New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఎదుట నిలిచింది చూడు

6 stories Ongoing Family Drama Romance Suspense

ఆ గది మొత్తం అందంగా అలంకరించబడి ఉంది. గది నిండా పరచుకున్న పూల పరిమళం, మంచం మీద అలంకరించిన గులాబీ రేకులు, గదిలో అక్కడక్కడా వెలుగుతున్న మసక దీపాలు......   ఆ వాతావరణం కొత్తగా పెళ్లయిన జంటకు ఎంతో మధురమైన అనుభూతిని కలిగించేలా ఉంది. ​కానీ ఆ గదిలో ఉన్న అమ్మాయి మనసులో మాత్రం ఎలాంటి సంతోషం లేదు.​గదిలోని ఓ మూలన మోకాళ్ల మీద చేతులు వేసుకుని కూర్చున్న దన్విక కళ్లలో భయం, మనసులో అంతులేని ఆందోళన కనిపిస్తున్నాయి. పెళ్లి బట్టల్లో ఉన్న ఆమె చేతులు వణుకుతున్నాయి. మెడలో ఉన్న తాళిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ​దాన్విక మనసులో... ​అసలు నా జీవితంలో ఏం జరుగుతోంది?ఏదో అనుకున్నాను,ఏదో చేయాలనుకున్నాను, కానీ చివరికి ఏంటి…

Browse Stories

ఎదుట నిలిచింది చూడు

ఎదుట నిలిచింది చూడు – 1

ఆ గది మొత్తం అందంగా అలంకరించబడి ఉంది. గది నిండా పరచుకున్న పూల పరిమళం, మంచం మీద అలంకరించిన గులాబీ రేకులు, గదిలో అక్కడక్కడా వెలుగుతున్న మసక దీపాలు……     ఆ వాతావరణం కొత్తగా పెళ్లయిన జంటకు ఎంతో మధురమైన అనుభూతిని కలిగించేలా ఉంది.       ​కానీ ఆ గదిలో ఉన్న అమ్మాయి మనసులో మాత్రం ఎలాంటి సంతోషం లేదు.​గదిలోని ఓ మూలన మోకాళ్ల మీద చేతులు వేసుకుని కూర్చున్న దన్విక కళ్లలో […]

3 min 49 views
ఎదుట నిలిచింది చూడు

ఎదుట నిలిచింది చూడు – 2

అగస్త్య మాటలు విన్న దాన్విక అక్కడే నిలబడిపోయింది. తన జీవితంలో ఇంతటి పరిస్థితి ఎదురవుతుందని ఆమె కలలో కూడా అనుకోలేదు.    ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి నుంచి బయటపడవచ్చని అనుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు తన చేతుల్లో లేకుండా పోయాయి.   అగస్త్య బాల్కనీలోకి వెళ్లి అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. తన ఫోన్ తీసి ఏదో చూస్తూ ఉండిపోయాడు. దాన్విక మాత్రం అతనివైపే చూస్తోంది.   ఈయన ఏంటి,అసలు ఏం అనుకుంటున్నారు, నేను ఈ […]

3 min 21 views
ఎదుట నిలిచింది చూడు

ఎదుట నిలిచింది చూడు – 3

రేపు ఉదయం ఈ ఇంట్లో వాళ్లందరూ నిన్ను రకరకాల ప్రశ్నలు అడుగుతారు.    అసలు నువ్వెవరు? పెళ్లికూతురు ప్లేస్‌లోకి ఎందుకు వచ్చావు? అసలు పెళ్లికూతురికి ఏమైంది? ఇలాంటి ప్రశ్నలు చాలానే అడుగుతారు.    వాళ్లకు నిన్ను చూసి అనుమానం రావడం సహజమే. ఎందుకంటే నువ్వు పెళ్లికూతురివి కాదు, పెళ్లికూతురు స్థానంలోకి వచ్చి కూర్చున్నావు.    కాబట్టి వాళ్లకు చాలా విషయాలు అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతారు అంటూ ఆమె ముఖంలోకి సూటిగా చూశాడు.    దన్విక భయంగా […]

3 min 22 views
ఎదుట నిలిచింది చూడు Premium

ఎదుట నిలిచింది చూడు – 4

లోపల అందంగా మడతపెట్టి ఉంచిన ఒక చీర కనిపించింది. దన్విక క్షణం పాటు ఆ చీరనే చూస్తూ ఉండిపోయింది.ముదురు గులాబీ రంగులో బంగారు జరీ అంచుతో మెరిసిపోతున్న ఆ చీర చూడటానికి ఎంతో అందంగా ఉంది.    దానితో పాటు సరిపోయే బ్లౌజ్, కొన్ని అవసరమైన అలంకరణ వస్తువులు కూడా చక్కగా అమర్చి ఉన్నాయి.    ఆ చీరను చూసిన దన్విక ఆశ్చర్యంగా అగస్త్య వైపు తిరిగింది. ఇది ఇది ఎవరి కోసం సర్ అని అడిగింది. […]

3 min 16 views
ఎదుట నిలిచింది చూడు Premium

ఎదుట నిలిచింది చూడు – 5

మనం పెళ్లి కుదిర్చిన అమ్మాయి ఒకరు, అగస్త్య పెళ్లి చేసుకున్న అమ్మాయి మరొకరు. అసలు ఆ అమ్మాయి ఎవరు? పెళ్లికూతురు స్థానంలోకి ఎలా వచ్చింది?   ఇవన్నీ తలుచుకుంటుంటేనే మనసంతా గందరగోళంగా ఉంది అని ఆందోళనగా చెప్పింది. ఆమె మాటలు విన్న ప్రతాప్ కూడా నిట్టూరుస్తూ నాకూ అదే అర్థం కావడం లేదు.    ఇంత పెద్ద విషయం జరిగితే కనీసం మనకు ఏదో ఒక సమాచారం అయినా ఉండాలి కదా,అసలు అగస్త్యకు ఈ విషయం ముందే […]

4 min 13 views
ఎదుట నిలిచింది చూడు Premium

ఎదుట నిలిచింది చూడు – 6

అగస్త్య దన్వికతో కలిసి మెట్లు దిగి కిందకు వచ్చేసరికి హాల్లో ఉన్న కుటుంబ సభ్యులందరి చూపులు ఒక్కసారిగా వాళ్లిద్దరిపైనే పడ్డాయి.    అప్పటికే అగస్త్య కోసం ఎదురుచూస్తూ ఎన్నో ప్రశ్నలతో సతమతమవుతున్న వాళ్లకు, అతని పక్కన ఉన్న దన్వికను చూడగానే తమ సందేహాలను ఆపుకోవడం మరింత కష్టమైంది…..   అసలు నిన్నటి పెళ్లిలో ఏం జరిగిందో, తాము పెళ్లి కుదిర్చిన అమ్మాయి ఏమైందో, ఇప్పుడు అగస్త్య పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో ఎవరికీ అర్థం కావడం […]

4 min 26 views