New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

వాలం

14 stories Ongoing Thriller Suspense Mythology

   పడమట సూర్యుడు అస్తమించి అరగంట కావస్తుంది. చీకటి జడలు విప్పి దిక్కుల్లో పరచుకుంటుంది. ఆ ప్రాంతం అంతా దట్టమైన అటవీ ప్రాంతం. ఎత్తయిన, దట్టమైన చెట్లతో ఆకాశాన్ని మూసేస్తుంది.  అన్నిరకాల జంతువులకి నివాసం.. ఆ అడవి. కీచురాళ్ల రొద అప్పుడప్పుడు తీతువు పిట్ట కూతలు.. ఉన్నట్టుండి ఎక్కడ్నుంచో వినిపిస్తున్న నక్క ఊళలు.. భయానక వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అడవి కి కిలోమీటర్ దూరంగా విశాల మైన పచ్చిక బయలు లో ఉన్న టెంట్ హౌస్ ముందు నెగడు వెలుగుతూ ఉంది. టెంట్ హౌస్ లో లాంతరు వెలుతురు పలచగా పరుచుకుని ఉంది.లోపల మూలగా ఉన్న ఫోల్డింగ్ టేబుల్ మీద.. ఉంది ఆ లాంతరు. ఆ టేబుల్ ముందు వేసున్న కుర్చీ లో కూర్చుని డైరీ రాసుకుంటున్నాడు…

Browse Stories

వాలం Premium

వాలం – 6

అరవింద్.. బాగా అలసటగా ఉంది.. నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను.. నువ్వు బయటికి వెళ్లి భోజనం చేసేసి నాకు భోజనం పార్సిల్ తీసుకొచ్చెయ్ రా.. అంది కౌసల్య.   హ్మ్.. సరే.. కాస్త నడిస్తే చాలు.. అలసిపోయాను.. అంటావు.. ఆ షుగర్ కి నడిస్తే మంచిది అని డాక్టర్లు చెప్పారు కదా.. సరేలే నువ్వు రెస్ట్ తీసుకో నేను అలా బయటకు వెళ్లి వస్తాను.. అన్నాడు.   సరే.. ఈ సారికి కాస్త రెస్ట్ తీసుకుంటాలె … […]

5 min 13 views
వాలం Premium

వాలం – 7

పురాణాల ప్రకారం, దైతాపతుల పూర్వీకుడైన విశ్వావసుడు అనే శబర రాజుకు శ్రీకృష్ణుని హృదయం దొరకడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఆ హృదయాన్నే ఇప్పుడు మనం ‘బ్రహ్మ పదార్థం’ అని పిలుస్తాము. ​దీని వెనుక కథ తెలుసుకోవాలి అంటే మనం ద్వాపర యుగానికి వెళ్లి తీరాల్సిందే.. ద్వాపర యుగం ముగిసిపోతున్నప్పుడు అంటే..శ్రీకృష్ణుని అవతార సమాప్తి.   ​ద్వాపర యుగం ముగిసే సమయంలో, శ్రీకృష్ణుడు అడవిలో ఒక చెట్టు కింద విశ్రమిస్తుండగా, జరా అనే వేటగాడు (బోయవాడు) […]

5 min 11 views
వాలం Premium

వాలం – 8

అంటే  మీరు.. అతని సన్ అయుంటారా?? అడిగాడు అతను.    కాదు.. నా పేరు అరవింద్.. మిగతా వివరాలు నేను చెప్పే ముందు.. అతని పరిస్థితి ఏంటో చెప్పండి.. అన్నాడు అరవింద్.    హి యిస్ మిస్సింగ్.. మీరు వెంటనే రాగలిగితే రండి.. వివరాలు ఇక్కడి కొచ్చాక మాట్లాడుకుందాం.. అని ఫోన్ పెట్టేసాడు అతడు.    హ్మ్.. అని గాఢంగా నిట్టూర్చి.. మహాదేవ్ అంకుల్ కి ఏం జరిగి ఉంటుంది..??  ఇప్పుడు నేను అమ్మని పట్టుకుని కోణార్క్ […]

5 min 11 views
వాలం Premium

వాలం – 9

హంపి..   ఆక్సఫర్డ్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ తో ఆ ప్రాంగణం అంతా హడావుడిగా ఉంది.    సరదాగా వచ్చిన ట్రిప్ కావడంతో అందరి ముఖాల్లోనూ సంతోషం వెల్లివిరుస్తుంది.. రంగు రంగుల సీతాకోకచిలుకల్లా ఉన్న అమ్మాయిలని ఓ కంట చూస్తూనే కబుర్లలో పడ్డారు అబ్బాయిలు.   హ్మ్.. మొత్తానికి.. ట్రిప్ ప్లాన్ బాగానే సక్సెస్ అయింది.. వినయ్.. ఈ ట్రిప్ అంతా నీ ప్లానే కదా.. అన్నాడు ముఖేష్.    ఆఖరి సంవత్సరం..ఎవరికి వారే యమునా తీరే.. […]

