Katha Varnika – First Writing Competition: JWALA 🔥
Upcoming- CategoryJwala 🔥
- Start Date2026-10-12
- End Date2026-11-05
Description / Rules
- ప్రియమైన రచయితలారా,
కథావర్ణిక తన ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది రచయితల కలలకు ఒక వేదికగా కొత్త ఆలోచనలకు ఒక గుర్తింపుగా కొత్త కథలకు ఒక కొత్త అవకాశంగా కథావర్ణిక నిర్వహిస్తున్న తొలి ప్రత్యేక రచనా పోటీ జ్వాలా.
కథలు ఎప్పుడూ ఆగిపోవు ఒక కథ ముగిసిన చోట మరో కథ మొదలవుతుంది అలాగే ఒక పోటీ ముగిసిన చోట మరో కొత్త అవకాశం మొదలవుతుంది. ఇది కేవలం ఒక పోటీ కాదు కథావర్ణికలో మొదలవుతున్న ఎన్నో రచనా పోటీలకు తొలి అడుగు.
ఈ రోజు “జ్వాలా”తో మొదలయ్యే ఈ ప్రయాణం రేపు మరెన్నో కొత్త కథలకు, మరెన్నో కొత్త కాన్సెప్ట్స్‌కు, మరెన్నో కొత్త రచయితలకు వేదికగా మారబోతోంది.
ఎందుకంటే మా ప్రయాణం కేవలం కథలను ప్రచురించడం కోసం కాదు కథలు రాసే మనుషులను గుర్తించడం కోసం కలలు కనే రచయితలను ప్రోత్సహించడం కోసం కొత్త గొంతులను పాఠకులకు పరిచయం చేయడం కోసం మరి ఆ ప్రయాణానికి తొలి అడుగు జ్వాల.
కథావర్ణిక అంటే?
కథలు చదవడానికి మాత్రమే కాదు, కథలు రాయడానికి కూడా ఒక వేదిక. ఇప్పటికే రచనలు చేస్తున్న రచయితలకైనా, మొదటిసారి కథ రాయాలని కలలు కంటున్న కొత్త రచయితలకైనా కథావర్ణిక మీ కలానికి ఒక వేదిక.
త్వరలో కథావర్ణికలో ప్రారంభం కానున్న ఈ ప్రత్యేక రచనా పోటీ ద్వార మీ ఊహలకు అక్షరాలు ఇవ్వండి. మీ అక్షరాలకు ఒక కథను ఇవ్వండి. ఆ కథకు ఒక బలమైన కథానాయికను ఇవ్వండి. ఇది కేవలం ఎవరు గెలుస్తారు? అనే పోటీ కాదు ఎవరు తమ కథను పూర్తిగా చెప్పగలరు? ఎవరి కలం పాఠకుడి హృదయాన్ని తాకగలదు? ఎవరి కథ ఒక స్ఫూర్తిగా నిలవగలదు? అనే ఒక అందమైన ప్రయాణం.
జ్వాలా ఎందుకు?
దసరా – దీపావళి పండుగల వెలుగుల సందర్భంగా, ఒక దీపం చీకటిని తొలగించినట్టే,ఒక మంచి కథ ఒక మనిషి మనసులోని చీకటిని తొలగించగలదనే నమ్మకంతో కథావర్ణిక “జ్వాలా”ను మీ ముందుకు తీసుకొస్తోంది. వెలుగు బయట కనిపించేది మాత్రమే కాదు మనలోని చీకటిని జయించినప్పుడు పుట్టేది కూడా. ఈ పోటీ ద్వారా మీ కథలోని కథానాయిక కేవలం ఒక పాత్రగా కాకుండా ఒక శక్తిగా నిలవాలి.
పోటీ నేపథ్యం :
మీ కథలో ఒక బలమైన మహిళా కథానాయికను సృష్టించండి ఆమె జీవితంలో ఒక పెద్ద సమస్యను చూపించండి ఆ సమస్య ఆమె జీవితాన్ని ఎలా కుదిపేసిందో చూపించండి. ఆమె ఎలా కుంగిపోయిందో చూపించండి. ఆ తర్వాత ఆమె ఎలా లేచిందో, ఎలా పోరాడిందో చూపించండి చివరికి ఆమె తన జీవితానికి తానే విజేతగా ఎలా నిలిచిందో చెప్పండి.
మీ కథకు కొన్ని స్ఫూర్తి అంశాలు :
మీ కథ తప్పనిసరిగా వీటిలో ఒకదానినే అనుసరించాల్సిన అవసరం లేదు. ఇవి కేవలం మీ ఆలోచనలకు ఒక దిశ చూపించడానికి మాత్రమే.
