిపోతాడు…… !!
గాల్లోకి లేచిన తన చేతిని చూసి ఆయుష్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు కూడా షాక్ నుండి ఒక్కొక్కరిగా బయట పడుతూ ఆయుష్ వైపు ఆనందంగా చూస్తూ ఉంటారు……. !! ముందుగా తీసుకున్న మోహిత్ బావ నీ చెయ్….. నీ చేయ్ అంటూ అంతకు మించి చెప్పలేక ఎమోషన్ అవుతూ ఆయుష్ ను ఆనందంగా హగ్ చేసుకుంటాడు……. !! ఆయుష్ కూడా మోహిత్ చుట్టు చేతులు వేస్తూ తమ వైపు కన్నీళ్ళు తుడుచుకుంటూ చూస్తున్న విక్రమ్ కళ్ళతోనే దగ్గరకు రమ్మని పిలుస్తాడు…… !!
ఆయుష్ అంటూ విక్రమ్ కూడా వాళ్ళతో జాయిన్ అవుతూ నీ చేతులకు స్పర్శ వచ్చింది ……. !! నువ్వు నార్మల్ అయిపోయావ్ అంటూ మరింత గట్టిగా హగ్ చేసుకుంటూ నవ్వుతూ చెప్పగానే…… !! ఆయుష్ మోహిత్, విక్రమ్ లను హగ్ చేసుకుంటూ నవ్వుతూ ఇద్దరి వైపు చూస్తాడు……. !!
నాకు ఇదంతా కళగా ఉంది బావ ఐ ఆమ్ సో హ్యాపీ అంటూ ఆయుష్ ను వదిలి దూరంగా నుంచుంటాడు …… !! ఆషి ఆయుష్ వైపు కన్నీళ్లతో చూస్తూ ఆయుష్ చేతులు పట్టుకుని నన్ను క్షమించండి ఆయుష్ గారు 🥹……. !! నేనిలా మాట్లాడితే కానీ మీ చేతులకు స్పర్శ రాదు అని దియా తో అలా బిహేవ్ చేసాను….. !! మీకు ఫిజియోథెరపీ చేయిస్తున్నా మీలో స్పందించాల్సిన నర్వ్స్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అని డాక్టర్ నాకు చెప్పాడు…… !! మీరు త్వరగా నార్మల్ అవ్వాలంటే నేను మీకు కంట్రోల్ చేసుకోలేనంత కోపం తెప్పించేలా మాట్లాడాలి ఇలా మాట్లాడితే మీరు కచ్చితంగా రెస్పాండ్ అవుతారు…… !! అని చెప్పాడు అందుకే మీ ముందు దియా తో అంత హార్ష్ గా మాట్లాడాను నన్ను క్షమించండి ఆయుష్ గారు అంటూ కన్నీళ్ళతో ఆయుష్ చేతులు తడిపేస్తుంది…….. !!
ఆషి దియా తో అలా మాట్లాడినపుడే ఏదో ఒక స్ట్రాంగ్ రీసన్ ఉంటుంది అనుకున్న అందరూ ఆషి వైపు బాధగా చూస్తూ ఉంటారు…… !! ఆయుష్ కూడా కాసేపటికి ఆషి కన్నీళ్ళు తుడిచి నువ్వలా మాట్లాడినపుడే నాకు డౌబ్ట్ వచ్చింది ఆషి బాధ పడకు……. !! అని ఆషి తో దియా స్కూల్ కి డల్ గా వెళ్ళింది లంచ్ టైం లో నువ్వే తనకు లంచ్ తీసుకుని వెళ్ళి దియా ను కూల్ చెయ్ ఒకే….. !!
అలాగే ఆయుష్ గారు ఇప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేయండి అని మరో ప్లేట్ లో ఆయుష్ కి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసి ఆయుష్ కి తినిపించబోతుంది ….. !! నేను తింటాను కానీ మీరు కూడా అందరూ తినండి అని అందరి వైపు చూస్తూ తను కామ్ గా బ్రేక్ఫాస్ట్ తింటూ …… !! అందరితో నార్మల్ గా మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ అవ్వగానే తన రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాడు……. !!
అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఆషి తో కాసేపు టైమ్ స్పెండ్ చేసి ఎవరి వర్క్స్ మీద వాళ్ళు వెళ్ళిపోతారు…… !! అందరూ వెళ్ళాక ఆషి కూడా బయటకు వెళ్తూ లంచ్ కి ఎమ్ ప్రిపేర్ చేయాలో చెప్పి బయటకు వెళ్ళిపోతుంది…… !!
బయటకు వెళుతున్న ఆషి ను చూసిన ప్రణవి అసలేంటి ఇది ఇంత తేడాగా బిహేవ్ చేస్తుంది…….. ?? దియా ను ఎవరైనా ఏమైనా అన్నా ఇంత ఎత్తున లేచేది అలాంటిది ఇవాళ దియా ను అదే హార్ట్ చేసి పంపించి……. ?? ఆది కూడా ట్రీట్మెంట్ లో ఒక పార్ట్ అంటుంది ఏంటీ ఇది చెప్పింది నిజంగా నిజమా…… ?? లేక ఇంకేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తూ కిచెన్ లోకి వెళ్ళి లక్ష్మి ను పిలుస్తుంది…… !!
ప్రణవి మేడం పిలిచారా……. ??
హా…. లక్ష్మీ నిజం చెప్పు ఆషి దియా ను పైకి తీసుకుని వెళ్ళింది కదా అప్పుడు నువ్వు కూడా మిల్క్ తీసుకుని వెళ్ళావు…….. ?? మిల్క్ ఇచ్చి రాకుండా దియా రెడీ అయ్యే వరకూ అక్కడే ఎమ్ చేస్తున్నావ్ అసలు పైన ఎమ్ జరిగింది…… ?? బావ కి ఏదో చెప్పబోతు ఎందుకు ఆగిపోయావ్…….. ??
మేడం…..!! ఆది… అదీ పైన….. !?
అబ్బా నాంచకుండా విషయం చెప్పు అసలే ఆషి బిహేవియర్ అర్థం అవ్వక నాకు ఇక్కడ పిచ్చి పడుతుంది…… !!
Swipe left/right or tap the sides to turn pages