4 min 13 views
వాలం Premium

వాలం – 10

హోటల్  ముందు ఆటో ఆగాక చెక్ ఇన్ చేసి.. రూమ్ లోకి వెళ్లి బ్యాగ్ ఓ పక్కగా గిరవాటు వేసి.. మంచం మీద కూలబడ్డాడు అరవింద్.    అతని కళ్ళముందు ఒక అస్పష్ట మైన రూపం.. ” అరవింద్.. నేనెప్పుడూ కనపడని వాస్తవాల కోసం వెతుకుతూనే ఉంటాను.. ఎప్పుడో ఒకపుడు ఆ కనబడని వాస్తవాలు వెనుక నేను మాయమైపోతాను ఏమో నాకు తెలియదు.. నాన్నకి మాత్రం నువ్వున్నావన్న ధైర్యమే నన్ను ఎక్కడికైనా వెళ్ళనిస్తోంది.. నీకేం ఇబ్బంది లేదు […]

5 min 12 views
వాలం Premium

వాలం – 11

ఎత్తవే చూస్తా.. అన్న మాట విని ఖంగుతిని వెనక్కి తిరిగింది మహిత.    గుర్రుగా చూస్తూ నిలబడ్డాడు అక్కడ అరవింద్.    ఏంటే వీడు.. ఎటు వైపు నుండి వస్తున్నాడో కూడా తెలియడం లేదు.. అని గొనిగింది అంజలి.    ఆరడుగుల ఎత్తున్న అతన్ని కింద నుండి పైకి చూస్తూ.. పొడుగున్నావని పొగరా.. అంది మహిత కోపంగా.    అదికాదు కాని.. ఎత్తితే నాలుగు ముక్కలు అవుతానా.. నీ సైజు ఏంటి ఆ మాటలేంటి.. భూమికి జానెడు […]

5 min 10 views
వాలం Premium

వాలం – 12

మీరేనా అరవింద్? అంటూ తన దగ్గరకి వచ్చిన కానిస్టేబుల్ ని చూసి.. అవునంటూ తల ఊపాడు అరవింద్.   రండి.. మా ఎస్సై గారు రమ్మంటున్నారు.. అంటూ లోపలికి తీసుకువెళ్లాడు ఆ కానిస్టేబుల్.   గుమ్మానికి సగం లో ఉన్న చిన్ని తలుపులని తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు అరవింద్.   టేబుల్ ముందు కూర్చొని ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ కూర్చోమన్నట్టు చేత్తో సైగ చేసాడు ఎస్సై.    ఆ టేబుల్ ముందున్న చైర్ లో కూర్చుని […]

5 min 10 views
వాలం Premium

వాలం – 13

అరవింద్.. మీ అంకుల్ కనపడలేదని మీరు ఆవేశ పడొచ్చు.. కానీ ఏం చేసినా సరే అన్ని ఆలోచించుకుని చేయాలి మీరు.. ఆయన మిస్ అయిన ప్లేస్ నేను మీకు చెప్తాను.. కానీ తొందరపడి అడవిలోకి మాత్రం వెళ్ళకండి.. నాకు తెలియకుండా ఏమి చేయకండి.. జస్ట్.. ఇక్కడ కొన్ని రోజులు ఉండండి అంతే.. అన్నాడు రంజిత్.    నాకు ఒక్క విషయం అర్థం కాలేదు.. మహదేవ్ అంకుల్ అభిరామ్ని వెతుక్కుంటూ హంపికి ఎందుకొచ్చినట్టు .. హంపి కి అభిరామ్ […]

5 min 11 views
వాలం Premium

వాలం – 14

దారంతా మెట్ల మార్గం లా ఉన్నది గానీ మెట్లలా సర్దిపెట్టిన రాళ్లు మాత్రమే అవి.  ఏమాత్రం జారి పడిన గట్టిగానే గాయపడే అవకాశం ఉంది.. అడ్వెంచర్స్ చేయటానికి ఇష్టపడిన వాళ్లు కాబట్టి అందరూ ఉత్సాహంగానే అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నారు.    కొండమీద పచ్చగా ఉన్న మొక్కలు కన్నా పెద్దపెద్ద బండరాళ్లే ఎక్కువగా ఉన్నాయి.. ఏ క్షణం దొర్లి పడతాయేమో అన్నoత భయంకరంగా అవి నిలబడి ఉన్నాయి. వాటిని గమనిస్తూ ఏవేవో జోకులు వేసుకుంటూ ముందుకి అడుగు […]

5 min 14 views