1. మోసపోయిన అమ్మాయి తనకు అత్యంత నమ్మకమైన వ్యక్తి మోసం చేసిన తర్వాత ఆమె ఎలా తిరిగి నిలబడింది?
2. ప్రేమలో విఫలమైన అమ్మాయి. ప్రేమను కోల్పోయిన తర్వాత తనను తాను ప్రేమించుకోవడం ఎలా నేర్చుకుంది?
3. అత్తింటి సమస్యలను ఎదుర్కొన్న కోడలు అవమానాలు, అపార్థాలు, కుటుంబ సమస్యల మధ్య తన గౌరవాన్ని ఎలా కాపాడుకుంది?
4. కఠినమైన / హింసాత్మక సంబంధంలో చిక్కుకున్న మహిళ తన భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తు కోసం ఆమె ఎలాంటి ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంది?
5. చదువు లేకపోయినా జీవితంలో గెలిచిన అమ్మాయి. అవకాశాలు లేకపోయినా తన ప్రతిభను నమ్ముకుని తనకంటూ ఒక ప్రపంచాన్ని ఎలా నిర్మించుకుంది?
6. ఆర్థికంగా ఆధారపడిన మహిళ ఒక చిన్న అవకాశంతో మొదలుపెట్టి తన కాళ్లపై తాను ఎలా నిలబడింది?
7. కుటుంబం కోసం తన కలలను వదులుకున్న అమ్మాయి. ఏళ్ల తర్వాత తనలో చనిపోయిన కలను మళ్లీ ఎలా బతికించింది?
పోటీ నియమాలు :
1. కథ ప్రారంభిస్తే పూర్తి చేయాలి
పోటీ కోసం కథను ప్రారంభించిన ప్రతి రచయిత తప్పనిసరిగా కథను పూర్తి చేయాలి. మధ్యలో కథను అసంపూర్ణంగా వదిలేయడం పోటీ నిబంధనలకు విరుద్ధం.
2. మొత్తం 25 పార్ట్స్ తప్పనిసరి
ప్రతి కథ కచ్చితంగా 25 పార్ట్స్ తో ఉండాలి ప్రతి పార్ట్ కథను ముందుకు తీసుకెళ్లాలి పాఠకుడిలో తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తిని కలిగించాలి.
3. ప్రతి పార్ట్ కనీసం 1000 పదాలు
ప్రతి పార్ట్ కనీసం 1000 పదాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి పాత్రలు, భావోద్వేగాలు, సంఘటనలు, సంఘర్షణలు, కథా మలుపులు స్పష్టంగా ఉండేలా కథను వివరంగా రాయాలి.
4. జోనర్ తప్పనిసరిగా ఎంచుకోవాలి
కథను ప్రచురించేటప్పుడు జోనర్ లో “జ్వాలా” అనే కాంపిటీషన్ జోనర్ ను తప్పనిసరిగా ఎంచుకోవాలి.
5. అనర్హత
పోటీ చివరి తేదీ లోపు పూర్తి అవ్వని సిరీస్ లు పోటీకి పరిగణించబడవు.
ముఖ్యమైన తేదీలు :
1. ప్రారంభ తేదీ – 12 అక్టోబర్ 2026
2. చివరి తేదీ – 5 నవంబర్ 2026
3. ఫలితాల ప్రకటన – 8 నవంబర్ 2026
రచయితగా మీ బాధ్యత :
సృజనాత్మకతకు హద్దులు ఉండకపోయినా, బాధ్యతాయుతమైన రచనకు కొన్ని హద్దులు తప్పనిసరి. కాబట్టి మీరు రాసే కథలో
1. Copy Right / ముఖ్యంగా కథ మీ ఆలోచనలో నుండి పుట్టినదై ఉండాలి. ఎలాంటి కాపీ రచనలు పరిగణం లోకి రావు.
2. Sexual Harassment / లైంగిక వేధింపులను అసభ్యకరంగా లేదా అనుచితంగా చూపించకూడదు.
3. Child Abuse / చిన్నారులపై వేధింపులకు సంబంధించిన అనుచితమైన కంటెంట్ ఉండకూడదు.
4. ద్వేషం, హింస లేదా తప్పుదోవ పట్టించే ఆలోచనలను ప్రోత్సహించేలా కథ ఉండకూడదు.
