New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఆమె 🏆Winner · 4th Place

25 stories Completed 🏆Winner · 4th Place Social Drama Love Inspirational

హైదరాబాద్ మహానగరం...ఉదయం నుంచి రద్దీగా ఉన్న రహదారులు...ఎక్కడ చూసినా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఆరాటంతో పరుగులు తీస్తున్న మనుషులు. ఒకవైపు ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, మరోవైపు స్కూళ్లకు వెళ్లే చిన్నారులతో నిండిన బస్సులు, రోడ్డుపై ఆగకుండా వినిపిస్తున్న వాహనాల హారన్లు... వీటన్నింటి మధ్య తనదైన వేగంతో ముందుకు సాగిపోతోంది ఆ మహానగరం.అప్పటికే వేసవి కాలం కావడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం సమయం దాటకముందే ఎండ తీవ్రత పెరిగిపోయింది. రహదారులపై నుంచి వేడి సెగలు పైకి ఎగసిపడుతున్నాయి. రోడ్డు పక్కన ఉన్న చెట్ల నీడలో కాసేపు నిలబడితే చాలు, ఆ ఎండ నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుందేమోనని చాలామంది ప్రయత్నిస్తున్నారు. అయినా ఆ వేడి నుంచి తప్పించుకోవడం అంత సులభంగా లేదు.ఆకాశంలో…

Browse Stories

ఆమె Premium

ఆమె – 11

పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన క్రియన్సీ, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువు పూర్తి చేసుకుని డిగ్రీ కాలేజీలో అడుగుపెట్టే వయసుకు వచ్చింది. చిన్నప్పటి నుంచి తన తల్లి ప్రేమలో పెరిగిన ఆమె, జీవితంలో ఎదురైన కొన్ని బాధలను మనసులోనే దాచుకోవడం నేర్చుకుంది.   బయటకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించినా, తన మనసులోని కొన్ని ఖాళీలను మాత్రం ఎవరికీ చూపించేది కాదు.   తన తల్లి తనకు ఎప్పుడూ ధైర్యం చెబుతుంది. ఏ సమస్య వచ్చినా తనకు అండగా […]

9 min 10 views
ఆమె Premium

ఆమె – 12

హైదరాబాద్‌లోని ఆ కాలేజీ ప్రాంగణం అప్పుడప్పుడే విద్యార్థుల సందడితో నిండిపోతోంది. కొందరు స్నేహితులతో మాట్లాడుతూ తరగతి గదుల వైపు వెళ్తుంటే, మరికొందరు కాలేజీ మెట్లపై కూర్చుని అసైన్‌మెంట్స్ పూర్తి చేస్తున్నారు. చెట్ల మధ్య నుంచి వీస్తున్న చల్లని గాలి, పక్షుల కిలకిలరావాలు ఆ ఉదయానికి మరింత అందాన్ని ఇస్తున్నాయి.   కాలేజీకి వచ్చిన క్రియన్సీ తన బ్యాగ్‌ను భుజానికి సర్దుకుంటూ క్లాస్‌రూమ్ వైపు నడుస్తోంది. పక్కనే ఉన్న విద్యార్థుల నవ్వులు, వాళ్లు మాట్లాడుకునే మాటలు వింటూ ముందుకు […]

8 min 12 views
ఆమె Premium

ఆమె – 13

నిజం తెలుసుకోవాలనే కోరిక   కాలేజీ జీవితం క్రియన్సీకి కొత్త అనుభవాలను పరిచయం చేసుకుంటుంది. చదువు, స్నేహితులు, సరదాలు అంటూ రోజులు గడిచిపోతున్నా, తన మనసులో మాత్రం ఒక ప్రశ్న అలాగే ఉండిపోయింది.   తన తండ్రి ఎక్కడున్నారు? తనను ఎందుకు దూరం పెట్టారు?   కాలేజీలో స్నేహితులు తమ తండ్రుల గురించి మాట్లాడుకున్నప్పుడల్లా క్రియన్సీ మౌనంగా ఉండిపోయేది. ఎవరి నాన్న వాళ్లను కాలేజీ దగ్గర దింపినా, ఫోన్ చేసి క్షేమం అడిగినా, వాళ్లతో సరదాగా గడిపినా […]

7 min 12 views
ఆమె Premium

ఆమె – 14

ఆ రాత్రంతా క్రియన్సీకి నిద్ర పోలేకపోయింది..ఎన్నో ఆలోచనలు…   కిటికీ పక్కన కూర్చుని బయటకు చూస్తున్నా, తన ఆలోచనలన్నీ మాత్రం తండ్రి చుట్టూనే తిరుగుతున్నాయి.   అమ్మ చెప్పిన మాటలు పదేపదే గుర్తొస్తున్నాయి.   “నాకు తెలిసిన విషయాలు కొన్ని ఉన్నాయి.”   అంటే తన తండ్రి గురించి అమ్మకు అన్నీ తెలుసు. కానీ తనకు ఎందుకు చెప్పడం లేదు?   తన తండ్రి ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? తనను ఎందుకు ఒక్కసారి కూడా చూడలేదు. తనను […]

