New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ

20 stories Ongoing Adventure Suspense Crime

చిమ్మచీకటి... ఆ పల్లెటూరి రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గుడిసె పైకప్పు మీద వర్షం కురుస్తోంది.గుడిసె మూలన ఉన్న చిన్న దీపం వెలుతురులో, ఏడేళ్ల కూతురు అక్షర, ఐదేళ్ల కొడుకు వివేక్ ఆకలితో ఏడుస్తూ అమ్మ ఒళ్ళో తలదాచుకున్నారు. భర్త రాఘవ చనిపోయి అప్పుడే ఆరు నెలలు దాటింది. అప్పటివరకు ఇల్లే ప్రపంచంగా బతికిన తులసికి, ఇప్పుడు రేపటి బతుకు ఎలా అనే ప్రశ్న మిగిలింది.పక్కింటి రంగమ్మ వచ్చి, "ఏమే తులసి, రేపటి నుండి మా పొలంలో కూలిపనికి వస్తావా? రోజుకు వంద రూపాయలు ఇస్తారు. పిల్లల్ని సాకాలిగా మరి.కన్నీళ్లు తుడుచుకుని తులసి తల ఊపింది. అవును, తను ఒంటరిది కాదు... ఇద్దరు పిల్లల తల్లి. వాళ్ల భవిష్యత్తు తన చేతుల్లోనే ఉంది.మరుసటి రోజు…

Browse Stories

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 6

రాజేంద్ర పంపిన బదిలీ ఉత్తర్వులు చూసి తులసి వెనక్కి తగ్గలేదు. సాధారణంగా ఐఏఎస్ అధికారులు బదిలీ ఆర్డర్ రాగానే సర్దుకుంటారు, కానీ తులసి వెనుక ఉన్నది కేవలం ఒక అధికారి కాదు… తన భర్తను చంపిన హంతకులపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఒక భార్య సంకల్పం! ఆ రాత్రంతా ఆమె నిద్రపోలేదు. రాజేంద్ర అక్రమంగా జరిపిన బదిలీని సవాల్ చేస్తూ, తన తరఫున హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేయడానికి ఢిల్లీలో పరిచయమైన ఒక సీనియర్ లాయర్ స్నేహితుడి […]

3 min 17 views
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 7

భర్త రాఘవ మరణం వెనుక ఉన్న భయంకరమైన నిజం తెలిసినప్పటి నుండి తులసి గుండెల్లో ప్రతీకార జ్వాల రగులుతూనే ఉంది. రాజేంద్రపై చట్టపరంగా హంతకుడిగా ముద్ర వేయాలంటే కేవలం ఆనందరావు మాస్టారు చెప్పిన మాటలు సరిపోవు, కోర్టు ముందు నిలబడే బలమైన సాక్ష్యాధారాలు కావాలని ఆమెకు తెలుసు. అందుకోసం ఆమె కలెక్టరేట్‌లోని నమ్మకమైన కొద్దిమంది సిబ్బందితో ఒక రహస్య విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. మూడేళ్ల క్రితం క్వారీలో జరిగిన ఆ ప్రమాదం రోజున అక్కడ డ్యూటీలో […]

3 min 14 views
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 8

తీవ్రమైన భయంతో, షాక్‌తో అతని చేతిలోని ఫోన్ కిందపడి ముక్కలైపోయింది. అక్కడ కుర్చీల్లో కట్టేసి ఉన్నది కలెక్టర్ తులసి పిల్లలు అక్షర, వివేక్ కాదు. స్వయంగా రాజేంద్ర ప్రాణంగా చూసుకునే అతని కన్నకూతురు శృతి, కొడుకు రాహుల్ నగరంలోని పెద్ద స్కూల్ లో  చదువుకుంటున్న ఆ ఇద్దరు పిల్లలు, భయంతో వణికిపోతూ తమ తండ్రి వైపు చూసి ఏడవడం మొదలుపెట్టారు.   రాజేంద్రకు కాళ్ల కింద భూమి బద్దలైనంత పనైంది. కళ్లు తిరిగినట్లయి వెనక్కి అడుగులు వేశాడు. […]

4 min 12 views
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 9

రాజేంద్ర అరెస్ట్ ఊరంతటా కార్చిచ్చులా వ్యాపించింది. నిన్నటివరకు జిల్లాను తన గుప్పిట్లో పెట్టుకుని శాసించిన ఒక బహుబలి లాంటి రాజకీయ నాయకుడు, ఇసుక మాఫియా డాన్… ఒక సాధారణ మహిళ, కలెక్టర్ తులసి వేసిన మాస్టర్ ప్లాన్‌కు దొరికిపోయి బేడీలతో జైలు పాలవ్వడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.      మీడియా ఛానెళ్లు అన్నీ కలెక్టరేట్ ముందే మొహరించాయి. తులసి తన భర్త హత్యకు సంబంధించిన పాత ఫైళ్లను, కానిస్టేబుల్ వెంకటయ్య ఇచ్చిన రహస్య డైరీని కోర్టు […]

