New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఆమె ఇంకా అక్కడే ఉంది…

29 stories Ongoing Horror Suspense Love

అనుకోని పిలుపు.."కొన్ని ప్రయాణాలు మనం ఎంచుకుంటాం... కొన్ని ప్రయాణాలు మాత్రం మనల్నే ఎంచుకుంటాయి."హైదరాబాద్ నగరం...ఉదయం ఆరు గంటలు.రాత్రి కురిసిన వర్షపు జల్లుల తడి ఇంకా రోడ్ల పై మెరుస్తూనే ఉంది. టీ దుకాణాల దగ్గర నుంచి ఎగిసిపడుతున్న ఆవిరి, వార్తాపత్రికలు పంచుతున్న జనాలు, నిద్ర లేచిన పక్షుల కిల కిలారావాలు... నగరం ఇంకొన్ని నిమిషాల్లో తన పరుగును మొదలు పెట్టబోతోంది..అయితే...ఆ నగరంలో ఒక అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో మాత్రం సమయం ముందుకు కదలడం మానేసినట్టుంది.ల్యాప్‌టాప్ ముందు నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఒక అబ్బాయి.అతని పేరు ఆద్వైత్.. తెలుగు సాహిత్యంలో తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్న యువ రచయిత.అతని కథలు చదివి నవ్వినవాళ్లు ఉన్నారు...ఏడ్చినవాళ్లు ఉన్నారు…వేలాది మంది అభిమానులు...ప్రతి కొత్త నవల కోసం ఎదురు చూసే…

Browse Stories

ఆమె ఇంకా అక్కడే ఉంది...

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 1

అనుకోని పిలుపు..   “కొన్ని ప్రయాణాలు మనం ఎంచుకుంటాం… కొన్ని ప్రయాణాలు మాత్రం మనల్నే ఎంచుకుంటాయి.”   హైదరాబాద్ నగరం… ఉదయం ఆరు గంటలు. రాత్రి కురిసిన వర్షపు జల్లుల తడి ఇంకా రోడ్ల పై మెరుస్తూనే ఉంది. టీ దుకాణాల దగ్గర నుంచి ఎగిసిపడుతున్న ఆవిరి, వార్తాపత్రికలు పంచుతున్న జనాలు, నిద్ర లేచిన పక్షుల కిల కిలారావాలు… నగరం ఇంకొన్ని నిమిషాల్లో తన పరుగును మొదలు పెట్టబోతోంది..   అయితే… ఆ నగరంలో ఒక అపార్ట్‌మెంట్ […]

4 min 56 views
ఆమె ఇంకా అక్కడే ఉంది...

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 2

ఎవరికి వారే బిజీ బిజీ గా ఉన్న హైదరాబాద్ లో ఒక వ్యక్తి మాత్రం కాలం గడవనట్టు, తన చేతిలోని కలం కూడా కదలక బయట ప్రాంచాన్ని చూస్తూ అలా ఆలోచనల్లో మునిగిపోయాడు. అప్పుడే అతనికి వచ్చిన లేఖ అతని ప్రయాణంను, అతని ఆలోచన లను మార్చబోతుంది అనుకున్నాడు. ఇక మరొక వైపు వేలగూడెం అనే ఒక ఊరిలోని పాత బంగ్లా లో ఒక అమ్మాయి హృదయాకార వెండి లాకెట్ ను పట్టుకుని ఎవరి కోసమో ఏదురు […]

4 min 46 views
ఆమె ఇంకా అక్కడే ఉంది...

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 3

ఆద్వైత్ తనకు వచ్చిన లేఖను పట్టుకుని వేలగూడెం వైపు బయలుదేరాడు. ఆ లేఖ అతని చేతిలో పడిన క్షణం నుంచి అతని చుట్టూ విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా అదే మల్లెపూల పరిమళం… క్షణం క్షణం అతన్ని వెంటాడుతున్న ఒక తెలియని అనుభూతి… అయినా, తనను ఎవరో పిలుస్తున్నారనే భావనతో అతను ప్రయాణాన్ని ఆపలేదు.   మరోవైపు… వేలగూడెంలోని ఆ పాత బంగ్లాలో, ఒక అమ్మాయి తన చేతిలోని హృదయాకార వెండి లాకెట్‌ ను గుండెలకు […]

4 min 38 views
ఆమె ఇంకా అక్కడే ఉంది...

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 4

వేలగూడెం లోని బంగ్లా లో ఉన్న అమ్మాయి ఆద్వైత్ రాకను పసిగట్టి, ఆ గదిలోని వస్తువులు అన్నిటిని చూస్తూ, అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోతూ ఉండగా.. మరో వైపు ఆద్వైత్ ఆ బంగ్లా లోపలికి ప్రవేశించి, ఆ అమ్మాయి కి ఎదురుగా వచ్చి నిలబడి మౌనం గా ఆమెనే చూస్తూ ఉన్నాడు.   ***   ఆమె అన్నదానికి ఆద్వైత్ కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేక ఆమెనే చూస్తూ నిలబడ్డాడు.   ఎందుకో… ఆ ముఖం […]

4 min 29 views
ఆమె ఇంకా అక్కడే ఉంది...

