New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

వాలం

14 stories Ongoing Thriller Suspense Mythology

   పడమట సూర్యుడు అస్తమించి అరగంట కావస్తుంది. చీకటి జడలు విప్పి దిక్కుల్లో పరచుకుంటుంది. ఆ ప్రాంతం అంతా దట్టమైన అటవీ ప్రాంతం. ఎత్తయిన, దట్టమైన చెట్లతో ఆకాశాన్ని మూసేస్తుంది.  అన్నిరకాల జంతువులకి నివాసం.. ఆ అడవి. కీచురాళ్ల రొద అప్పుడప్పుడు తీతువు పిట్ట కూతలు.. ఉన్నట్టుండి ఎక్కడ్నుంచో వినిపిస్తున్న నక్క ఊళలు.. భయానక వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అడవి కి కిలోమీటర్ దూరంగా విశాల మైన పచ్చిక బయలు లో ఉన్న టెంట్ హౌస్ ముందు నెగడు వెలుగుతూ ఉంది. టెంట్ హౌస్ లో లాంతరు వెలుతురు పలచగా పరుచుకుని ఉంది.లోపల మూలగా ఉన్న ఫోల్డింగ్ టేబుల్ మీద.. ఉంది ఆ లాంతరు. ఆ టేబుల్ ముందు వేసున్న కుర్చీ లో కూర్చుని డైరీ రాసుకుంటున్నాడు…

Browse Stories

వాలం Premium

వాలం – 11

ఎత్తవే చూస్తా.. అన్న మాట విని ఖంగుతిని వెనక్కి తిరిగింది మహిత.    గుర్రుగా చూస్తూ నిలబడ్డాడు అక్కడ అరవింద్.    ఏంటే వీడు.. ఎటు వైపు నుండి వస్తున్నాడో కూడా తెలియడం లేదు.. అని గొనిగింది అంజలి.    ఆరడుగుల ఎత్తున్న అతన్ని కింద నుండి పైకి చూస్తూ.. పొడుగున్నావని పొగరా.. అంది మహిత కోపంగా.    అదికాదు కాని.. ఎత్తితే నాలుగు ముక్కలు అవుతానా.. నీ సైజు ఏంటి ఆ మాటలేంటి.. భూమికి జానెడు […]

5 min 10 views
వాలం Premium

వాలం – 12

మీరేనా అరవింద్? అంటూ తన దగ్గరకి వచ్చిన కానిస్టేబుల్ ని చూసి.. అవునంటూ తల ఊపాడు అరవింద్.   రండి.. మా ఎస్సై గారు రమ్మంటున్నారు.. అంటూ లోపలికి తీసుకువెళ్లాడు ఆ కానిస్టేబుల్.   గుమ్మానికి సగం లో ఉన్న చిన్ని తలుపులని తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు అరవింద్.   టేబుల్ ముందు కూర్చొని ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ కూర్చోమన్నట్టు చేత్తో సైగ చేసాడు ఎస్సై.    ఆ టేబుల్ ముందున్న చైర్ లో కూర్చుని […]

5 min 10 views
వాలం Premium

వాలం – 13

అరవింద్.. మీ అంకుల్ కనపడలేదని మీరు ఆవేశ పడొచ్చు.. కానీ ఏం చేసినా సరే అన్ని ఆలోచించుకుని చేయాలి మీరు.. ఆయన మిస్ అయిన ప్లేస్ నేను మీకు చెప్తాను.. కానీ తొందరపడి అడవిలోకి మాత్రం వెళ్ళకండి.. నాకు తెలియకుండా ఏమి చేయకండి.. జస్ట్.. ఇక్కడ కొన్ని రోజులు ఉండండి అంతే.. అన్నాడు రంజిత్.    నాకు ఒక్క విషయం అర్థం కాలేదు.. మహదేవ్ అంకుల్ అభిరామ్ని వెతుక్కుంటూ హంపికి ఎందుకొచ్చినట్టు .. హంపి కి అభిరామ్ […]

5 min 11 views
వాలం Premium

వాలం – 14

దారంతా మెట్ల మార్గం లా ఉన్నది గానీ మెట్లలా సర్దిపెట్టిన రాళ్లు మాత్రమే అవి.  ఏమాత్రం జారి పడిన గట్టిగానే గాయపడే అవకాశం ఉంది.. అడ్వెంచర్స్ చేయటానికి ఇష్టపడిన వాళ్లు కాబట్టి అందరూ ఉత్సాహంగానే అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నారు.    కొండమీద పచ్చగా ఉన్న మొక్కలు కన్నా పెద్దపెద్ద బండరాళ్లే ఎక్కువగా ఉన్నాయి.. ఏ క్షణం దొర్లి పడతాయేమో అన్నoత భయంకరంగా అవి నిలబడి ఉన్నాయి. వాటిని గమనిస్తూ ఏవేవో జోకులు వేసుకుంటూ ముందుకి అడుగు […]

5 min 14 views