6 min 12 views
ఆమె Premium

ఆమె – 15

“అంటే… నేను ఆడపిల్లగా పుట్టానని దూరం పెట్టారా?”   క్రియన్సీ గొంతు వణికింది.   నవీన సమాధానం చెప్పలేకపోయింది.   ఆమె మౌనమే క్రియన్సీకి సమాధానంగా అనిపించింది.   “కానీ అమ్మా… నేను పుట్టినప్పుడు నా తప్పేంటి? నేను కావాలని ఆడపిల్లగా పుట్టానా? నేను ఆయన కూతురిని కదా!”   క్రియన్సీ కళ్ల నుంచి కన్నీళ్లు ధారగా కారాయి.   నవీన వెంటనే కూతురిని దగ్గరకు తీసుకుంది.   “నాకు తెలుసమ్మా. నువ్వు ఏ తప్పూ చేయలేదు. […]

6 min 15 views
ఆమె Premium

ఆమె – 16

మరుసటి రోజు ఉదయం.   కిటికీలోంచి పడుతున్న సూర్యకిరణాలు గదంతా పరుచుకున్నా, క్రియన్సీ మనసులో మాత్రం చీకటి అలానే ఉంది.   నిన్న రాత్రి అమ్మ చెప్పిన విషయాలన్నీ ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి.   తన తండ్రికి మరో కుటుంబం ఉంది.   ఆయనకు పిల్లలు కూడా ఉన్నారు.   కానీ తనకు మాత్రం తండ్రి ప్రేమ అనేది ఎప్పుడూ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.   ఎందుకు?   అసలు తన తప్పేమిటి?   ఆమె మంచం […]

6 min 14 views
ఆమె Premium

ఆమె – 17

ఆ రాత్రి క్రియన్సీకి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు.   తన తండ్రి గురించి తెలిసిన నిజాలు పదేపదే గుర్తొస్తున్నాయి. తనకు తెలియని ఒక మనిషి కోసం ఇన్నాళ్లూ తన తల్లి ఎన్ని బాధలు అనుభవించిందో తలుచుకుంటే గుండె బరువెక్కిపోతోంది.   తనకు తండ్రి లేడనే బాధకంటే… తన తండ్రి ఉన్నా తనను కూతురిగా అంగీకరించలేదనే నిజమే ఎక్కువగా బాధిస్తోంది.   ‘నేను ఆడపిల్లగా పుట్టడం నా తప్పా? నన్ను కనడం అమ్మ చేసిన తప్పా? ఒక […]

9 min 19 views
ఆమె Premium

ఆమె – 18

అమ్మ గతం గురించి తెలుసుకున్న రోజు నుంచి క్రియన్సీ మనసులో ఒకే ఒక్క ఆలోచన బలంగా నాటుకుపోయింది.   “ఇన్నాళ్లూ అమ్మ నా కోసం బతికింది… ఇకపై అమ్మ కోసం నేను బతకాలి.”   తన చిన్నతనం నుంచి అమ్మ తనకోసం ఎన్ని కష్టాలు పడిందో, తనను పెంచడానికి ఎన్ని అవమానాలు భరించిందో ఇప్పుడు క్రియన్సీకి పూర్తిగా అర్థమైంది.   తనకు ఏ లోటూ తెలియకుండా పెంచడానికి అమ్మ తన అవసరాలను పక్కనపెట్టింది. తన చదువు కోసం […]

6 min 16 views
ఆమె Premium

ఆమె – 19

ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచి క్రియన్సీ తన బాధ్యతలను ఎంతో శ్రద్ధగా నిర్వర్తించేది.   ఆమెకు ఈ ఉద్యోగం కేవలం జీతం సంపాదించడానికి వచ్చిన అవకాశం కాదు. తన తల్లికి అండగా నిలబడటానికి, తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకోవడానికి దొరికిన మొదటి అవకాశం.   అందుకే ప్రతి పనిని బాధ్యతగా తీసుకునేది. తనకు అప్పగించిన పని చిన్నదైనా, పెద్దదైనా పూర్తి శ్రద్ధతో చేసేది. ఏదైనా తెలియకపోతే అడిగి తెలుసుకునేది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ వెనుకాడేది […]

7 min 16 views
ఆమె Premium

ఆమె – 20

క్రియన్సీ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి తన పనిపై ఎంతో శ్రద్ధ పెట్టేది. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తన ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రయత్నించేది.   ఆమె కష్టానికి తగిన ఫలితం దక్కింది.   తన టీమ్‌తో కలిసి పనిచేసిన ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ విజయవంతమైంది. కంపెనీకి మంచి పేరు రావడంతో మేనేజ్‌మెంట్ కూడా టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించింది.   ఆ విజయాన్ని సెలబ్రేట్ చేయడానికి ఆఫీసులో ఒక చిన్న సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.   ఆ రోజు […]

9 min 120 views