మీరేంటి అందరి ముందు పట్టుకొని వారిని కొడుతున్నారు అని భార్య చేసిన సైగలు అర్థం చేసుకుంటూ వాడు ఏం చేశాడో నీకు తెలుసా అని గర్జించాడు వీరేంద్ర.
అన్ని నాకు తెలుసు అని తల ఊపిన ఆమె మేం వెళ్ళొస్తాం ఇంకా అంటూ ఆకృతి చేయి పట్టుకొని వెళ్ళిపోతున్న కొడుకుని చూసి ఇక్కడే ఉండండి అని చెప్పింది.
డెసిషన్ ఆకృతిదే అన్నట్లు తననే చూడటంతో ఫ్లాట్ కి వెళ్తే మళ్లీ ఎలా బిహేవ్ చేస్తాడో అని భయపడిన ఆకృతి ఇక్కడే ఉందాం అని చెప్పగానే వైదేహి సంబరపడిపోయి కోడలిని తనతో పాటు తీసుకువెళ్లి ఇల్లంతా తిప్పి చూపిస్తూ పూజ రూమ్ దగ్గర ఏవేవో సైగలు చేస్తూ సాయంత్రం వరకు కోడలికి ఒక్క పని చెప్పకుండా చూసుకుంది.
వైదేహి కోడలికి దీపం పెట్టు అని సైగ చేయడంతో సరే అని తల ఊపిన ఆకృతి ఏ రూమ్ లోకి వెళ్ళాలో తెలియక తట పటాయిస్తుంటే వైదేహి తన రూమ్ లోకి తీసుకెళ్లి కోడలిని నగలువేసి అలంకరించి పూజలో సాయం చేసింది.
చిన్న సైజు రోజా చెట్టు అంత ఉన్న తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న భార్యని దూరం నుండే అపురూపంగా చూసుకుంటున్నాడు నిర్వాన్.
నిజానికి అతడికి ఆమెకు దగ్గర అయింది మాత్రమే గుర్తుంది ఎలా అయ్యాడు ఎంత రాక్షసంగా ప్రవర్తించాడు అన్నది సరిగ్గా క్లారిటీ రావడం లేదు.
రాత్రికి భోజనాలు అయ్యాక కోడలి చేతుల్లో పాల గ్లాస్ పెట్టి కొడుకు రూమ్ కి సాగనంపింది వైదేహి.
చీరలోపల కాళ్ళు గజగజ వణుకుతుంటే హాండ్స్ కూడా ఆకృతి మాట వినకుండా షేక్ అవుతూనే ఉన్నాయి.
బెరుకుగా కాదు భయంగా అ రూమ్ లోకి అడుగుపెట్టిన ఆకృతి దాని వైశాల్యానికి నోరు తెరిచి చూస్తోంది.
ఇక్కడ భర్తతో గొడవ పెట్టుకుంది వైదేహి కొడుకుని అందరి ముందు అలా ఎలా కొడతారు బయటికి వెళ్లి నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటారు అంటూ.
ఆమె అలక తీర్చిన వీరేంద్ర మనము అమ్మాయి విషయంలో ఎంత తప్పు చేసామో కానీ శేఖర్ వాళ్ళ పరువు పోవడంలో తెలియకుండానే మన చేయి ఉంది వైదేహి కుదిరితే రేపు ఒకసారి వెళ్లి వాళ్లను క్షమాపణ అడగాలి అని అంటే సరే అన్నట్టు తల ఊపింది వైదేహి.
ఆమెను బెడ్ మీద నుండే క్యూట్గా చూస్తున్నాడు నిర్వాన్.