5 min 11 views
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 10

రాజేంద్ర జైలు పాలైనప్పటికీ, అతని వెనుక ఉన్న రాజకీయ శక్తులు తులసిని ప్రశాంతంగా ఉండనివ్వ లేదు. రాజేంద్రకు అత్యంత ఆప్తుడైన రాష్ట్ర హోమ్ మినిస్టర్ భార్గవ్ రామ్ రంగంలోకి దిగాడు. తులసిని నేరుగా బదిలీ చేస్తే మళ్లీ కోర్టు స్టే తెచ్చుకుంటుంద ని గ్రహించిన భార్గవ్ రామ్, ఆమెపై ఒక నకిలీ అవినీతి నింద మోపాలని కుట్ర పన్నాడు. కలెక్టరేట్‌లో ని ఒక అవినీతి అధికారిని లొంగతీసుకుని, తులసి చాంబర్‌లో ని ఒక రహస్య లాకర్‌ లో […]

3 min 18 views
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 11

తులసి ఒక్క అడుగు ముందుకు వేసి  గంభీరమైన స్వరంతో, “వీరభద్రం! ఈ భూమి రాజేంద్రది కాదు, ప్రభుత్వానిది. ప్రజలది. ఈ రోజు ఇక్కడ అక్షరానికి పునాది పడి తీరుతుంది. దాన్ని అడ్డుకునే మొగాడు ఈ జిల్లాలో ఎవడూ లేడు” అని సింహంలా గర్జించింది. వెంటనే తులసి తన స్మార్ట్‌ఫోన్ తీసి లౌడ్‌స్పీకర్‌ ఆన్ చేసి జిల్లా ఎస్పీకి డయల్ చేసింది. “ఎస్పీ గారు! రాజేంద్ర రౌడీలు స్కూల్ శంకుస్థాపనను అడ్డుకుంటున్నారు. నా ఫోన్ లైవ్ లొకేషన్ ట్రాక్ […]

4 min 17 views
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 12

కలెక్టర్ తులసి పంపిన పక్కా ఆధారాల రిపోర్ట్ వల్ల హోమ్ మినిస్టర్ భార్గవ్ రామ్ తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అధికార గర్వంతో ఉన్న అతనికి ఒక  మహిళ, అది కూడా ఒక కలెక్టర్ తన పదవిని ఊడగొట్టడం అస్సలు జీర్ణం కాలేదు. పదవి పోయినా తనకున్న అంగబలం, అర్థబలం తో తులసి పై పగ తీర్చుకోవడానికి భార్గవ్ రామ్ కుట్రలు పన్నడం మొదలుపెట్టాడు. మొదటగా, తులసిని మానసికంగా దెబ్బతీయడానికి ఆమె పై అవినీతి ఆరోపణలు చేస్తూ […]

3 min 13 views
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 13

తులసి బయట ప్రపంచంలో ఎంత పెద్ద తుఫానునై నా ఎదుర్కొని నిలబడే కలెక్టర్ తులసికి, ఇంటికి రాగానే తన పిల్లల నవ్వులే ఉపశమనం. రఘు చనిపోయిన తర్వాత తులసి సివిల్స్ చదవడానికి తులసిని ప్రోత్సహించి తనకి అన్ని విషయాలలో తోడు ఉంటూ తాను కలెక్టర్ అయిన దగ్గర నుండి  నేటివరకు ఆమెకు, ఆమె పిల్లలకు నీడలా నిలిచింది ఆనందరావు మాస్టారు. తులసి కి గురువైన ఆనందరావు మాస్టారు, ఇప్పుడు తులసి పిల్లలై న పదకొండేళ్ల అక్షర, తొమ్మిదేళ్ల […]

4 min 6 views
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 14

తులసి రఘు రాసిన పాత డైరీ తులసి చేతికి దొరికిందనే నిజం జైల్లో ఉన్న రాజేంద్ర, భార్గవ్ రామ్‌లకు తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. కలెక్టర్ తులసి తీసుకున్న కఠిన చర్యల వల్ల రాజేంద్ర ఇప్పటికే హై-సెక్యూరిటీ సెంట్రల్ జైల్లో పక్కా బందోబస్తు మధ్య కటకటాలు లెక్కబెడుతున్నాడు.    మరోవైపు, పదవి కోల్పోయిన మాజీ హోమ్ మినిస్టర్ భార్గవ్ రామ్ కూడా తన అక్రమాల కేసులో రిమాండ్ ఖైదీగా అదే జైలుకు చేరుకున్నాడు. చట్టం ముందు మోకరిల్లి […]

3 min 12 views
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ Premium

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 15

మరుసటి రోజు ఉదయం విలాసవంతమైన కోర్టు హాల్ నిశ్శబ్దంగా ఉంది. బోనులో నిలబడి ఉన్న రాజేంద్ర, మాజీ పొలిటికల్ మినిస్టర్ భార్గవ్ రామ్ ముఖాల్లో అప్పటివరకు ఉన్న అహంకారం కాస్తా సడలింది. వారి తరపున రాష్ట్రంలోనే పేరుమోసిన క్రిమినల్ లాయర్ వాదిస్తున్నాడు. “యువర్ ఆనర్! ప్రాసిక్యూషన్ మోపిన ఆరోపణలన్నీ అభూత కల్పనలు అని రఘు మైనింగ్ క్వారీలో గుండెపోటుతో (Heart Attack) చనిపోయాడని పోస్ట్‌మార్టం రిపోర్ట్ స్పష్టంగా చెబుతోంది.    ఒకవేళ అది హత్యే అయితే, దానికి  […]

3 min 8 views