5. ఏ వ్యక్తి, వర్గం లేదా సమూహాన్ని కించపరిచే లేదా రెచ్చగొట్టేలా కథ ఉండకూడదు.
6. కథలో సున్నితమైన అంశాలు ఉన్నప్పటికీ వాటిని బాధ్యతాయుతంగా, పరిమితుల్లో చూపించాలి. కలం చేతిలో ఉన్నపుడు మన మాటలకు మాత్రమే కాదు, మన ప్రభావానికి కూడా మనమే బాధ్యత
బహుమతులు :
1. టాప్ 5 రచయితలకు ప్రత్యేక గౌరవం
మా న్యాయనిర్ణీత బృందం ఎంపిక చేసిన మొదటి ఐదు మంది విన్నర్లకి కథావర్ణిక ప్రత్యేక డిజిటల్ మెయిల్ ఒక ప్రత్యేక సర్ప్రైజ్ గిఫ్ట్ — మీ ఇంటి వద్దకే.
2. పోటీలో పాల్గొనే ప్రతి రచయితకూ గుర్తింపు
టాప్ 5 లో మీ కథ లేకపోయినా మీ ప్రయత్నం విలువైనదే పోటీలో పాల్గొని, నిబంధనలకు అనుగుణంగా కథను విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి రచయితకు కథావర్ణిక తరఫున డిజిటల్ మెయిల్l అందజేయబడుతుంది.
ప్రత్యేక రివార్డ్స్ :
1. టాప్ 5లో ఎంపికైన కథలకు ప్రత్యేక విజిబిలిటీ లభిస్తుంది. మీ కథ 30 రోజుల పాటు కథావర్ణిక హోమ్ స్క్రీన్ పై ప్రత్యేకంగా డిస్ప్లే అయ్యే అవకాశం ఉంటుంది దీంతో మీ కథను మరింతమంది పాఠకులకు పరిచయం చేసే అవకాశం లభిస్తుంది. మీ కథానాయిక పాఠకుల మనసుల్లో నిలవొచ్చు మీ కథ మీ పేరుకు ఒక కొత్త గుర్తింపును తీసుకురావచ్చు.
2. పోటీలో పాల్గొని, ఇచ్చిన గడువులోపు కథను విజయవంతంగా పూర్తి చేసిన కథలను కథావర్ణిక తరపున ప్రమోషనల్ ప్లాట్ఫార్మ్స్ద్వారా పాఠకులకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం.
3. మీ కథలు సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్, డిజిటల్ ప్లాట్ఫార్మ్స్, కథావర్ణిక ప్రమోషనల్ ఛానల్స్ వంటి వేదికల ద్వారా మరింతమంది పాఠకులకు చేరే అవకాశం ఉంటుంది.
కథ రాయడం మీ బాధ్యత ఆ కథ మరింతమంది పాఠకులకు చేరే ప్రయాణంలో మీతో ఉండటం మా ప్రయత్నం. ఈసారి మీ కథ కేవలం ఒక సిరీస్ గా మిగలకూడదు అది ఒక అమ్మాయి ధైర్యానికి ప్రతిరూపంగా నిలవాలి ఒక పాఠకుడి
మనసును తాకాలి ఒక అమ్మాయికి స్ఫూర్తిగా మారాలి మరొక రచయితలో నేను కూడా రాయగలను అనే నమ్మకాన్ని కలిగించాలి.
టెక్నికల్ సపోర్ట్ :
పోటీ గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే
మీ ప్రశ్నలకు సమాధానం కోసం మా whatsapp support number 9963735072 కి మీ సందేహాన్ని స్పష్టంగా వివరించి మెసేజ్ చేయండి మా టీమ్ వీలైనంత త్వరగా మీకు స్పందిస్తుంది.
మీ కథ… మా వేదిక!
కథావర్ణిక కేవలం కథలు చదివే వేదిక మాత్రమే కాదు మీ ఊహలకు అక్షరాల రూపం ఇచ్చే వేదిక ఈ పోటీలో మీరు రాసే ప్రతి కథకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది మీ సృజనాత్మకత, మీ రచనా శైలి, మీ ఊహాశక్తి ఇవే మీ విజయానికి బాటలు వేస్తాయి మీరు రాసిన కథను కథావర్ణిక లో ప్రచురించండి మీ అక్షరాలకు పాఠకుల హృదయాల్లో చోటు కల్పించండి. ఒక కథతో మొదలైన ప్రయాణం.
ఒక విజయంతో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టొచ్చు.
ఆల్ ది బెస్ట్
కథావర్ణిక టీమ్.
Competition has not started yet.