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 5

ఒక రహస్యమైన లేఖతో వేలగూడెం చేరుకున్న రచయిత ఆద్వైత్… అక్కడి పాత బంగ్లాలో ఎన్నో సంవత్సరాలుగా తన కోసమే ఎదురు చూస్తున్నట్టున్న ఒక రహస్యమైన అమ్మాయిని కలుస్తాడు. కానీ ఆ బంగ్లాలో ప్రతి అడుగూ ఒక కొత్త రహస్యాన్ని, ప్రతి తలుపు ఒక భయంకరమైన నిజాన్ని అతని ముందుకు తీసుకు వస్తుంది.   ***   ఆ అమ్మాయి అతన్ని కొట్టినా సరే అతను మాత్రం.. “వెనక ఎవరో ఉన్నారు” అని మెల్లగా అన్నాడు.   ఆ […]

4 min 46 views
ఆమె ఇంకా అక్కడే ఉంది... Premium

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 6

రహస్యమైన బంగ్లాలో అడుగు పెట్టిన ఆద్వైత్‌ కు ప్రతి క్షణం ఒక కొత్త భయం ఎదురవుతుంది. తన పేరునే పిలిచే విచిత్ర స్వరాలు, తెల్లటి కళ్లున్న వృద్ధురాలు, పాత కుటుంబ ఫోటోలో తనలాగే కనిపించిన యువకుడు… ఇవన్నీ అతని గతానికి ఆ బంగ్లాతో ఏదో సంబంధం ఉందనే అనుమానాన్ని మరింత బలపరుస్తాయి. కానీ రాత్రి ముగిసినా… ఆ ఇంటి రహస్యం మాత్రం ఇంకా మొదలే అవుతుంది.   ***   ఆ ముసలాయన చెప్పింది విన్న తరువాత […]

4 min 30 views
ఆమె ఇంకా అక్కడే ఉంది... Premium

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 7

రహస్యమైన బంగ్లాలో జరిగిన విచిత్ర సంఘటనల తర్వాత, ఆద్వైత్ ఆ ఇంటి నిజం తెలుసుకోవడానికి వేలగూడెం గ్రామంలోకి అడుగు పెడతాడు. కానీ గ్రామస్థులు ఆ బంగ్లా పేరు వినగానే భయపడిపోతారు. అదే సమయంలో రాము అనే చిన్నబ్బాయి, బావి దగ్గర కనిపించే తెల్లచీర అమ్మాయి గురించి చెబుతాడు. చివరికి ఓ వృద్ధుడు ముప్పై సంవత్సరాల క్రితం ఆ బంగ్లాలో జరిగిన భయానక సంఘటనల వెనుక ఉన్న అసలు కథ చెప్పడానికి సిద్ధమవుతాడు…    ***   ఆ […]

4 min 27 views
ఆమె ఇంకా అక్కడే ఉంది... Premium

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 8

బావి దగ్గర ఓ వృద్ధుడు చెప్పిన మాటలతో ఆద్వైత్‌ కు మృణాళిని ఇప్పటికీ ఆ బంగ్లాలోనే ఉందని తెలుస్తుంది. బావిలో కనిపించిన ఆమె ప్రతిబింబం, ప్రేమ కోసం ఎదురు చూస్తున్న ఒక ఆత్మ, ప్రతీకారం కోసం తిరుగుతున్న మరో ఆత్మ గురించి వృద్ధుడు హెచ్చరిస్తాడు. తర్వాత గ్రామంలో ఆధారాలు వెతికిన ఆద్వైత్‌ కు ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసినా, మృణాళిని పేరు మాత్రం ఎక్కడా కనిపించదు. గ్రామ చరిత్రనే ఎవరో మార్చేశారనే […]

4 min 34 views
ఆమె ఇంకా అక్కడే ఉంది... Premium

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 9

ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన భయంకరమైన నిజం ఆద్వైత్ ముందు నెమ్మదిగా తెరుచుకుంటుంది. మృణాళిని అతన్ని బంగ్లాలోని రహస్య గ్రంథాలయానికి తీసుకెళ్లి, ఎర్రటి డైరీని చూపిస్తుంది. ఆ డైరీలో తన పేరు ముందే రాసి ఉండటంతో ఆద్వైత్ షాక్‌ కు గురవుతాడు. ఆ తర్వాత అతనికి తన గత జన్మ జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు రావడం మొదలవుతుంది. ఒకప్పుడు “వేలవనం”గా పిలవబడిన ఆ గ్రామంలో, ఆది అనే యువ ఉపాధ్యాయుడు, మృణాళిని అనే యువతిని ప్రేమించాడని తెలుస్తుంది. […]

4 min 35 views
ఆమె ఇంకా అక్కడే ఉంది... Premium

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 10

ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన విషాదకరమైన ప్రేమ కథ వెనుక ఉన్న నిజం ఆద్వైత్‌ కు నెమ్మదిగా తెలుస్తుంది. సిద్ధయోగి చెప్పిన మాటల ప్రకారం, ఆది పునర్జన్మలో ఆద్వైత్‌ గా తిరిగి వస్తాడని, మృణాళిని కోసం మళ్లీ ఆ బంగ్లాకు చేరుకుంటాడని డైరీలో ముందే రాసి ఉంటుంది. ఆ డైరీ చదవగానే ఆద్వైత్‌ కు గత జన్మ జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తాయి. చివరికి తాను ఆ పూర్వజన్మలోని ఆది అనే విషయాన్ని గ్రహించిన ఆద్వైత్‌ ను […]

4 min 21 views