ప్రణవి కోసం అన్ని రెడీ చేసి వెయిట్ చేస్తున్న రాగిణి కి రూమ్ డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వినిపించడం తో వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే వైట్ కలర్ టాప్ విత్ బ్లాక్ డెనిమ్ చేతిలో ఫ్రూట్ సలాడ్ బౌల్ తో ముద్దుగా రెడీ అయిన దియా ను చూసి నవ్వూతూ అప్పుడే రెడీ అయిపోయావా బంగారం అంటూ దియా ను ఎత్తుకుని ముద్దు పెడుతూ మామ్ ఎక్కడ అంటూ ఆషి కోసం చూస్తూ అడుగుతుంది
మామ్ రెడీ అవుతుంది నానమ్మ నన్ను పిన్ని రెడీ అయిందో లేదో చూడమని పంపింది పిన్ని ఎక్కడ అని రూమ్ లో కనిపించని ప్రణవి కోసం వెతుకుతూ అడుగుతుంది
పిన్ని బాత్ చేస్తుంది బంగారం తను రాగానే ఇద్దరం కలసి రెడీ చేద్దాం ఒకే అంటూ దియా ను ఎత్తుకుని బెడ్ మీద కూర్చో బెట్టి పక్కనే కూర్చుని ప్రణవి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది
కాసేపటికి ఎర్రగా కందిపోయిన కళ్ళతో మొహాన్ని ఎర్రగా పెట్టుకొని స్నానం చేసి బయటకు వస్తున్న ప్రణవి వైపు చూసి ఎన్టీ ప్రను ఇంత లేట్ వాళ్ళు వచ్చే టైమ్ అవుతోంది కదా సరే త్వరగా బాత్ రబ్ తీసేసి ఈ బ్లౌస్ & లంగా వేసుకో అంటూ ప్రణవి కళ్ల వైపు చూసి ఏమైందే కళ్లు ఎందుకు అంతా ఎర్రగా ఉన్నాయి ఎడ్చావా నిజం చెప్పు ప్రను ఆయుష్ చెప్పినట్టు నువ్వు వాడ్ని ఇంకా లవ్ చేస్తున్నావా అంటూ ప్రణవి వైపు అనుమానంగా చూస్తూ అడుగుతుంది